వాషింగ్టన్: 47 ఏళ్ల వయసు ఇంకా ఎదో సాధించాలనే సంకల్పంతో ఓ వ్యక్తి 180 ఏళ్లు బతకాలని ఆశిస్తున్నాడు. ఇందుకోసం అతడు విచిత్రమైన పద్దతులను పాటిస్తున్నాడు. ఈ పద్దతులతో మనిషి 180 ఏళ్లు బతకడం సాధ్యమేనని చెబుతున్నాడు అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డేవ్ ఆస్ప్రే. డేవ్ బుల్లెట్‌ఫ్రూఫ్ అనే అమెరికా కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న డేవ్ ఇంకా 133 ఏళ్లు బతకడానికి సైన్స్‌తో పాటు టెక్నాలజీని వాడుకుంటున్నాడు. అయితే అతడి తీరును చూసి చాలా మంది పిచ్చి వేషాలంటూ తీసిపారేస్తుంటే.. అతడు మాత్రం తనని తాను బయోహ్యాకర్‌గా పిలుచుకుంటున్నాడు. సైన్స్, టెక్నాలజీ సాయంతో జీవశాస్త్రాన్ని నియంత్రణలో తెచ్చుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వ్యక్తిని ‘బయోహ్యాకర్’ అంటారు.
కాగా డేవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంకా సాధించేది చాలా ఉంది. అందుకే ఇంకా ఎక్కువ ఏళ్లు బతకాలనుకంటున్నాను. అందుకే 6 నెలలకు ఒకసారి ఎముక మజ్జ(బోన్ మ్యారో)లో కొంత భాగాన్ని తొలగించి దాని నుంచి మూలకణాలను(స్టెమ్ స్టెల్స్) తీసుకుని శరీరమంతా ఎక్కిస్తే నూతన ఉత్తేజం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంకా133 ఏళ్లు బతుకుతానని నా నమ్మకం. ఈ క్రమంలో తరచూ కోల్డ్ క్రియోథెరపీ చేయాలి. అంటే అత్యంత చల్లగా ఉండే చాంబర్‌లో కూర్చోడం వల్ల ద్రవరూప నైట్రోజన్‌ను నా శరీరాన్ని చల్లబరుస్తుంది. తలకు కూడా ఎలక్టోడ్‌లు అమర్చుకుని పరారుణ కాంతి కింద గడపాలి’ అంటూ వివరించాడు. అలాగే కొన్ని సార్లు ఉపవాసం కూడా ఉంటాడట. అతను నిత్యయవ్వనంగా కనిపించేందుకు కోసం నిద్ర సమయాన్ని, కఠిమైన ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పాడు.
అయితే డేవ్ ఈ పద్దతులను పాటించేందుకు ఇప్పటి వరకు దాదాపు 13 కోట్లు పైగా వెచ్చించినట్లు తెలిపాడు. కాగా 2012లో అమెరికాలో బుల్లెట్‌ఫ్రూప్‌తో కాఫీ బ్రాండ్ ప్రారంభించాడు. ఈ కాఫీతో వెన్న(బట్టర్), కొబ్బరి నూనేతో తయారు చేస్తారు. అయితే అతడి కాఫీ బ్రాండ్‌పై అమెరికా వైద్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాఫీలో బట్టర్ కలపడం ఆరోగ్యకరం కాదని హెచ్చరిస్తుంటే డేవ్ మాత్రం ఈ కాఫీ అరుదైన రుచి అందిస్తుందని చెబుతున్నాడు. ఇది తాగితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నాడు. 2004లో టిబెట్ పర్యటనకు వెళ్లినప్పుడు బుల్లెట్‌ఫ్రూఫ్ కాఫీ తయారి ఆలోచన వచ్చినట్లు డేవ్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment