అనుష్కపై మళ్లీ అవే రూమర్స్‌ | Again Marriage Rumors On Anushka Shetty | Sakshi
Sakshi News home page

అనుష్కపై మళ్లీ అవే రూమర్స్‌

Published Sun, Oct 6 2024 11:36 AM | Last Updated on Sun, Oct 6 2024 12:03 PM

Again Marriage Rumors On Anushka Shetty

ఇప్పటి వరకు తెలుగు, తమిళం భాషలకే పరిమితం అయిన అనుష్క తాజాగా మాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. అరుంధతి చిత్రంతో తన నటనా ప్రతిభను ప్రదర్శించిన ఈమె రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాలతో తనకు తానే చాటి అని చాటారు. అలాంటి అనుష్క నట జీవితం  'సైజ్‌ జీరో' చిత్రంతో ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిత్రంలోని పాత్ర కోసం భారీగా బరువు పెంచిన అనుష్క ఆ తరువాత ఆ బరువును తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

అయినప్పటికీ ఆ తరువాత 'సైలెన్స్‌' అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరచింది. ఇటీవల 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలి శెట్టి' చిత్రంలో నటించి సక్సెస్‌ను అందుకున్నారు. కాగా ప్రస్తుతం మలయాళంలో 'కాత్తనార్‌' అనే చిత్రం చేస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి మలయాళ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా 'భాగమతి' చిత్రానికి సీక్వెల్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క పెళ్లికి సిద్ధం అవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈమె దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వీరి పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు మునిగి తేలుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇంతకు ముందు కూడా అనుష్క పెళ్లిపై పలుమార్లు ప్రచారం జరిగింది. అదేదీ నిజం కాలేదు. ఆమె కూడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. మరి తాజాగా జరుగుతున్న పెళ్లి ప్రచారంౖలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement