bussiness man
-
రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. -
వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ పెళ్లి?
టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ కూడా ఒకరు. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి చదువుకోవడంతో స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమగా మారిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్) రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ పెళ్లి టాపిక్‌లోకి ఎంట్రీ ఇచ్చారని, రామ్ తరపున అమ్మాయి తండ్రితో కూడా ఆయన చర్చలు జరిపారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే రామ్ పెళ్లి జరుగుతుందని ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై తాజాగా స్రవంతి రవికిషోర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలను ఆయన కొట్టిపారేసినట్లు సమాచారం. ఒకవేళ రామ్ పెళ్లికి రెడీ అయితే దాన్ని దాచాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్ధలు కొట్టాడట. ఈ ఏడాదే పెళ్లి జరగనుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) -
180 ఏళ్లు బతకాలని ఎముక మజ్జను తొలగించి..
వాషింగ్టన్: 47 ఏళ్ల వయసు ఇంకా ఎదో సాధించాలనే సంకల్పంతో ఓ వ్యక్తి 180 ఏళ్లు బతకాలని ఆశిస్తున్నాడు. ఇందుకోసం అతడు విచిత్రమైన పద్దతులను పాటిస్తున్నాడు. ఈ పద్దతులతో మనిషి 180 ఏళ్లు బతకడం సాధ్యమేనని చెబుతున్నాడు అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డేవ్ ఆస్ప్రే. డేవ్ బుల్లెట్‌ఫ్రూఫ్ అనే అమెరికా కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న డేవ్ ఇంకా 133 ఏళ్లు బతకడానికి సైన్స్‌తో పాటు టెక్నాలజీని వాడుకుంటున్నాడు. అయితే అతడి తీరును చూసి చాలా మంది పిచ్చి వేషాలంటూ తీసిపారేస్తుంటే.. అతడు మాత్రం తనని తాను బయోహ్యాకర్గా పిలుచుకుంటున్నాడు. సైన్స్, టెక్నాలజీ సాయంతో జీవశాస్త్రాన్ని నియంత్రణలో తెచ్చుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వ్యక్తిని ‘బయోహ్యాకర్’ అంటారు. కాగా డేవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంకా సాధించేది చాలా ఉంది. అందుకే ఇంకా ఎక్కువ ఏళ్లు బతకాలనుకంటున్నాను. అందుకే 6 నెలలకు ఒకసారి ఎముక మజ్జ(బోన్ మ్యారో)లో కొంత భాగాన్ని తొలగించి దాని నుంచి మూలకణాలను(స్టెమ్ స్టెల్స్) తీసుకుని శరీరమంతా ఎక్కిస్తే నూతన ఉత్తేజం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంకా133 ఏళ్లు బతుకుతానని నా నమ్మకం. ఈ క్రమంలో తరచూ కోల్డ్ క్రియోథెరపీ చేయాలి. అంటే అత్యంత చల్లగా ఉండే చాంబర్లో కూర్చోడం వల్ల ద్రవరూప నైట్రోజన్‌ను నా శరీరాన్ని చల్లబరుస్తుంది. తలకు కూడా ఎలక్టోడ్లు అమర్చుకుని పరారుణ కాంతి కింద గడపాలి’ అంటూ వివరించాడు. అలాగే కొన్ని సార్లు ఉపవాసం కూడా ఉంటాడట. అతను నిత్యయవ్వనంగా కనిపించేందుకు కోసం నిద్ర సమయాన్ని, కఠిమైన ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పాడు. అయితే డేవ్ ఈ పద్దతులను పాటించేందుకు ఇప్పటి వరకు దాదాపు 13 కోట్లు పైగా వెచ్చించినట్లు తెలిపాడు. కాగా 2012లో అమెరికాలో బుల్లెట్ఫ్రూప్తో కాఫీ బ్రాండ్ ప్రారంభించాడు. ఈ కాఫీతో వెన్న(బట్టర్), కొబ్బరి నూనేతో తయారు చేస్తారు. అయితే అతడి కాఫీ బ్రాండ్‌పై అమెరికా వైద్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాఫీలో బట్టర్ కలపడం ఆరోగ్యకరం కాదని హెచ్చరిస్తుంటే డేవ్ మాత్రం ఈ కాఫీ అరుదైన రుచి అందిస్తుందని చెబుతున్నాడు. ఇది తాగితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నాడు. 2004లో టిబెట్ పర్యటనకు వెళ్లినప్పుడు బుల్లెట్‌ఫ్రూఫ్ కాఫీ తయారి ఆలోచన వచ్చినట్లు డేవ్ వెల్లడించాడు. -
ఏడడుగులేసనా
‘‘నేను సినిమాల నుంచి తప్పుకుంటున్నా.. ఇకపై నటించను’’ అంటూ ఇటీవల ఓ ప్రకటన చేశారు బాలీవుడ్ బ్యూటీ సనాఖాన్. ఆమె అలా ప్రకటించినప్పుడే పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వచ్చాయి.. తాజాగా ఆమె పెళ్లి చేసుకుని, అందరికీ షాక్ ఇచ్చారు. తెలుగులో నాగార్జున ‘గగనం’, కల్యాణ్‌రామ్ ‘కత్తి’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. హిందీ ‘బిగ్‌బాస్’ సీజన్ 6లోనూ పాల్గొన్నారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను ఆమె పెళ్లాడారు. భర్తతో సనాఖాన్ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఈ నవదంపతులు ‘నిఖా ముబారక్’ అని రాసి ఉన్న కేక్ కట్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో చాలా సింపుల్‌గా ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగిన ట్లు తెలుస్తోంది. ∙ముఫ్తీ అనాజ్, సనాఖాన్ -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
తుని: కుటుంబ పోషణ కోసం ఇద్దరు ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించారు. అనూహ్యంగా ఆదాయం వచ్చింది. ఇద్దరు మధ్య ఆర్థికపరమైన మనస్పర్థలు వచ్చాయి. కట్ చేస్తే వరుసకు మామైన నల్లమిల్లి రాజారెడ్డి(59)ని అల్లుడు మారెడ్డి దారుణంగా హత్య చేశాడు. బుధవారం జరిగిన సంఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, తుని పట్టణ సీఐ రమేష్‌బాబు కథనం ఇలా.. రాయవరం మండలం పుసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి రాజారెడ్డి, కర్రి మారెడ్డిలు 2006లో ఫైనాన్స్ వ్యాపారం చేపట్టారు. తుని పట్టణం సీతారాంపురంలో ఇంటిని అద్దెకు తీసుకుని పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నారు. అప్పట్లో మారెడ్డి వ్యాపారంలో రూ.ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాడు. 2014 వరకు వ్యాపారం సజావుగా సాగింది. ప్రతి సోమవారం తుని వచ్చి రెండు రోజుల పాటు వసూళ్లు చేసుకుని సొంత ఊళ్లకు వెళ్లేవారు. రాజారెడ్డి కుటుంబం విశాఖ జిల్లా విశాఖపట్టణంలో ఉంటున్నారు. మారెడ్డి పసలపూడిలో ఉంటున్నారు. అకౌంట్ విషయంలో వివాదం మొదలైంది. రాజారెడ్డి అకౌంట్‌ను చూసేవారు. ఉమ్మడి వ్యాపారంలో రూ.11 లక్షలు తేడా వచ్చింది. ఇదే విషయాన్ని మారెడ్డి తరచూ రాజారెడ్డిని ప్రశ్నించారు. తొందరలోనే సెటిల్ చేస్తానని చెప్పాడు. ఐదు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. సోమవారం రాజారెడ్డి, మారెడ్డితో పాటు రాజారెడ్డి మేనల్లుడు హరినాథ్‌రెడ్డి తుని పట్టణంలోని సీతారాంపురం అద్దె ఇంటికి వచ్చారు. మంగళవారం లైన్‌కు వెళ్లి కలెక్షన్ చేసుకుని సాయంత్రం గదికి వచ్చారు. హరినాథ్‌రెడ్డి బయటకు వెళ్లి ముగ్గురికి టిఫిన్ తీసుకువచ్చాడు. అనంతరం రాజారెడ్డి, హరినాథ్‌రెడ్డి ఒక గదిలో, మారెడ్డి వేరే గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మారెడ్డి రాజారెడ్డి పడుకున్న గదిలోకి వెళ్లాడు. నిద్రలో ఉన్న రాజారెడ్డి తలపై ఇనుప రోడ్డుతో కొట్టాడు. శబ్ధం రావడంతో హరినాథ్‌రెడ్డి లేచి మారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మారెడ్డి విచక్షణ కోల్పోయి కొట్టడంతో రాజారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన హరినాథ్‌రెడ్డి కటుంబ సభ్యులకు, వారు 108 అంబులెన్స్‌కు సమచారం ఇచ్చారు. గాయపడిన రాజారెడ్డిని అంబులెన్స్‌లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పట్టణ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్యకు దారి తీసిన పరి«స్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి హరినాథ్‌రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. -
అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య
న్యూయార్క్: బాలికల విక్రయం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి జెఫ్రీ ఎప్స్టీన్(66) జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. బాలికలను, ముఖ్యంగా 14 ఏళ్లలోపు వారిని విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై అతడు ప్రస్తుతం మన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ జైలులో ఉన్నాడు. ఎప్స్టీన్ గతంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ వంటి పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు సాగించేవాడు. మన్‌హట్టన్, పామ్‌బీచ్‌లలోని తన నివాసాల్లో 2002–2005 మధ్య టీనేజీ బాలికలను వాడుకోవడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఆరోపణలు రుజువైతే 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. -
వ్యాపారవేత్త ఇంటి నుంచే ప్రణాళిక
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ రోజున వరుస బాంబు పేలుళ్ల వ్యవహారంలో కొత్త అంశాలు తెరమీదకొచ్చాయి. ఆత్మాహుతి దాడులకు శ్రీలంకలోని ప్రముఖ సుగంధద్రవ్యాల వ్యాపారవేత్త ఇల్లు కేంద్రంగా పనిచేసిందని అధికారులు గుర్తించారు. కొలంబో కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్త మొహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు ఈ దాడిలో పాల్గొన్నారు. వీరిలో ఒకరు షాంగ్రీలా హోటల్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు సినమన్ హోటల్ వద్ద తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. దాడులకు అవసరమైన పేలుడు పదార్థాలను ఇక్కడే భద్రపరిచారన్నారు. ఈ ఉగ్రమూకకు జహ్రన్ హషీమ్(40) అనే ఉగ్రవాది నేతృత్వం వహించాడని చెప్పారు. ఉగ్రదాడులు జరిగిన అనంతరం ఇబ్రహీం ఇంట్లో తనిఖీల కోసం పోలీసులు రాగానే ఇబ్రహీం కోడలు పేలుడు పదార్థాలను పేల్చేసింది. దీంతో ఆమెతో పాటు పోలీస్ అధికారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త యూసుఫ్ ఇబ్రహీంను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. అందరూ విద్యావంతులే.. ఈ ఉగ్రదాడిలో మొత్తం 9 మంది ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి విజేవర్ధనే తెలిపారు. అంతేకాకుండా వీరంతా బాగా చదువుకున్నవారేనని వ్యాఖ్యానించారు. ‘ఆత్మాహుతిదాడికి పాల్పడ్డవారిలో ఒకరు బ్రిటన్‌లో చదువుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఈ దారుణానికి తెగబడ్డ తొమ్మిది మందిలో 8 మందిని ఇప్పటికే గుర్తించాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరి వివరాలను ఇప్పుడే బయటపెట్టలేం’ అని వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపులోకివచ్చేవరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని విజేవర్ధనే పేర్కొన్నారు. కాగా, షాంగ్రీలా హోటల్‌పై ఏప్రిల్ 21న అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. లతీఫ్ 2006–07 మధ్యకాలంలో బ్రిటన్‌లోని కింగ్స్టన్ విశ్వవిద్యాయలంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేశాడని వెల్లడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇతను, అక్కడ మాస్టర్స్ పూర్తిచేసినట్లు పేర్కొంది. శ్రీలంక పేలుళ్లకు తమిళనాడులో కుట్ర? సాక్షి ప్రతినిధి, చెన్నై: పేలుళ్లకు సంబంధించిన కీలక సూత్రధారి ఒకరు కోయంబత్తూర్ వచ్చిరనే సమాచారంతో ఎన్ఐఏ, ఎస్ఐసీ పోలీసులు రహస్యంగా విచారించారు. కోయంబత్తూరులో హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు కుట్రపన్నిన స్థానికులు ఇద్దరు, చెన్నైకి చెందిన నలుగురిని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్ సానుభూతి పరులుగా తేలడంతో ఈ కేసును ఎన్ఐఏ విచారణకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు అరెస్టైన వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి పెన్ డ్రైవ్‌లను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఐసిస్ సానుభూతి పరులైన ఆ ఆరుగురిని శుక్రవారం మరోసారి ఎన్ఐఏ అధికారులు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. -
నమ్మించి.. అరకోటితో ఉడాయించాడు
హైదరాబాద్: ఆస్తులున్నాయని అందరినీ నమ్మించి అరకోటితో ఉడాయించాడో వ్యాపారి. వివరాలివీ.. నగరంలోని చిక్కడపల్లి, వివేక్నగర్కు చెందిన భూపతి రామకృష్ణ స్థానికంగా కిరాణ షాపు నడుపుతున్నాడు. తనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నమ్మించి.. తెలిసిన వారి నుంచి దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈ నెల 14వ తేదీ నుంచి భార్య, బిడ్డలతో పాటు కనిపించకుండాపోయాడు. అతని రెండు సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. రామకృష్ణ కనిపించకపోవటంతో బాధితులు అతడి ఇంటితో పాటు షాపువద్దకు వెళ్లి వాకబుచేశారు. జాడ తెలియరాక పోవటంతో బుధవారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు వ్యాపారి ఆత్మహత్య
షోలాపూర్, న్యూస్‌లైన్: పూర్వీకుల కాలంలోనే ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్న తెలుగు వ్యాపారవేత్త సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. జైలురోడ్డు పోలీసులు అందించిన వివరాల మేరకు.. కర్ణిక్‌నగర్‌లో నివాసముంటున్న జగదీశ్ (42) తన ఇంట్లోని గదిలోనే ఆయుధంతో గొంతును కోసుకున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్న ఆయనను చూసి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక మార్కండేయ సహకార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జగదీశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా జగదీశ్ గత అనేక ఏళ్లుగా సాకార్‌పేట్‌లో నూలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వివిధ సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొనేవారు. తక్కువ వయస్సులోనే నూలు వ్యాపారరంగంలో ప్రగతి సాధించారు. అయితే గత కొన్ని నెలలుగా వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదురవడంతో మనోవేదన చెందేవాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇతనికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.