
మహారాష్ట్ర: కూతురిని ఆత్మహత్య నాటకం పేరుతో నమ్మించి కన్నతండ్రే హతమార్చాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లోని కలమ్మా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...కూతురుని ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం ఆడదామని చెప్పి తమ బంధువుల పేర్లతో సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు స్టూల్ మీద నుంచోమని చెప్పి తాను ఫోటో తీస్తూ... స్టూల్ లాగేసి ఏమి తెలియనట్లు బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తే పోలీసులను పిలిపించి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.
పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఆమె గదిలోని సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసును దర్యాప్తు చేసే విషయమే తండ్రిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతని మొబైల్ ఫోన్‌ని పరిశీలించగా.. కూతురు ఉరివేసుకున్న ఫోటోను చూసి ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో గట్టిగా ప్రశ్నించగా...తాను చంపినట్లు ఒప్పుకున్నాడు.
తన మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు అని ఆమె చనిపోయిన తర్వాత మరో వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. ఐతే ఆమె కూడా తనను వదిలి వెళ్లిపోవడంతో... ఆమెకు బుద్ది వచ్చేలా చేసేందుకు ఇలా కూతురి చేత ఆత్మహత్య నాటకం ఆడించానని చెప్పాడు. ఆమె ఉరివేసుకునే ముందు మొత్తం ఐదు సూసైడ్ నోట్‌లు రాయించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసు: మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా: నళిని శ్రీహరన్)
Comments
Please login to add a commentAdd a comment