కరీంనగర్ లీగల్, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మృగాళ్లకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రంజన్‌కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాలు ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కొడిమ్యాలకు చెందిన బాలిక(16) తల్లితండ్రులు మరణించడంతో అదే గ్రామంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. ఎల్కతుర్తి సాంఘిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటుంది. 2011, జూన్ 16న పట్టణంలోని వావిలాలపల్లిలో ఉంటున్న మామ ఇంటికి వెళ్లింది.
ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో కొడిమ్యాల వెళ్లేందుకు కోర్టు ముందు బస్టాండ్‌లో వేచిచూస్తుండగా కరీంనగర్‌కు చెందిన యుగందర్ (32), అఫ్జల్(28) వచ్చి, తమ ఆటో గంగాధర వెళ్తుందని నమ్మబలికారు. వారి మాటలు నమ్మి ఆటోలో ఎక్కగా బెదిరించి రేకుర్తి గుట్టల వద్దకు తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరో వ్యక్తిని కూడా అక్కడకు పిలిపించుకోగా అతను వారించడంతో దాడికి దిగారు. ఆ తర్వాత బాధితురాలిని రేకుర్తి బస్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై కరీంనగర్‌రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన సాక్షుల కథనం విన్న జడ్జి, నిందితులపై నేరం రుజువు కావడంతో వారిద్దరికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
మృగాళ్లకు ఏడేళ్ల జైలు
Published Thu, Apr 17 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM
Advertisement