నమ్మించి.. అరకోటితో ఉడాయించాడు | huge fraud in chikkadpally | Sakshi
Sakshi News home page

నమ్మించి.. అరకోటితో ఉడాయించాడు

Published Wed, Jun 29 2016 2:17 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

huge fraud in chikkadpally

హైదరాబాద్: ఆస్తులున్నాయని అందరినీ నమ్మించి అరకోటితో ఉడాయించాడో వ్యాపారి. వివరాలివీ.. నగరంలోని చిక్కడపల్లి, వివేక్‌నగర్‌కు చెందిన భూపతి రామకృష్ణ స్థానికంగా కిరాణ షాపు నడుపుతున్నాడు. తనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నమ్మించి.. తెలిసిన వారి నుంచి దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఈ నెల 14వ తేదీ నుంచి భార్య, బిడ్డలతో పాటు కనిపించకుండాపోయాడు. అతని రెండు సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. రామకృష్ణ కనిపించకపోవటంతో బాధితులు అతడి ఇంటితో పాటు షాపువద్దకు వెళ్లి వాకబుచేశారు. జాడ తెలియరాక పోవటంతో బుధవారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement