షోలాపూర్, న్యూస్‌లైన్: పూర్వీకుల కాలంలోనే ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్న తెలుగు వ్యాపారవేత్త సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. జైలురోడ్డు పోలీసులు అందించిన వివరాల మేరకు.. కర్ణిక్‌నగర్‌లో నివాసముంటున్న జగదీశ్ (42) తన ఇంట్లోని గదిలోనే ఆయుధంతో గొంతును కోసుకున్నారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్న ఆయనను చూసి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక మార్కండేయ సహకార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే జగదీశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా జగదీశ్ గత అనేక ఏళ్లుగా సాకార్‌పేట్‌లో నూలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వివిధ సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొనేవారు. తక్కువ వయస్సులోనే నూలు వ్యాపారరంగంలో ప్రగతి సాధించారు. అయితే గత కొన్ని నెలలుగా వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదురవడంతో మనోవేదన చెందేవాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇతనికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వ్యాపారి ఆత్మహత్య
Published Mon, Sep 30 2013 11:28 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement