‘‘నేను సినిమాల నుంచి తప్పుకుంటున్నా.. ఇకపై నటించను’’ అంటూ ఇటీవల ఓ ప్రకటన చేశారు బాలీవుడ్ బ్యూటీ సనాఖాన్. ఆమె అలా ప్రకటించినప్పుడే పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వచ్చాయి.. తాజాగా ఆమె పెళ్లి చేసుకుని, అందరికీ షాక్ ఇచ్చారు. తెలుగులో నాగార్జున ‘గగనం’, కల్యాణ్‌రామ్ ‘కత్తి’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. హిందీ ‘బిగ్‌బాస్’ సీజన్ 6లోనూ పాల్గొన్నారు. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను ఆమె పెళ్లాడారు. భర్తతో సనాఖాన్ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఈ నవదంపతులు ‘నిఖా ముబారక్’ అని రాసి ఉన్న కేక్ కట్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో చాలా సింపుల్‌గా ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగిన ట్లు తెలుస్తోంది.
∙ముఫ్తీ అనాజ్, సనాఖాన్
ఏడడుగులేసనా
Published Mon, Nov 23 2020 1:10 AM | Last Updated on Mon, Nov 23 2020 1:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment