టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ కూడా ఒకరు. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి చదువుకోవడంతో స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమగా మారిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
(ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్)
రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ పెళ్లి టాపిక్‌లోకి ఎంట్రీ ఇచ్చారని, రామ్ తరపున అమ్మాయి తండ్రితో కూడా ఆయన చర్చలు జరిపారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే రామ్ పెళ్లి జరుగుతుందని ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై తాజాగా స్రవంతి రవికిషోర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలను ఆయన కొట్టిపారేసినట్లు సమాచారం. ఒకవేళ రామ్ పెళ్లికి రెడీ అయితే దాన్ని దాచాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్ధలు కొట్టాడట. ఈ ఏడాదే పెళ్లి జరగనుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
(ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్)
Comments
Please login to add a commentAdd a comment