బాలికపై అత్యాచారం: నిందితుడి అరెస్టు | man arrested who raped a girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం: నిందితుడి అరెస్టు

Published Wed, Jul 29 2015 5:01 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

man arrested who raped a girl

రంగారెడ్డి జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు వయసున్న అమ్మాయిని చాక్లేట్ ఇస్తానని పిలిచి అఘాయిత్యానికి ఒడిగ ట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు జాఫన్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కండకు చెందిన ఒక కుటుంబం రెండేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు వలస వచ్చింది. అప్పటినుంచి భార్యా భర్తలు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్దమ్మాయి(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది.

ఈ నెల 18న రంజాన్ పండగ రోజున చిన్నారి ఇంటి దగ్గరే ఆడుకుంటున్న సమయంలో పొరుగింట్లో నివసించే  జాఫర్(46) చాక్లెట్ల ఆశచూపి అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు.  దీంతో ఆ అమ్మాయికి తీవ్ర రక్త స్రావమైంది. గాభరాపడిన తల్లిదండ్రులు హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యురాలు పాపపై అత్యాచారం జరిగిందని నిర్ధరించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఈ వార్త బయటకు రావడంతో.. సాక్షి దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement