Demolition of shops
-
అయోధ్యలో బాలికపై గ్యాంగ్రేప్..నిందితుడి దుకాణాల కూల్చివేత
అయోధ్య: అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్నకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయీద్ ఖాన్ అనే వ్యక్తి దుకాణ సముదాయాన్ని జిల్లా అధికా రులు గురువారం కూల్చి వేశారు. పురాకలంధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదర్సానగర్లో మొయీద్ ఖాన్ బేకరీ నడుపుతున్నాడు. మొయీద్తోపాటు అతడి పనిమనిషి రాజు ఖాన్ ఓ బాలికపై రెండునెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వారు వీడియో తీశారు.బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో జూలై 30న పోలీసులు మొయీద్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 3న అతడు నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దానిని నిర్మించినట్లు అధికారులు అంటున్నారు. తాజాగా, గురువారం మొయీద్ ఖాన్కు చెందిన దుకాణ సముదాయాన్ని కూల్చి వేశారు. దానిని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడన్నారు. ఆ సమయంలో భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మొయీద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ సభ్యుడు, ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ అనుచరుడని బీజేపీ నేతలతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపిస్తున్నారు. -
అందుకే ఆ షాపును జేసీబీతో కూల్చేశా..
తిరునవంతపురం: అధికారులు తమ విన్నపాన్ని పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు స్వయంగా తానే రంగంలోకి దిగాడు. పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారనే కోపంతో పొరుగింటి వ్యక్తి షాపును జేసీబీతో కూల్చివేశాడు. పైగా అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకే దానిని పడగొట్టాటని తన చర్యను సమర్థించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాలు... కన్నూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ల అల్బిన్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంట్లో వాళ్లు అతడికి ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూసినా ఫలితం దక్కలేదు. దీంతో తమ పొరుగున షాపు యజమానే ఇందుకు కారణమని భావించిన అల్బిన్, అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించాడు. (చదవండి: కేరళలో వివాదాస్పదంగా మారిన సంఘటన) ఈ క్రమంలో సోమవారం జేసీబీతో సదరు షాపును కూలగొట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, మలయాళ సినిమా అయ్యప్పనం కోశియంలోని రియల్ లైఫ్ సన్నివేశాల పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఈ షాపును వేదికగా చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. మద్యం వ్యాపారం చేస్తున్నారు. నాలాంటి ఎంతో మంది యువకులకు ఇది అస్సలు నచ్చడం లేదు. ఈ విషయం గురించి మేం ఎన్నోసార్లు పోలీసులకు, గ్రామ అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే నేను ఆ షాపును కూల్చేశాను’’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక షాపు ఓనర్, తనకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని పేర్కొన్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అల్బిన్ను అరెస్టు చేశారు. అతడి ఆరోపణల్లో నిజం లేదని, షాపు కూల్చివేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
దుకాణాల కూల్చివేత ను అడ్డుకున్న భూమా
ఆళ్లగడ్డ రూరల్/టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దుకాణాలను ఆదివారం అధికారులు కూల్చివేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కూల్చివేతను అడ్డుకొన్నారు. అహోబిలం మఠానికి ఒక న్యాయం న్యాయం..సామాన్య ప్రజలకు మరో న్యాయమా అంటూ అధికారులపై భూమా మండిపడ్డారు. బాధితులకు అన్నీ సమకూర్చిన తరువాతే కూల్చివేత పనులు ప్రారంభించాలని సూచించారు. అహోబిలంలో 210 సర్వే నంబర్ దేవస్థానానికి చె ందిన ఆస్తి. అయితే ఇందులో 50 సంవత్సరాల క్రితం గ్రామస్తులు రేకులషెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్నారు. దాదాపు 250 కుటుంబాల వారు ఈ దుకాణాల్లో భక్తులకు అవసరమైన వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయితే దేవస్థానం పరిధిలోని దుకాణాలు తొలగించాలని మఠం ప్రతినిధి రంగరాజన్ కోర్టు ఉత్తర్వులతో పోలీసులను వెంటబెట్టుకొని ఆదివారం ఇక్కడికి వచ్చారు. ప్రొక్లయిన్లతో చిన్న సుంకన్న, పల్లె సాంబయ్య, వీరభద్రుడుల దుకాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వచ్చి నిరసన తెలిపారు. వ్యాపార సముదాయాలను కూల్చివేస్తే తాము ఎలా బతకాలంటూ కొందరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు వారిని వారించారు. వందలాది మంది బాధితులు ఒక వైపు, మఠం ప్రతినిధులు మరొక వైపు ఉండడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూమా రాకతో ఆగిన కూల్చివేత పనులు.. అహోబిలంలో వ్యాపారుల రేకుల షెడ్లు కూల్చివేస్తున్నారని సమాచారం తెలుసుకున్న భూమా నాగిరెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. తొలగింపు ప్రక్రియ వెంటనే నిలిపివేయించారు. బాధితుల తరఫున అక్కడే అధికారులతో మాట్లాడారు. 210 సర్వే నంబర్లో మఠం విశ్రాంతి గదులను మొదట కూల్చివేసి తరువాత దుకాణాల సముదాయాలను తొలగించాలని డిమాం డ్ చేశారు. మఠం ఆస్తులకో న్యాయం, సామాన్య ప్రజలకో న్యాయం పనికిరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఇచ్చినా లెక్క చేయకుండా సాంబయ్య ఇంటిని, దుకాణాన్ని ఎలా తొలగిస్తారని భూమా ప్రశ్నించారు. బాధితులకు పునరావాసం కల్పించకుండా తొలగింపు పనులు ఎలా చేపడతారని మండిపడ్డారు. భారీ పోలీస్ బందోబస్త్: దుకాణాల కూల్చివేతలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ రామాంజనేయరెడ్డి, సీఐలు సుధాకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పది మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ 50 మంది, 30 మంది మహిళా కానిస్టేబుల్ బందోబస్తులో పాల్గొన్నారు. భూమా వెంట వైఎస్సార్సీపీ నాయకులు బీవీ రామిరెడ్డి, కుమార్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాముయాదవ్, రామోహన్రెడ్డి, సిద్ది సత్యం, న్యాయవాదులు శివరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డిలు ఉన్నారు.