bone marrow
-
బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!
క్రానిక్ మైలోయిడ్ లుకేమియా... (సిఎమ్ ఎల్) ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోకి సోకే ఓ అరుదైన క్యాన్సర్.. (సిఎమ్ఎల్). ఇది మొత్తం లుకేమియా కేసుల్లో 15% దాకా ఉండే సీఎంఎల్ బోన్‌మ్యారోను ప్రభావితం చేస్తుంది, ఇది తెల్ల రక్త కణాల నియంత్రణలేని పెరుగుదలకు దారితీస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ కాగానే మొదట్లో భయంకరంగా అనిపించినప్పటికీ, సీఎంఎల్ను సరైన విధానంతో నియంత్రించవచ్చునని గుర్తించడం చాలా ముఖ్యం అంటున్నారు హైదరాబాద్‌లోని నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు. ఆయన చెబుతున్న విశేషాలివి...సీఎంఎల్ నిర్ధారణ అయినప్పటికీ రోగులు సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. అయితే, సీఎంఎల్ నిర్వహణలో సరైన విధానాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చికిత్స చేయని దీర్ఘకాలిక–దశ సీఎంఎల్ వేగంగా వృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన చికిత్సకి, వ్యాధి పెరుగుదలని నివారించడానికి బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, చికిత్స లక్ష్యాలకు కట్టుబడి ఉండటం అవసరం. అదనంగా మీ వైద్యునితో తాజా చికిత్సల గురించి చర్చించడం వలన మీరు చికిత్స ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, మెరుగైన జీవన నాణ్యతకు సహాయపడుతుంది.కొన్ని సందర్భాల్లో సీఎంఎల్ ని ’మంచి క్యాన్సర్’ అని పిలిచినప్పటికీ, సీఎంఎల్ పురోగమిస్తున్న కొద్దీ అది ’మంచిది’ గా ఉండడం మానేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంత మంది రోగులు వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసే మందులకు నిరోధకంగా ఉండవచ్చు లేదా దుష్ప్రభావాలను అనుభవించవచ్చు. అయితే, సకాలంలో జోక్యం, జాగ్రత్తగా పర్యవేక్షించడం ఈ సవాళ్లను నివారించడంలో సహాయపడతాయి.వైద్యపరమైన అంశాలతో పాటు, సీఎంఎల్ కలిగించే భావోద్వేగ ప్రభావాన్ని విస్మరించలేం. సీఎంఎల్ రోగులు ఎదుర్కొనే ప్రారంభ సవాళ్లలో క్యాన్సర్‌తో సంబంధం ఉన్న సామాజిక కళంకం ఒకటి. సామాజిక అంశాల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ రోగనిర్ధారణను దగ్గరి కుటుంబసభ్యులకు మించి బయటి వారికి వెల్లడించడానికి సంకోచిస్తారు. అయితే ఓపెన్ కమ్యూనికేషన్ అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య సహాయాన్ని కోరడం అనేది సంపూర్ణ సీఎంఎల్ నిర్వహణలో ముఖ్యమైనవి.సీఎంఎల్ రోగుల కోసం కొన్ని సూచనలు...నిరంతర పర్యవేక్షణ: చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి, ఏవైనా మార్పులను ముందుగానే తెలుసుకునేందుకు బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. సకాలంలో జోక్యం చేసుకోవ డానికి, వ్యాధి పురోగతిని నివారించడానికి రెగ్యులర్ పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది.దినచర్యలో మానసిక ఆరోగ్య మద్దతు, ఆహారపు సర్దుబాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సీఎంఎల్ నియంత్రణకు వీలు కల్పిస్తుంది.ఆరోగ్య సంరక్షకులు, వైద్యులతో మనసు విప్పి, నిజాయితీగా సంభాషించడం అవసరం. సీఎంఎల్ తో ప్రయాణంలో ఎదుర్కొనే ఏవైనా ఆందోళనలు, లక్షణాలు లేదా సవాళ్లను పంచుకోవాలి.సపోర్ట్ నెట్‌వర్క్‌లు: అనుభవాలను పంచుకోవడానికి, భావోద్వేగ మద్దతును పొందడానికిÜపోర్ట్ గ్రూప్‌ల ద్వారా ఇతర సీఎంఎల్ రోగులతో సంబంధాలు ఏర్పరచుకోండి.నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 నుంచి 1.5 మిలియన్ల మంది సీఎంఎల్ తో జీవిస్తున్నారు. వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా చికిత్స ఫలితాలలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతోంది. సీఎంఎల్ చికిత్సలో భాగమైన టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్స్ , రోగులకు ఫలితాలు జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచాయి.కౌన్సిలింగ్ చాలా ముఖ్యం...‘నేను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అన్ని వయసుల రోగులను చూశా. దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా నిర్ధారణ తర్వాత, చాలా మంది రోగులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు. అందువల్ల, వారికి సరైన కౌన్సెలింగ్ అందించడం చాలా ముఖ్యంప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు, నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం(చదవండి: 'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..) -
నల్లిబొక్క కోసం లొల్లి.. పెళ్లి క్యాన్సిల్.. ‘బలగం’ సీన్ రిపీట్
పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరు తమ వివాహాన్ని ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి అందమైన ఈ వేడుకను కొంతమంది చిన్న చిన్న విషయాలతో ముడిపెట్టి.. పెళ్లిని రద్దు చేసుకునే వరకు వెళ్తున్నారు. అమ్మాయి వాళ్లు మర్యాదలు సరిగా చేయలేదని, కట్నం ఎక్కువ ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వింత వింత కారణాలతో ఏకంగా పీటల మీద కూడా పెళ్లిళ్లు ఆపేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. నిశ్చితార్థం రోజు మటన్‌లో నల్లి బొక్క వడ్డించలేదని ఆగ్రహం చెందిన వరుడి కుటుంబ సభ్యులు చివరికి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన వధువుకి, జగిత్యాలకు చెందిన వరుడితో వివాహం నిశ్చయమైంది. గత నెల నవంబర్‌లో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు భోజనాలను ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథులందరికీ నాన్ వెజ్ వంటలు వండించారు. అయితే నిశ్చితార్థం అనంతరం తమకు మటన్‌లో మూలుగ బొక్క వడ్డించలేదని అబ్బాయి బంధువులు చెప్పడంతో గొడవకు దారితీసింది. దీనిపై స్పందించిన వధువు కుటుంబ సభ్యులు మూలుగు బొక్క వంటకాలలో చేయించలేదని చెప్పడంతో గొడవ కాస్తా పెద్దదిగా మారింది. ఈ వివాదం కాస్తా చివరికి పోలీసుల వరకు చేరుకోవడంతో.. అబ్బాయి కుటుంబ సభ్యులను నచ్చజెప్ప ప్రయత్నం చేశారు. కానీ వారు ససేమిరా అంటూ తమను అవమానించారని అన్నారు. అంతేగాక నల్లి బొక్క మెనూలో లేదన్న విషయాన్ని వధువు కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా తమకు తెలియకుండా దాచిపెట్టారని వాదించారు. చివరికి ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబం తెగేసి చెప్పడంతో వివాహం రద్దు చేసుకున్నారు. అయితే ఈ ఘటన అచ్చం ఇటీవల టాలీవుడ్లో వచ్చిన ‘బలగం’ సినిమాలోని కథను గుర్తు చేసింది. మార్చిలో విడుదలైన ఈ సినిమాలో.. మూలుగ బొక్క కోసం బావ బామ్మర్ధుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. ఇక్కడ కూడా అలాగే మూలుగ బొక్క కోసం గొడవ పడి చివరకు పెళ్లి సంబంధం రద్దయింది. -
కన్నీరు తుడిచి.. బాసటగా నిలిచి..
వినుకొండ (నూజెండ్ల): క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి బోన్‌మారో చికిత్సకు రూ.50 లక్షలు మంజూరు చేయించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఆ పేదకుటుంబం కన్నీరు తుడిచారు. వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అశోక్‌బాబు పరిస్థితిని స్వయంగా చూసిన మంత్రి వెంటనే ఆస్పత్రిలో చేర్చించాలని సూచించారు. అశోక్‌బాబు తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో అశోక్‌కు క్యాన్సర్ అని, చికిత్సకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని తల్లికి తెలిసి హతాశురాలైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె ప్రమాదవశాత్తు గాయపడింది. గ్రామ సర్పంచి సురేష్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బాలుడి తల్లికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం వినుకొండ వచ్చిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజనికి బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వివరించి సహాయం చేయాలని కోరారు. అశోక్‌బాబును తీసుకొచ్చిన బంధువులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. బాలుడి పరిస్థితి చూసి సీఎంవో అధికారులతో మాట్లాడిన మంత్రి వైద్యానికి అయ్యే ఖర్చు రూ.50 లక్షలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించాలని బంధువులకు సూచించారు. -
ఎముకల క్యాన్సర్లు... ఒక అవగాహన
మన శరీరానికి ఒక ఆకృతినీ, ఎత్తునీ, బరువునూ నిర్ణయించేది మన ఎముకలే. అంతేకాదు... మన శరీరంలోని కీలకమైన అవయవాలను... అంటే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను వివిధ ఆకారాల్లో ఉండే ఎముకలు రక్షిస్తూ ఉంటాయి. ఎముకల ఉపరితలం గట్టిగా ఉండి లోపల స్పాంజ్‌లా ఉంటుంది. ఎముక లోపలి గుజ్జును బోన్‌మ్యారో అంటారు. ఎర్రరక్తకణాల ఉత్పత్తి బోన్‌మ్యారో నుంచి జరుగుతుంది. వయసుపైబడే కొద్దీ మరీ ముఖ్యంగా మహిళల్లో ఎముకలు మరింత పలచగా, పెళుసుగా మారి తేలిగ్గా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలా జరగడాన్ని ‘ఆస్టియో పోరోసిస్’ అంటారు. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. చిన్నప్పట్నుంచి శరీరానికి ఎండ తగలనిస్తూ, క్యాల్షియం లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడితే మంచిది. ఆస్టియోపోరోసిస్‌తో పాటు ఎముకలకు సంబంధించి బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ వంటి సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. చాలామందిలో బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఒకదానికి మరొకటిగా పొరబడటమూ జరుగుతుంది. ఎముకల మీద గడ్డ వచ్చే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అది క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డ అయినా, కాకపోయినా ఎముక మీద గడ్డ ఏర్పడితే ఫ్రాక్చర్స్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. క్యాన్సర్ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండటం, జ్వరం, రాత్రి చెమటలు పోయడం, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముకలు విరగడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. గడ్డ తొలిదశలో చాలా చిన్నగా కనిపించడం వల్ల ఎక్స్‌రే పరీక్షతో నిర్ధారణ సరిగా జరగకపోవచ్చు. అందుకనే లక్షణాలు కనిపించినప్పుడు సమస్యను సరిగా నిర్ధారణ చేయడానికి సీటీ, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ కాని గడ్డ అయితే గుండ్రంగా, మెల్లగా పెరుగుతుంది. క్యాన్సర్ కణితి అయితే ఖచ్చితమైన ఆకారం లేకుండా వేగంగా పెరుగుతుంది. కణితి కొంచెం పెద్దగా ఉంటే ఎక్స్‌రేలోనూ, చిన్నగా ఉంటే ఎమ్మారై, సీటీ స్కాన్లలో బయటపడుతుంది. గడ్డ ఏరకమైనదో నిర్ధారణ చేయడానికి బయాప్సీ చేస్తారు. బోన్ క్యాన్సర్ గడ్డలలో ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా, కాండ్రో సార్కోమా, ఫైబ్రో సార్కోమా, కార్డోమా అనే రకాలుంటాయి. వయసు మీద ఆధారపడి ఈ గడ్డలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా చిన్నవయసువారిలో ఎక్కువగా కనిపిస్తే, కాండ్రో సార్కోమా మధ్యవయసు వారిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. బోన్క్యాన్సర్స్ చాలావరకు సెకండరీగానే ఉంటాయి. శరీరంలో మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్... ఎముకలకు వ్యాప్తి చెందడం (మెటాస్టాసిస్) ఎక్కువగా చూస్తుంటాం. ఎముకలోనే క్యాన్సర్ ముందుగా రావడం కొంతవరకు అరుదుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి లంగ్, ప్రోస్టేట్... ఇలా మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్ ఎముక మీద గడ్డలాగా ముందుగా బయటపడవచ్చు. అన్ని క్యాన్సర్లలో లాగానే సర్జరీ, రేడియో, కీమో థెరపీల ప్రాధాన్యత ఎముక క్యాన్సర్లలోనూ ఉంటుంది. క్యాన్సర్ గడ్డ వచ్చిన ప్రదేశాన్ని తీసివేసినప్పుడు, చిన్నగా ఉంటే సిమెంటింగ్, గ్రాఫ్టింగ్ వంటి పద్ధతులతో సరిచేస్తారు. ఎముక తీయవలసిన ప్రదేశం ఎక్కువగా ఉంటే బోన్ బ్యాంక్ నుంచి ఎముకను సేకరించి, వాడటం లేదా మెటల్ ఇంప్లాంట్స్ వాడటం జరుగుతుంది. క్యాన్సర్ కణితి పెద్దగా ఉంటే సర్జరీ కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నగా చేసి, తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ సర్జరీ తర్వాత కొత్తగా పెట్టిన ఇంప్లాంట్స్‌కు అలవాటు పడటానికి ఫిజియోథెరపీ, రీహేబిలిటేషన్ వంటి ప్రక్రియల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎముకల క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే సెకండరీ బోన్ క్యాన్సర్స్ ఎక్కువ కాబట్టి మిగతా క్యాన్సర్లను ముందుగా గుర్తించి, చికిత్స తీసుకోగలిగితే ఈ క్యాన్సర్‌ను నివారించినట్లవుతుంది. క్యాన్సర్ వచ్చిన ఎముకలను గట్టిపరచడానికి బిస్పాస్ఫోనేట్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లకు మిగతా క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఎముకలకు పాకే గుణం ఉంటుంది. బోన్ క్యాన్సర్‌కు గురైనప్పుడు శరీరంలో క్యాల్షియం లెవెల్స్ కూడా పెరగవచ్చు. క్యాన్సర్ కణితి వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడటం వల్ల కాళ్లలో లేదా చేతులలో బలహీనత, తిమ్మిర్లు, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తాయి. శరీరంలో ఎక్కడైనా మార్పు కనిపించినా, లక్షణాల్లో మార్పులు కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకుని క్యాన్సర్ కణాన్ని తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, డాక్టర్ నిర్దేశించిన కాల వ్యవధి ప్రకారం సర్జరీ తర్వాత లేదా సర్జరీకి ముందు లేదా సర్జరీ లేకుండానే అవసరమైన కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవాలి. అంతేకాదు... శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ వస్తే పక్కనుండే ఎముకలకు పాకే అవకాశం ఉన్నందున, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా ఐదేళ్ల వరకు చెకప్స్ చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. డా. సి.హెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ Ph: 98480 11421 -
మూలుగ మార్పిడి (బోన్ మ్యారో) చికిత్సలో సరికొత్త పురోగతులు!
Bone Marrow Transplantation New Procedures: మూలుగలోంచి మూలకణాలు పుడతాయి. అవే అటు తర్వాత ఎర్రరక్తకణాలుగా, తెల్లరక్తకణాలుగా, ప్లేట్‌లెట్స్‌గా రూపొందుతాయి. మూలుగలోనే తేడా ఉంటే ఏఎంఎల్, ఏఎల్ఎల్ వంటి కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు, పుట్టుకతోనే వచ్చే మరికొన్ని జన్యుపరమైన జబ్బులు, రక్తానికి సంబంధించిన థలసీమియా, సకిల్సెల్ అనీమియా వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి వ్యాధులు ఉన్నవారికి మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్–బీఎంటీ) చికిత్స అవసరం. ఇందుకు మ్యాచింగ్ అవసరమవుతుంది. అసలు మ్యాచింగ్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, గతంలోలా ఎముకకు రంధ్రం చేయకుండా ఇప్పుడు నేరుగా రక్తం నుంచే మూలకణాలను సేకరించే ప్రక్రియలు... ఇలా బోన్ మ్యారోకు సంబంధించి... ప్రముఖ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ నరేందర్‌కుమార్ తోట వివరిస్తున్న అంశాలను తెలుసుకుందాం. ప్రశ్న : అసలు ఎముక మూలుగ అంటే ఏమిటి? దాని ఉపయోగాలేమిటి? జ: ఎముక మధ్య భాగంలో మూలకణాలతో కూడిన ఎర్రటి చిక్కటి ద్రవంలా ఉండేదే ఎముక మూలుగ. ఇది చాలా కీలకమైనది. దీని నుంచి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్... ఇలా రక్తానికి సంబంధించిన అనేక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ప్రశ్న : ఎముక మూలుగ (బోన్ మ్యారో) మార్పిడి చికిత్స ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? జ: ∙జన్యుపరమైన వ్యాధుల వల్ల మూలుగ సరిగా పనిచేయక పోవడం ∙పుట్టుకతో వచ్చే (కంజెనిటల్) రక్తానికి సంబంధించిన వ్యాధులు (థలసీమియా, సికిల్‌సెల్ అనిమియా వంటివి). ∙రక్తంలో వచ్చే రకరకాల క్యాన్సర్లు (ఏఎంఎల్, ఏఎల్ఎల్ వంటి బ్లడ్‌క్యాన్సర్లు) మొదలైనవాటిల్లో. ప్రశ్న : 5/10, 10/10 మ్యాచింగ్ అంటే ఏమిటి? జ: హెచ్ఎల్ఏ అనేది ‘హ్యూమన్ ల్యూకోసైట్ ఏంటిజెన్’ అనే దానికి సంక్షిప్తరూపం. నిజానికి హెచ్ఎల్ఏ ఒక రకం ప్రోటీన్. యాంటిజెన్స్ అనేవి ఒక రకం కణాంశాలు. అవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంటాయి. మళ్లీ ఈ హెచ్ఎల్ఏలో ఏ, బీ, సీ, డీ, డీఆర్, డీక్యూ అనే వివిధ భాగాలుంటాయి. ఈ విభాగాల మధ్య జరిగే మ్యాచింగ్‌ను పరీక్షల ద్వారా పరిశీలిస్తారు. ఇలాంటి మ్యాచింగ్‌లో పది అంశాలకు పది అంశాలు మ్యాచ్ అయితే.. దాన్ని 10/10 అనీ... సగం అంశాలు అయితే దాన్ని 5/10 అని అంటుంటారు. అయితే హెచ్ఎల్ఏ మ్యాచింగ్‌లో సగం అంశాలే... అంటే 5/10 మ్యాచ్ అయినప్పటికీ చేసే మూలుగ మార్పిడిని... ‘హ్యాప్లో ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారు. ప్రశ్న : మరి ఈ హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్తోనూ అంతే మంచి ఫలితాలు వస్తాయా? జ: గతంలో ఈ తరహా ట్రాన్స్‌ప్లాంట్స్ ఎక్కువగా చేసేవారు కాదు. అయితే ఇప్పుడున్న అధునాతన సాంకేతికత, మంచి మందులు, నర్సింగ్ సిబ్బంది సహాయంతో, నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఈ ‘హ్యాప్లో’ ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తున్నారు. అంతేకాదు... వీటితో కూడా మంచి ఫలితాలే వస్తున్నాయి. ప్రశ్న : రక్తసంబంధీకుల్లో ఎవరూ మ్యాచ్ కాకపోతే ఏం చేస్తారు? జ: ఇప్పడు ధాత్రి, డీకేఎంఎస్ వంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వీళ్ల దగ్గర ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన రకరకాల వారి హెచ్ఎల్ఏ వివరాలు ఉంటాయి. రక్తసంబంధీకుల్లో ఎవరిదీ మ్యాచ్ కానప్పుడు... బాధితుల హెచ్ఎల్ఏ వివరాలను ఈ సంస్థలకు తెలపాల్సి ఉంటుంది. ఇప్పుడా సంస్థలు... వారి వద్ద ఉన్న హెచ్ఎల్ఏలతో బాధితుల వివరాలను పోల్చి చూస్తారు. వారిలో ఎవరిదైనా మ్యాచ్ అయితే... వారి నుంచి మూలుగ సేకరించి, బీఎంటీ చికిత్స చేయవచ్చు. ప్రశ్న : ఎముక మూలుగ ఎలా సేకరిస్తారు? జ: గతంలో దాత(డోనర్)కు మత్తు మందు ఇచ్చి... అతడి ఎముక నుంచి చిన్న సూదుల సహాయంతో ఎముక మూలుగను సేకరించేవారు. అయితే ఇప్పుడు డోనర్ కు ‘గ్రోత్ఫ్యాక్టర్’ అనే ఇంజెక్షన్ ఇస్తారు. దాంతో ఎముక మూలుగలో ఉండే మూలకణాలు రక్తంలోకి వస్తాయి. ఆ తర్వాత ప్రత్యేక పరికరాల ద్వారా ఈ మూలకణాలను సేకరిస్తారు. అలా డోనర్‌కు ప్రత్యేకంగా ఎలాంటి ప్రొíసీజర్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ప్రశ్న : డోనర్ నుంచి ఎముక మూలుగ సేకరించాక అతడికి ఏవైనా ఇబ్బందులు వస్తాయా? అలాగే డోనర్ రక్తంలోకి మూలకణాలు వచ్చేందుకు ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? జ: అసలు ఇప్పుడు నేరుగా ఎముకలోంచి మూలుగ సేకరించడం లేదు కాబట్టి... ఇలాంటి ఇబ్బందీ ఉండదు. ఇక అతడినుంచి మూలుగ సేకరించాక కొంతకాలంలోనే అది మళ్లీ మునపటిలాగే పుట్టుకొస్తుంది. (రీజనరేట్ అవుతుంది). కాబట్టి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇక రక్తంలోకి మూలకణాలు వచ్చే ఇంజెక్షన్ వల్ల కూడా దాదాపు ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్ఎఫెక్ట్స్) ఉండవు. కాకపోతే చాలా కొద్దిమందిలో మాత్రం ఒకటి, రెండురోజుల పాటు కొద్దిగా ఒళ్లునొప్పులు ఉంటే ఉండవచ్చు. ప్రశ్న : ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఇంజెక్షన్ ఇచ్చాక డోనర్ నుంచి మూలకణాలు సేకరించకపోతే ఏమైనా అవుతుందా? జ: ఏమీ కాదు... ఇలాంటి సందర్భాల్లో రక్తంలోకి వచ్చిన మూలకణాలు మళ్లీ యధావిధిగా కొన్ని మూలుగలోకి, మరికొన్ని ప్లీహం (స్పీ›్లన్)లోకి వెళ్లిపోతాయి. అంతేతప్ప... దానివల్ల డోనర్‌కు ఎలాంటి హానీ జరగదు. ప్రశ్న : డోనర్‌కు ఎలాంటి పరీక్షలు చేస్తారు? జ: దాతకు డాక్టర్లు రక్తానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. దాత నుంచి అసలు మూలకణాలను సేకరించగలరా లేదా అని తెలుసుకోడానికి మరికొన్ని పరీక్షలు కూడా చేస్తారు. ప్రశ్న : బాధితులకు ఈ మూలకణాలను ఎలా ఇస్తారు? ఇలా ఎక్కించిన మూల కణాలు ఏమవుతాయి? జ: మామూలుగా రక్తం ఎక్కించినట్టే... ఈ మూలకణాలను ఎక్కిస్తారు. అంటే రక్తనాళంలోకి వీటిని (సెంట్రల్ లైన్ ద్వారా) ఎక్కిస్తారన్నమాట. రక్తంలో కలిసిన మూలకణాలు వెళ్లి... ఎముక మూలుగలో స్థిరపడతాయి. అంతేతప్ప... బాధితులకు ఎలాంటి ఆపరేషన్ అవసరం పడదు. ప్రశ్న : బాధితులకు... వారి నుంచే సేకరించిన మూలకణాలనే ఎక్కించే అవకాశం ఉంటుందా? జ: కొన్ని సందర్భాల్లో అలా కూడా జరుగుతుంది. వ్యాధిగ్రస్తుడికి కొంచెం నయం అయిన తర్వాత వారి నుంచే మూలకణాలు సేకరించి, వారికే ఎక్కించే ప్రక్రియను ‘ఆటోలాగస్’ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. అదే... ఇతరులనుంచి సేకరించి ఎక్కిస్తే దాన్ని... ‘అల్లోజెనిక్’ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ప్రశ్న : ఆటోలాగస్ ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? జ: కొన్ని రకాల క్యాన్సర్లలో ఈ తరహా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఉదాహరణకు మల్టిపుల్మైలోమా, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా వంటి క్యాన్సర్లలో ఈ మార్గం అనుసరిస్తారు. ప్రశ్న : బాధితులకు... వారి బంధువుల్లో ఎవరైనా మూలుగ ఇవ్వవచ్చా? జ: బాధితులతో పాటు, వారికి మూలుగ ఇవ్వదలచిన బంధువులకు / రక్తసంబంధీకులకు ‘హెచ్ఎల్ఏ’ అనే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో 10 అంశాలకు కనీసం 5 అంశాలైనా మ్యాచ్ కావాల్సి ఉంటుంది. బాధితుల రక్తంలోని అంశాలతో దాత(డోనర్)కు చెందిన అంశాలు... పదికి పది మ్యాచ్ అయితే దాన్ని 10/10 అనీ, కనీసం ఐదు అయితే దాన్ని 5/10 అని సూచిస్తారు. అంటే 5/10 నుంచి 10/10 మ్యాచింగ్ అయితేనే దాత నుంచి మూలుగను స్వీకరిస్తారు. అప్పుడే వారిని డోనర్‌గా పరిగణించవచ్చు. సాధారణంగా బాధితుల సోదరులు, సోదరి, తల్లిదండ్రులు వంటివారిని... వారు డోనర్‌గా పనికివస్తారేమోనని పరీక్షిస్తారు. ప్రశ్న : ఎముక మూలుగ మార్పిడి తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా? జ: మామూలుగా గతంలోలా చేసే సంప్రదాయ మూలుగ మార్పిడి ప్రక్రియలో బాధితుల్లో రోగనిరోధకశక్తి బాగా తగ్గిపోతుంది. దీనివల్ల చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల రక్తస్రావం / అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉండవచ్చు. అలాగే బాధితుల్లో ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు మూలుగ మార్పిడి అయిన రెండు నుంచి మూడు వారాలప్పుడు కనిపిస్తాయి. ఇక చాలా చాలా తక్కువ మందదిలో దాత నుంచి స్వీకరించి ఎక్కించిన మూలకణాలు... బాధితుల్లో స్వాభావికంగా మళ్లీ పెరగకపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘గ్రాఫ్ట్ ఫెయిల్యూర్’ అంటారు. దాత తాలూకు మూలకణాలు మరికొంతమందిలో చాలా తీవ్రంగా పరిణమిస్తాయి. అంటే రియాక్షన్‌లా రావచ్చు. ఇలా జరిగినప్పుడు బాధితుల్లో కొంతమందికి వాంతులు, విరేచనాలు, దురద, కామెర్లు వంటి సమస్యలు రావచ్చు. వీటిని జీవీహెచ్డీ సమస్యలుగా పేర్కొంటారు. అంటే... ‘గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్’ అని అర్థం. ప్రశ్న : ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఏవైనా ముందుజాగ్రత్తలు తీసుకునే అవకాశం లేదా? జ: ఉంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన గదుల్లోనే మూలుగ మార్పిడి చికిత్స నిర్వహిస్తారు. ఈ గదుల్లో ‘హెపా ఫిల్టర్స్’, పాజిటివ్ ప్రెషర్స్’ వంటివి ఉపయోగిస్తారు. ‘హై ఎఫిషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అనే దానికి సంక్షిప్తరూపమే ఈ ‘హెపా’. ఈ హెపా, పాజిటివ్ ప్రెషర్స్ ద్వారా గాలిలోని హానికరమైన పదార్థాలను 99.97 శాతం ఫిల్టర్ చేయవచ్చు. అంటే దాదాపుగా నూరు శాతమని చెప్పవచ్చు. అందువల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. జీవీహెచ్డీ, గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్లు రాకుండా ఉండేందుకు... ఎముక మూలుగ మార్పిడి చికిత్స తర్వాత కొన్ని మందులను సైతం ఇస్తారు. ప్రశ్న : ఎముక మూలుగ మార్పిడి చికిత్స తర్వాత బాధితులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ: హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక వారు ఇంట్లో బాగా ఉడికించిన ఆహారపదార్థాలు మాత్రమే తీసుకోవాలి. వీలైనంతవరకు బయటివారిని కలవకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వారి నుంచి ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండవచ్చు. అలాగే డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడుతూ, రక్తపరీక్షల వంటివి క్రమం తప్పకుండా చేయించుకుని, ఫాలో అప్‌లో ఉండాలి. -డాక్టర్ నరేందర్‌కుమార్ తోట, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బీఎంటీ ఫిజీషియన్ -
బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్ష గురించి తెలుసా?
రక్తకణాల ఉత్పత్తి కొన్ని దుష్ప్రభావాలకు లోనై, కొన్ని రకాల రక్తకణాలు అపరిమితంగా పెరగడాన్ని స్థూలంగా ‘బ్లడ్ క్యాన్సర్’గా చెప్పవచ్చు. ఈ సమస్యకు మూలం ప్రధానంగా బోన్ మ్యారో (ఎముక మజ్జ /మూలగ)లో ఉండి, అక్కడే అది ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎముక మజ్జ (మ్యారో)లో తొలుత మూలకణాలు అభివృద్ధిచెంది... క్రమంగా అవి ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్‌లెట్స్‌గా రూపొందుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో సాధారణంగా తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన తెల్లరక్తకణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా వ్యక్తులు తమ స్వాభావికమైన రోగనిరోధక శక్తిని కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా. లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పూర్తిగా పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. ఫలితంగా గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవులతో తెల్లరక్తకణాలు పోరాడుతుండటం వల్ల మనకు వ్యాధినిరోధకత చేకూరుతుందన్న విషయం తెలిసిందే. అయితే అపరిపక్వమైన తెల్లరక్తకణాల వల్ల వాటి పనితీరు దెబ్బతినడం... ఫలితంగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్ర రక్తణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లలో తగినంత ఆక్సిజన్ అందక ఆయాసం కూడా రావచ్చు. అంతేకాదు... జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పట్టడం, ఇన్ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, కాలేయం, స్పీ›్లన్ పెరగడం, ఎముకల నొప్పి లాంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందుల (కీమోథెరపీ)తోనే ఎక్కువగా చికిత్స అందిస్తుంటారు. -
ప్రాణాంతక డెంగీ: ప్లేట్లెట్స్ తగ్గేదెప్పుడో తెలుసా.. ఎన్ని ఉండాలి?
గత కొద్దిరోజులుగా డెంగీ వ్యాధి విపరీతంగా విస్తరిస్తోంది. డెంగీ వైరస్ సోకిన కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంటుందన్న విషయం తెలిసిందే. ఇది ప్రాణాలకు అపాయం తెచ్చే పరిస్థితి. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో రక్తదానం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ డెంగీ పెచ్చరిల్లుతున్న ఈ సమయంలో ప్లేట్లెట్లు ఇవ్వడం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. డెంగీ రోగుల్లో ప్లేట్లెట్ల ఆవశ్యకత, వాటిని ప్రదానం చేయాల్సిన అవసరం తెలిపే కథనమిది. ప్లేట్లెట్స్ తగ్గేదెప్పుడు? అప్లాస్టిక్ అనీమియా, కొన్ని రకాల రక్తపు క్యాన్సర్ల (లుకేమియా)లో, బాగా ముదిరిపోయిన లింఫోమా లాంటి క్యాన్సర్లతో పాటు దానికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లలో మూలుగ దెబ్బతినే అవకాశలున్నాయి. ఇలాంటి సమయాల్లో తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పడిపోవచ్చు. అలాగే అనేక వైరల్ జబ్బులతో పాటు ముఖ్యంగా డెంగీలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవచ్చు. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బాధితుడికి రక్తస్రావం లేదా దేహంలోనే అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం. చదవండి: భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడుతున్నారా? ఎక్కించాల్సిందెప్పుడు? సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య నాలుగు లక్షల నుంచి 80,000 వరకు పడిపోయినా ఎలాంటి ఆపద రాదు. కానీ అవి 20,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు బాధితుడు ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు ఏ చిన్నపాటి గాయమైనా అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అప్పుడు ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించడం అవసరమవుతుంది. చూడ్డానికి రక్తమంతా ఒకే ద్రవంలా (యూనీఫామ్గా) కనిపిస్తుంటుందిగానీ.. అందులో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మాతో పాటు చాలా ప్రోటీన్లు వంటి అంశాలుంటాయన్నది తెలిసిందే. అందులో ప్లేట్లెట్లు కూడా చాలా కీలకమైనవే. ఇవి గాయాలైనప్పుడు లేదా ఇతరత్రా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో రక్తాన్ని గడ్డకట్టేలా చేసి, రక్తస్రావాన్ని నివారించి ప్రాణాలు కాపాడుతుంటాయి. ఎలా ఎక్కిస్తారు? చదవండి: కోవిడ్ తర్వాత వాకింగ్ బెటరా? జాగింగ్ బెటరా?.. క్యాలరీల ఖర్చు ఎలా? కౌంట్ తక్కువగా ఉన్నవారికి ప్లేట్లెట్స్ ఎక్కించడం (ట్రాన్స్ఫ్యూజన్) రెండు రకాలుగా జరుగుతుంది. అవి... 1. ఆర్.డి.పి. (ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్) 2. ఎస్.డి.పి. (సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్) బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది దాతలు ఇచ్చిన రక్తాన్ని సేకరిస్తుంటారు. ఇందులోంచి రక్తంలో ఉండే ప్రధానమైన మూడు రకాల అంశాలను వేరుచేస్తారు. అంటే ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను విడదీసి వేటికవి ప్యాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల... రక్తహీనత (అనీమియా) మాత్రమే ఉన్న రోగులకు ఎర్రరక్తకణాలు ఎక్కించడం, ప్లాస్మా మాత్రమే అవసరమైన రోగులకు దాన్ని ఇవ్వడం, ప్లేట్లెట్స్ తగ్గినవారికి అవి మాత్రమే ఇవ్వడం ద్వారా ఒకే యూనిట్ బ్లడ్తో ముగ్గురికి ప్రాణాపాయం తప్పించవచ్చు. ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ : బ్లడ్‌బ్యాంకుల్లో అనేక మంది అనేక మంది దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తుంటారు. అందువల్ల ఏ రక్తం ఎవరిదన్న విషయం తెలియదు. అందుకే ఇలా సేకరించిన ప్లేట్లెట్లను ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్’ (ఆర్డీపీ)గా చెబుతారు. ‘ఆర్డీపీ’ని ఎక్కించినప్పుడు పేషెంట్లో 5,000 వరకు మాత్రమే కౌంట్ పెరుగుతుంది. కానీ సురక్షితమైన స్థాయికి ప్లేట్లెట్లను పెంచాలంటే, కౌంట్ కనీసం 25,000 నుంచి 30,000 ఉండాలి. ఇందుకోసం ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్’ ప్రక్రియలో కనీసం 5 నుంచి 6 యూనిట్ల రక్తం అవసరమవుతుంది. అంటే ఒకరికి అవసరమైన ప్లేట్లెట్లను సేకరించాలంటే కనీసం ఐదారుగురు దాతలు కావాలి. కొందరు రోగుల్లో వారి వ్యాధిని బట్టి నాలుగైదు మార్లు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి రావచ్చు. అంటే పేషెంట్‌కు కావాల్సిన ప్లేట్లెట్స్ అందాలంటే కనీసం 30 మంది దాతలు కావాలి. అంతమంది దాతలు దొరకడం చాలా కష్టం. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ : వైద్యరంగంలో ఇప్పుడున్న ఆధునిక సాంకేతికత సహాయంతో ఒక్క దాత నుంచే అవసరమైన పరిమాణంలో ప్లేట్లెట్స్ సేకరించవచ్చు. ఇలా చేసేప్పుడు రక్తంలోని ఇతర అంశాలను కాకుండా కేవలం ప్లేట్లెట్స్ మాత్రమే సేకరిస్తారు. ఇలా సేకరించేవాటిని ‘సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్’ (ఎస్డీపీ) అంటారు. ఈ ప్రక్రియలో ఒకే దాత... బాధితుడికి అవసరమైనన్ని అంటే... దాదాపు 30,000 ప్లేట్లెట్ కౌంట్ సమకూరేలా వాటిని దానం చేస్తాడు. దానివల్ల దాతకు ఎలాంటి నష్టమూ ఉండదు. కేవలం నాలుగురోజుల్లోనే దాత రక్తంలోకి అవి తిరిగి భర్తీ అవుతాయి. అంతేకాదు.. మళ్లీ ఎవరికైనా అవసరమైతే.. అదే దాత కేవలం 10 రోజుల తర్వాత మళ్లీ ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు. అలాకాకుండా, మొత్తం రక్తదానం చేసినప్పుడు... ఆ రక్తమంతా భర్తీ కావడానికి కనీసం మూడు నెలల వ్యవధి అవసరం. అందుకే ప్లేట్లెట్స్ అవసరమైనప్పుడు దాతలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి పదిరోజులకోమారు కూడా ప్లేట్‌లెట్స్‌ను నిరభ్యంతరంగా దానం ఇవ్వవచ్చు. పైగా ఇటీవలి కాలంలో ఇది చాలామంది ప్రాణాలు కాపాడుతూ పలువురికి మేలు చేస్తుంది. ఎక్కడ, ఎలా పుడతాయి? ప్లేట్లెట్స్ ఎముక మూలుగ నుంచి పుడతాయి. వీటి జీవిత కాలం కేవలం నాలుగు రోజులు మాత్రమే. సాధారణంగా ఎముక మూలుగలో ఏదైనా సమస్య వస్తే ప్లేట్లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. రక్తంలో వీటి సంఖ్య తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టే మన స్వాభావిక రక్షణ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. ఎన్ని ఉండాలి? ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తిలో క్యూబిక్ మిల్లీమీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉండాలి. ఇది నార్మల్ కొలత. వీటి సంఖ్యను ‘సెల్ కౌల్టర్ మెషిన్’ అనే యంత్రం ద్వారా కొలుస్తారు. ప్లేట్లెట్ కౌంట్ కోసం 2 – 3 ఎమ్ఎల్ రక్తాన్ని సేకరిస్తారు. డెంగీవ్యాధిగ్రస్తుల్లో ప్లేట్లెట్ కౌంట్ తెలుసుకోవడం కోసం ప్రతి 24 గంటలకోమారు రక్తపరీక్ష నిర్వహిస్తుండాలి. ఎలా పనిచేస్తాయి? రక్తం గడ్డకట్టే జీవక్రియల్లో ప్లేట్‌లెట్స్‌లోని అనేక ప్రోటీన్లు పాలు పంచుకుంటాయి. వీటిని ‘క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. ఇవన్నీ ఒక వలలా ఏర్పడి రక్తం ప్రవహించకుండా ఓ అడ్డుకట్ట వేస్తాయి. గాయం అయ్యాక కేవలం 2, 3 నిమిషాల్లోనే ఈ వల ఓ ఆనకట్టలా ఏర్పడుతుంది. -
180 ఏళ్లు బతకాలని ఎముక మజ్జను తొలగించి..
వాషింగ్టన్: 47 ఏళ్ల వయసు ఇంకా ఎదో సాధించాలనే సంకల్పంతో ఓ వ్యక్తి 180 ఏళ్లు బతకాలని ఆశిస్తున్నాడు. ఇందుకోసం అతడు విచిత్రమైన పద్దతులను పాటిస్తున్నాడు. ఈ పద్దతులతో మనిషి 180 ఏళ్లు బతకడం సాధ్యమేనని చెబుతున్నాడు అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డేవ్ ఆస్ప్రే. డేవ్ బుల్లెట్‌ఫ్రూఫ్ అనే అమెరికా కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న డేవ్ ఇంకా 133 ఏళ్లు బతకడానికి సైన్స్‌తో పాటు టెక్నాలజీని వాడుకుంటున్నాడు. అయితే అతడి తీరును చూసి చాలా మంది పిచ్చి వేషాలంటూ తీసిపారేస్తుంటే.. అతడు మాత్రం తనని తాను బయోహ్యాకర్గా పిలుచుకుంటున్నాడు. సైన్స్, టెక్నాలజీ సాయంతో జీవశాస్త్రాన్ని నియంత్రణలో తెచ్చుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వ్యక్తిని ‘బయోహ్యాకర్’ అంటారు. కాగా డేవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంకా సాధించేది చాలా ఉంది. అందుకే ఇంకా ఎక్కువ ఏళ్లు బతకాలనుకంటున్నాను. అందుకే 6 నెలలకు ఒకసారి ఎముక మజ్జ(బోన్ మ్యారో)లో కొంత భాగాన్ని తొలగించి దాని నుంచి మూలకణాలను(స్టెమ్ స్టెల్స్) తీసుకుని శరీరమంతా ఎక్కిస్తే నూతన ఉత్తేజం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంకా133 ఏళ్లు బతుకుతానని నా నమ్మకం. ఈ క్రమంలో తరచూ కోల్డ్ క్రియోథెరపీ చేయాలి. అంటే అత్యంత చల్లగా ఉండే చాంబర్లో కూర్చోడం వల్ల ద్రవరూప నైట్రోజన్‌ను నా శరీరాన్ని చల్లబరుస్తుంది. తలకు కూడా ఎలక్టోడ్లు అమర్చుకుని పరారుణ కాంతి కింద గడపాలి’ అంటూ వివరించాడు. అలాగే కొన్ని సార్లు ఉపవాసం కూడా ఉంటాడట. అతను నిత్యయవ్వనంగా కనిపించేందుకు కోసం నిద్ర సమయాన్ని, కఠిమైన ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పాడు. అయితే డేవ్ ఈ పద్దతులను పాటించేందుకు ఇప్పటి వరకు దాదాపు 13 కోట్లు పైగా వెచ్చించినట్లు తెలిపాడు. కాగా 2012లో అమెరికాలో బుల్లెట్ఫ్రూప్తో కాఫీ బ్రాండ్ ప్రారంభించాడు. ఈ కాఫీతో వెన్న(బట్టర్), కొబ్బరి నూనేతో తయారు చేస్తారు. అయితే అతడి కాఫీ బ్రాండ్‌పై అమెరికా వైద్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాఫీలో బట్టర్ కలపడం ఆరోగ్యకరం కాదని హెచ్చరిస్తుంటే డేవ్ మాత్రం ఈ కాఫీ అరుదైన రుచి అందిస్తుందని చెబుతున్నాడు. ఇది తాగితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నాడు. 2004లో టిబెట్ పర్యటనకు వెళ్లినప్పుడు బుల్లెట్‌ఫ్రూఫ్ కాఫీ తయారి ఆలోచన వచ్చినట్లు డేవ్ వెల్లడించాడు. -
స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు
నెల్లూరు, సోమశిల: వారంతా స్నేహితులు. వారిలోని ఓ నిరుపేద యువకుడికి ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. వైద్యానికి భారీగా నగదు వెచ్చించాల్సి రావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. స్నేహితుడ్ని ఎలాగైనా కాపాడుకోవాలని మిగిలిన స్నేహితులు జోలె పట్టారు. ఇంటింటికి తిరిగి నగదు సాయం చేయాలని వేడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు. అనంతసాగరానికి చెందిన అల్లీ ఇమామ్షా, కాలేబీలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు షేక్ ఖాజావలీ పదో తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చదువు మానేశాడు. సెంట్రింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం హసీనాను వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుండగా ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి సోకింది. వైద్యులను సంప్రదించగా వైద్యానికి రూ.25లక్షలకుపైగా ఖర్చవుతుందని తెలిపారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఖాజావలీ తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్సకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు స్పందించి సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు తమతో పాటు తిరిగే స్నేహితుడు ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి బారిన పడడం స్నేహితులను కలచివేసింది. స్నేహితుడి ప్రాణాలను కాపాడుకునేందుకు స్నేహితులందరూ ఒక్కటై జోలె పట్టారు. రెండ్రోజులుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి సాయం అందించాలని వేడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు. ఎవరైనా సాయం చేయాలనుకునే దాతలు షేక్ జావీద్ 77994 47137, నియాజ్ 9676 517112 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. -
‘నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది’
గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం ముగిసిందని... ప్రస్తుతం తనకు క్యాన్సర్ నయమైందని అంటున్నారు బాలీవుడ్ నటుడు రిషి కపూర్. డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాను. అమెరికాలో ఈ నెల 1 నుంచి మరో చికిత్స ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దేవుడు నా మీద దయ చూపాడు. ఇక నాకు ఏ చికిత్స అవసరం లేదన్నారు వైద్యులు. అంటే ఇప్పుడు నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. బోన్ మ్యారో చికిత్స ఒక్కటి మిగిలి ఉన్నది. దానికి మరో 2 నెలల పడుతుందన్నారు వైద్యులు. అది పూర్తయ్యాక ముంబయికి తిరిగి వస్తాను’ అని రిషి కపూర్ తెలిపారు. అంతేకాక ‘నేను ఇంత త్వరగా కోలుకున్నానంటే అందుకు కారణం నా కుటుంబం, నా అభిమానులు ప్రేమ, దేవుడి దయ. ముఖ్యంగా నా భార్య నీతు. తను లేకపోతే నేను న్యూయార్క్ వెళ్లి చికిత్స చేయించుకునేవాడిని కాను. నా పిల్లలు రణ్‌బీర్, రిధిమా కూడా నాకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నా గురించి ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సాధరణంగా నాకు ఓపిక చాలా తక్కువ. అలాంటిది ఓపిగ్గా ఎలా ఉండాలో నాకు దేవుడు ఈ రకంగా తెలియజేశాడు’ అని పేర్కొన్నారు. ఎనిమిది నెలల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళుతున్నానని ట్విట్ చేశారు రిషి కపూర్. త్వరలోనే ముంబయికి తిరిగివస్తానని, అంతవరకు తన అనారోగ్యం గురించి ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని కోరారు. అయితే తనకు వచ్చిన అనారోగ్య సమస్యను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం చికిత్స దాదాపు పూర్తికావొస్తున్న నేపథ్యంలో తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తాజాగా మీడియా ద్వారా బయటపెట్టారు. అయితే ఇప్పుడు తాను కోలుకున్నానని వెల్లడించారు రిషి కపూర్. చివరిగా ‘ముల్క్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రిషి కపూర్. -
కృత్రిమ ఎముక మజ్జ సిద్ధమవుతోంది...
ఎముక మజ్జ కణజాలాన్ని కృత్రిమంగా సృష్టించడంలో బేసల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. గతంలోనూ ఇలాంటి కృత్రిమ మజ్జను సృష్టించినప్పటికీ దానికి సహజమైన మజ్జకు ఉన్న లక్షణాలు తక్కువగా ఉండేవి. ఉదాహరణకు మజ్జ ద్వారానే రక్తకణాలు పుడతాయన్నది మనకు తెలుసు. ఈ లక్షణం కృత్రిమ మజ్జకూ అలవడితే లుకేమియా వంటి కేన్సర్లకు మెరుగైన చికిత్స అందించవచ్చు. రక్తం ఏర్పడేందుకు వెనుక ఉన్న యంత్రాంగాన్ని అర్థం చేసుకునేందుకు బేసల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఉపయోగపడుతుంది. తద్వారా రక్త సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స లభిస్తుందని అంచనా. పింగాణీతో చేసి త్రీడీ చట్రానికి మెసెన్కైమల్ స్టోమల్ కణాలను చేర్చి తాము ఈ కృత్రిమ మజ్జ కణజాలాన్ని తయారుచేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఇవాన్ మార్టిన్ తెలిపారు. మూలకణాల్లాంటి వాటిని చేర్చడం ద్వారా ఈ కణజాలం రక్తకణాలను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టిందని, మరిన్ని పరిశోధనల తరువాత ఈ కృత్రిమ మజ్జ కణజాలాన్ని వాస్తవ పరిస్థితుల్లో వాడటం సాధ్యమవుతుందని ఇవాన్ వివరించారు. -
పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి
ప్రతి నెలా రక్తమార్పిడి తప్పనిసరి బోన్ మ్యారో మార్చాలంటున్న వైద్యులు చికిత్సకు రూ.36లక్షలు ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ఉపాధ్యాయుడు అనంతపురంలోని రంగస్వామి నగర్ 4వ రోడ్డులో నివాసముంటున్న ఆంజనేయులు, శాంతకుమారి దంపతుల కుమారుడు రితేష్(4). మూడు నెలలు పసికందుగా ఉన్నప్పుడే రితేష్ ఆరోగ్య పరిస్థితిలో మార్పులు చోటు చేసుకున్నాయి. తల్లిపాలు తాగడం మానేశాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించార. జబ్బు తగ్గుతుందన్న వైద్యులు భరోసానివ్వడంతో వారిలో ఆందోళన తగ్గింది. డాక్టర్లు చికిత్స మొదలుపెట్టారు. రోజులు... నెలలు గడుస్తున్నా పిల్లవాడిలో మార్పు రాలేదు. రూ. వందలు.. వేలు.. లక్షల్లో ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు. శిశువు నీరసించిపోసాగాడు. రక్తమార్పిడి చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన రెట్టింపు అయింది. వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వివిధ రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత థలసీమియాతో రితేష్ బాధపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వ్యాధి పూర్తిగా నయం కావడానికి బోన్‌మారో మార్పు ఒక్కటే మార్గమని, ఇందుకు వివిధ దశల్లో రూ.36,75,000 ఖర్చు అవుతుందని వైద్యులు వివరించారు. అప్పటి వరకూ ప్రతి నెలా రక్తమార్పిడి చేయించాల్సి వస్తుందని సూచించారు. అప్పు చేసి చికిత్సలు : అచేతనావస్థలో ఉన్న శిశువు పెరుగుతూ ప్రస్తుతం నాలుగేళ్ల ప్రాయానికి చేరుకున్నాడు. అయితే అందరి పిల్లల్లా కాకుండా నీరసించి పోయి ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఆ బాలుడి ఆరోగ్యం కుదుట పడాలని ఆ తల్లిదండ్రులు పడుతున్న తపన అంతాఇంత కాదు. గార్లదిన్నె మండలంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడి (పీజీటీ)గా పనిచేస్తున్న ఆంజనేయులు.. సంపాదన కుటుంబ పోషణతో పాటు బాలుడికి అత్యవసర చికిత్సల కోసం తక్కువ పడుతోంది. అర్థిక స్థోమత ఏమాత్రమూ సరిపోవడం లేదు. ప్రతి నెలా రక్తమార్పిడి, ఇతర చికిత్సల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. దాతలు ఎవరైనా స్పందించి తమకు పుత్ర భిక్ష పెట్టాలని ఆంజనేయులు దంపతులు వేడుకుంటున్నారు. సాయమందిచాలనుకుంటే.. ఖాతాదారుడి పేరు: వి. ఆంజనేయులు ఖాతా నంబర్ : 33105388863 బ్యాంక్, ఎస్బీఐ అనంతపురం జార్జిపేట శాఖ ఐఎఫ్సీఎస్ కోడ్ః ఎస్బీఐ ఎన్ 0010659 సంప్రదించాల్సిన ఫోన్ : 99852 42441 -
అందుబాటులోకి సమస్త రోగాలకు చికిత్స....
లండన్: మానవుల్లో మధుమేహం నుంచి క్యాన్సర్ వరకు సమస్త రోగాలను నయం చేసేందుకు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. క్యాన్సర్ సోకిన రోగి ఎముక మూలుగ (బోన్ మ్యారో)ను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా విజయవంతంగా మార్చడం ద్వారా ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకలు వెల్లడించారు. ఎలుకల బోన్ మ్యారోలోకి క్యాన్సర్ కణాలను ఎక్కించి, అవి ఎదిగిన తర్వాత వాటిని సురక్షితంగా నాశనం చేయడంలో తాము అద్భుత విజయాన్ని సాధించామని వారు చెప్పారు. రేడియేషన్ లేదా కీమోథెరపి ద్వారా కాకుండా రెండు యాంటీ బాడీలను ఎలుకల బోన్ మ్యారోలోకి ఎక్కించడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో తాము 99 శాతం విజయం సాధించామని, అనంతరం కొత్త బోన్ మ్యారోను విజయవంతంగా ఎలుకల్లోకి ఎక్కించామని వారు ‘సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ రిపోర్ట్స్’ జనరల్ తాజా సంచికలో వెల్లడించారు. ఏ రోగిలోనైనా లుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్లకు చికిత్స చేయాలంటే బోన్ మ్యారోలో ఉండే ఆ రక్త మూల కణాలను రేడియేషన్ లేదా కీమో థెరపీ ద్వారా నాశనం చేస్తారు. అనంతరం అవసరమైతే కొత్త బోన్ మ్యారోను ఎక్కిస్తారు. అయితే బోన్ మ్యారో మార్పిడి శస్త్ర చికిత్సల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా 20 శాతం మంది రోగులు మరణిస్తారు. లండన్‌లో ఏడాదికి 1200 మంది రోగులకు బోన్ మ్యారో మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వారిలో 20 శాతం మంది మృత్యువాత పడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ఆపరేషన్లను అనుమతిస్తున్నారు. ఇప్పుడు తాము రెండు యాంటీ బాడీలను బోన్ మ్యారోలోకి ఎక్కించి క్యాన్సర్ కణాలను ఎలుకల్లో నాశనం చేయడంలో విజయం సాధించామని, త్వరలోనే మానవులపై కూడా ఈ ప్రయోగం నిర్వహిస్తామని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. అయితే ఆ రెండు యాంటీ బాడీలు ఏమిటో ఈ దశలో వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని వారు చెప్పారు. ఈ ప్రయోగం మానవుల్లో సక్సెస్ అయితే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, బోన్ మ్యారో లాంటి ఏ శరీర భాగాన్నైనా సులభంగా మార్పిడి లేదా పునరుత్పత్తి చేయవచ్చని, డయాబెటీస్ నుంచి క్యాన్సర్ వరకు సమస్త రోగాలకు చికిత్స అందించవచ్చని పరిశోధకలు చెప్పారు. వారు తమ ప్రయోగాన్ని ‘హోలి గ్రేల్’ అని అభివర్ణించారు. హోలి గ్రేల్ అంటే క్రీస్తు లాస్ట్ సప్పర్‌లో ఉపయోగించిన దివ్య శక్తులుగల చిన్న పాత్ర. -
యశోద హాస్పిటల్లో అరుదైన చికిత్స
-
కాలేయ పునరుత్పత్తికి మందు!
న్యూయార్క్: కాలేయం, పెద్ద పేగు, ఎముక మజ్జ క్షీణిస్తే.. వాటిని తిరిగి బాగుచేయొచ్చు. ఇందుకు ఉపయోగపడే ఓ ఔషధాన్ని అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ఎస్డబ్ల్యూ033291’ అనే ఈ మందుతో ఎలుకలపై ప్రయోగించగా.. కణజాలాన్ని చాలా వేగంగా పునరుత్పత్తి చేసి దెబ్బతిన్న అవయవాలను పునరుద్ధరించిందని వారు వెల్లడించారు. ఎముక మజ్జ క్షీణించి చనిపోయే దశకు చేరిన ఎలుకలు సైతం ఈ ఔషధంతో కోలుకున్నాయని వర్సిటీ పరిశోధకుడు మార్కోవిజ్ తెలిపారు. కణజాలాన్ని ఉత్పత్తి చేసే మూలకణాలకు ఈ మందు విటమిన్‌లా పనిచేస్తుందన్నారు. ఈ ఔషధంతో అనేక వ్యాధులకు సమర్థమైన చికిత్స చేయవచ్చన్నారు. ప్రస్తుతం దీనిని మనుషుల్లో ఉపయోగించేందుకు అభివృద్ధిపరుస్తున్నామని తెలిపారు. కాగా, కణజాలాలను ఉత్పత్తి చేసే మూలకణాల వ్యాప్తికి ఉపయోగపడే ప్రోస్టగ్లాండిన్ ఈ2(పీజీఈ2) అనే అణువుల మాదిరిగా పనిచేసేలా ఈ మందును తయారు చేశారు. పీజీఈ2 అణువుల సంఖ్య పెరిగేందుకు లేదా తగ్గేందుకు 15-పీజీడీహెచ్ అనే జన్యువు ప్రభావం చూపుతుందని గతంలో తేలింది. అయితే, తాజా పరిశోధనలో ఆ జన్యువును క్రియారహితం చేసేలా ఎస్డబ్ల్యూ033291 ఔషధాన్ని తయారు చేశారు. ఇదిలాఉండగా.. ఎముకల క్షీణతను నివారించేందుకు గాను ఫ్లోరిడాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఓ కొత్త చికిత్సను కనుగొన్నారు. ఎముకల క్షీణత ఉన్న రోగుల్లో ఈ చికిత్స ద్వారా.. ఓ ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా కొత్త ఎముకను ఏర్పర్చే కణాలను అభివృద్ధిపర్చవచ్చని వారు తెలిపారు. -
ఆదుకోండి ప్లీజ్