Girl Shocks Teachers And Classmates By Arriving At Farewell Prom In Vampire Coffin - Sakshi
Sakshi News home page

ఫేర్‌వెల్‌ పార్టీలో హడలెత్తించిన బాలిక.. శవపేటికలో నుంచి లేచి..

Published Thu, Jul 6 2023 11:03 AM | Last Updated on Thu, Jul 6 2023 11:33 AM

girl shocks teachers classmates by arriving farewell prom - Sakshi

చాలామంది చిన్నారులు ‍స్కూల్‌ ఫేర్‌వెల్‌ పార్టీకి అందమైన వస్త్రధారణతో వస్తుంటారు. అయితే 16 ఏళ్ల అబీ రికెట్స్‌ తమ స్కూల్‌ ఫేర్‌వెల్‌ కార్యక్రమానికి విచిత్ర రీతిలో సిద్ధమై వచ్చింది. తన క్లాస్‌మేట్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఒక షో-స్టాపింగ్‌ స్టంట్‌కు ప్లాన్‌ చేసింది. ఇందుకోసం ఆమె ఒక శవపేటికతో పాటు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. 

స్కూల్‌ ఫేర్‌వెల్‌ పార్టీ రోజున ఆమె నలుపురంగు దుస్తులు ధరించింది. తరువాత ఆరడుగుల శవపేటికలో పడుకుంది. చేతులను క్రాస్‌చేసి పెట్టుకుంది. అప్పుడు ఆమెతో పాటు వచ్చిన అంత్యక్రియల నిర్వహణ సిబ్బంది ఆ శవ పేటికను రెడ్‌ కార్పెట్‌పై ఉంచారు. ఇంతలో ఆమె ఎంతో నాటకీయంగా తన కళ్లను తెరిచింది. అక్కడున్నవారంతా ఆమెను చూసి కేకలు పెట్టారు.

చుట్టుపక్కలవారు కేకలు పెడుతూ..
ఈ ఘటన గురించి అబీ వివరిస్తూ..‘అప్పుడు నన్ను చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఆందోళనగా కేకలు పెట్టారని,  అసలు విషయం గ్రహించి చప్పట్లు కొట్టారన్నారు. మా ఉపాధ్యాయులు ఇలాంటిది ఎ‍ప్పుడూ చూడలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని’ అన్నారని ఆమె తెలిపింది. అబీ అంత్యక్రియల ‘షో’లో ఆమె తండ్రి, సోదరుడు కూడా ఆమెకు సహకరించారు. వారు అంత్యక్రియల నిర్వాహకుల పాత్ర పోషించారు. ఈ విధంగా అందరినీ భయపెట్టేందుకు అబీ రెండు గంటల పాటు అలంకరణ చేసుకుంది.

కుమార్తె షో అద్భుతమంటూ..
తాము శవవాహనం అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే ఇలాంటి షో కోసం ఎవరూ వాహనం ఇవ్వబోమని చెప్పారని అబీ తెలిపింది. దీంతో తమ ఇంటిలోని వారే తన షో కోసం అన్ని ఏర్పాట్ల చేశారని చెప్పింది. ఈ సందర్భంగా అబీ తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె చేసిన షో విషయంలో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇది కలకాలం నిలిచిపోతుందన్నారు.
ఇది కూడా చదవండి: గొంతులో ఇరుక్కున్న లెగ్‌ పీస్‌.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement