Auto drivers gang molestated a woman in Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ఆటోగ్యాంగ్ గ్యాంగ్‌‌రేప్‌.. 9 ఏళ్ల తర్వాత శిక్షలు ఖరారు

Published Sat, Jun 24 2023 9:16 AM | Last Updated on Sat, Jun 24 2023 9:56 AM

Auto drivers gang molestation In Hyderabad - Sakshi

హైదరాబాద్: లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులకు ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా, పలాసాకు చెందిన యువతి 2014సెప్టెంబర్ 10న మియాపూర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచి్చంది. 11న ఆమె తన అక్క, బావతో కలిసి శిల్పారామం వెళ్లిం. రాత్రి శిల్పారామం నుంచి మియాపూర్‌ అంజయ్యకాలనీలోని ఇంటికి వెళ్లేందుకు అక్కడే ఉన్న వాహిద్‌ ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారు.

 మార్గమధ్యంలో వాహీద్‌ స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్‌ కూడా ఆటోలో ఎక్కారు. అంజయ్యనగర్‌కు వెళ్లే మార్గంలో కాకుండా ఆటో మరో మార్గంలో వెళ్తుండడంతో యువతి బావ వహీద్‌ను ప్రశ్నించాడు. దీంతో వారు నలుగురు అతడిని కొట్టి కిందకు తోసేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి సోదరిని కూడా ఆటోలో నుంచి గెంటేశారు. అనంతరం యువతిని పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. 

వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు రోడ్డుపైకి వచ్చి స్థానికుల సహాయంతో అక్క, బావ వద్దకు చేరింది. అదే రోజు రాత్రి మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ వాహీద్‌తో పాటు అతడి స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్‌లను అరెస్టు చేసి కోర్టులో చార్జిట్‌ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు శుక్రవారం నిందితులు నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల   చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement