auto Gang
-
హైదరాబాద్: ఆటోగ్యాంగ్ గ్యాంగ్‌రేప్.. 9 ఏళ్ల తర్వాత శిక్షలు ఖరారు
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులకు ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా, పలాసాకు చెందిన యువతి 2014సెప్టెంబర్ 10న మియాపూర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచి్చంది. 11న ఆమె తన అక్క, బావతో కలిసి శిల్పారామం వెళ్లిం. రాత్రి శిల్పారామం నుంచి మియాపూర్ అంజయ్యకాలనీలోని ఇంటికి వెళ్లేందుకు అక్కడే ఉన్న వాహిద్ ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారు. మార్గమధ్యంలో వాహీద్ స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్ కూడా ఆటోలో ఎక్కారు. అంజయ్యనగర్‌కు వెళ్లే మార్గంలో కాకుండా ఆటో మరో మార్గంలో వెళ్తుండడంతో యువతి బావ వహీద్‌ను ప్రశ్నించాడు. దీంతో వారు నలుగురు అతడిని కొట్టి కిందకు తోసేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి సోదరిని కూడా ఆటోలో నుంచి గెంటేశారు. అనంతరం యువతిని పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు రోడ్డుపైకి వచ్చి స్థానికుల సహాయంతో అక్క, బావ వద్దకు చేరింది. అదే రోజు రాత్రి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ వాహీద్‌తో పాటు అతడి స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్‌లను అరెస్టు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు శుక్రవారం నిందితులు నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
అతివకు అభయమేదీ?
ఆగని అఘాయిత్యాలు మొన్న ఫామ్‌హౌస్‌లో స్నేక్‌గ్యాంగ్ అకృత్యం నిన్న మేడిపల్లిలో ఆటోగ్యాంగ్ దారుణం శనివారం అర్ధరాత్రి కూకట్‌పల్లిలో ఘోరం ఆందోళనరేకెత్తిస్తున్న ఘటనలు నేరాల అదుపులో పోలీస్ వైఫల్యం మూడేళ్లలో లైంగిక దాడులు 521 శిక్షలు పడింది నలుగురికే... సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో నేరగాళ్లు విజృంభిస్తున్నారు. అఘాయిత్యాలు, అకృత్యాలను నిరాటంకంగా కొనసాగిస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఫలి తంగా మహిళలకు రక్షణ కరువైంది. గ్రేటర్ పరిధిలో నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలు జలదరింప చేస్తున్నాయి. పాలకులు హైదరాబాద్‌కు విశ్వఖ్యాతిని తీసుకొస్తామని.. నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నా అకృత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల పహాడీషరీఫ్ ఫామ్‌హౌస్‌లో ఓ యువతిపై... రెండు రోజుల క్రితం మేడిపల్లి అటవీ ప్రాంతంలో గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్.. ఈ ఘటనలను మరువక ముందే శనివారం అర్ధరాత్రి కూకట్పల్లి ప్రాంతంలో ఓ మహిళపై కూడా సామూహిక అత్యాచారం జరిగింది. అంతటితో ఆగకుండా దారుణంగా హత్య చేశారు. కఠిన శిక్షలు పడకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 2011 నుంచి 2013 వరకు జంట పోలీసు కమిషనరేట్లలో మహిళలపై జరిగిన దారుణాలకు సంబంధించి 10,557 కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక దాడికేసులు 521 ఉన్నాయి. మరోవైపు చోరీలు, చైన్ స్నాచింగ్‌లూ సర్వసాధారణంగా మారాయి. యువతులు, మహిళలు బయటకు వెళ్తే వారి ఒంటిపై ఉండే ఆభరణాలకే కాదు వారి ప్రాణాలకూ భద్రత లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. నగరంలో 504 మంది మహిళా పోలీసులు అవసరం ఉండగా కేవలం 273 మంది మాత్రమే ఉన్నారు. సాగని కేసుల దర్యాప్తు.. నిర్భయ వంటి కఠిన చట్టాన్ని రూపొందించినా మృ గాళ్లలో మార్పు రావడం లేదు. అత్యాచారాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దుండగులకు సకాలంలో శిక్షలు పడకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. గత మూడేళ్లలో లైంగిక దాడులకు సంబంధించి 521 కేసులు నమోదు కాగా, కేవలం నలుగురికి మాత్రమే శిక్ష పడింది. పోలీసుల దర్యాప్తు తీరు సరిగా లేనందునే ఈ పరిస్థితి ఎదుర వుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరస్తులకు తగిన శిక్ష పడితే నేరాల శాతం తగ్గుతుందని వివిధ వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం, ఆ తరువాత సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలమవుతుండడంతో నిందితులు కేసుల నుంచి సులువుగా బయటపడుతున్నారనే వాదన ఉంది.