seven years imprisonment
-
హైదరాబాద్: ఆటోగ్యాంగ్ గ్యాంగ్‌రేప్.. 9 ఏళ్ల తర్వాత శిక్షలు ఖరారు
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులకు ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా, పలాసాకు చెందిన యువతి 2014సెప్టెంబర్ 10న మియాపూర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచి్చంది. 11న ఆమె తన అక్క, బావతో కలిసి శిల్పారామం వెళ్లిం. రాత్రి శిల్పారామం నుంచి మియాపూర్ అంజయ్యకాలనీలోని ఇంటికి వెళ్లేందుకు అక్కడే ఉన్న వాహిద్ ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారు. మార్గమధ్యంలో వాహీద్ స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్ కూడా ఆటోలో ఎక్కారు. అంజయ్యనగర్‌కు వెళ్లే మార్గంలో కాకుండా ఆటో మరో మార్గంలో వెళ్తుండడంతో యువతి బావ వహీద్‌ను ప్రశ్నించాడు. దీంతో వారు నలుగురు అతడిని కొట్టి కిందకు తోసేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి సోదరిని కూడా ఆటోలో నుంచి గెంటేశారు. అనంతరం యువతిని పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు రోడ్డుపైకి వచ్చి స్థానికుల సహాయంతో అక్క, బావ వద్దకు చేరింది. అదే రోజు రాత్రి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ వాహీద్‌తో పాటు అతడి స్నేహితులు ముస్తాఫా, షరీఫ్, నజీర్‌లను అరెస్టు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉప్పర్‌పల్లి ఫోక్సో కోర్టు శుక్రవారం నిందితులు నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
చోటా రాజన్‌కు ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు మంగళవారం శిక్ష ఖరారైంది. రాజన్‌తో పాటు మరో ముగ్గురికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు 15 వేల జరిమానా కూడా విధించింది. రాజన్‌తో పాటు దీనికి సహకరించిన ముగ్గురు రిటైర్డ్ అధికారులు జయశ్రీ దత్తాత్రేయ రహతే, దీప్ నట్వర్ లాల్షా, లలితా లక్ష్మణన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జి వీరేందర్ కుమార్ గోయల్ దోషులుగా నిర్ధారిస్తూ పై శిక్షనే ఖరారు చేశారు. రాజన్ తీహార్ జైలులో ఉండగా, బెయిల్ పై బయట ఉన్న మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ‘దావూద్‌ను పట్టుకోవడానికి, ఉగ్ర వాదాన్ని అణచివేసేందుకు కృషి చేస్తున్న నిఘా సంస్థలకు సాయం చేశా’ అని రాజన్ కోర్టుకు విన్నవించాడు. రాజన్ చెప్పిన ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. -
మృగాళ్లకు ఏడేళ్ల జైలు
కరీంనగర్ లీగల్, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మృగాళ్లకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రంజన్‌కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాలు ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన బాలిక(16) తల్లితండ్రులు మరణించడంతో అదే గ్రామంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. ఎల్కతుర్తి సాంఘిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటుంది. 2011, జూన్ 16న పట్టణంలోని వావిలాలపల్లిలో ఉంటున్న మామ ఇంటికి వెళ్లింది. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో కొడిమ్యాల వెళ్లేందుకు కోర్టు ముందు బస్టాండ్‌లో వేచిచూస్తుండగా కరీంనగర్‌కు చెందిన యుగందర్ (32), అఫ్జల్(28) వచ్చి, తమ ఆటో గంగాధర వెళ్తుందని నమ్మబలికారు. వారి మాటలు నమ్మి ఆటోలో ఎక్కగా బెదిరించి రేకుర్తి గుట్టల వద్దకు తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరో వ్యక్తిని కూడా అక్కడకు పిలిపించుకోగా అతను వారించడంతో దాడికి దిగారు. ఆ తర్వాత బాధితురాలిని రేకుర్తి బస్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై కరీంనగర్‌రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన సాక్షుల కథనం విన్న జడ్జి, నిందితులపై నేరం రుజువు కావడంతో వారిద్దరికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.