
సినీ రంగంలో, దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ నయన తార. అందాల నటి నయన్‌కు అభిమానులు, సన్నిహితులతో పాటు, ఆమె ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు వేడుకని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నయన తార క్లాస్‌మేట్ ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విశేషంగా నిలిచింది. 36వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కేరళకు చెందిన మహేష్ కదమ్మనిట్ట ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేరళలోని తిరువల్లలోని మార్తోమా కాలేజీలో నయనతారకు డిగ్రీ క్లాస్‌మేట్ మహేష్. ఆయన ఇలా రాశారు ‘‘డిగ్రీలో తన పక్కన కూర్చున్న తన స్నేహితురాలు సూపర్ స్టార్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. ముఖ‍్యంగా పురుషాధిపత్యం, నెపోటిజం పరిశ్రమను ఏలుతున్న తరుణంలో సినిమా నేపథ్యం ఏ మాత్రం లేని ఒక మహిళ తన కాళ్ళ మీద తను గట్టిగా నిలబడటం ఆశ్చర్యం. కరియర్ ఆరంభంలో అభిమానుల కంటే విమర్శలే ఎక్కువ. అయినా వాటన్నింటినీ తట్టుకుని మొత్తం సినిమా ప్రపంచాన్ని ఏలే శక్తిగా ఎదుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ పరిశ్రమ మీద గౌరవంతో విమర్శలన్నింటినీ అధిగమించింది. పరిపూర్ణమైన కృషి అంకితభావం వల్లనే ఆమె విజయతీరాలకు చేరింది’’. 17 ఏళ్లుగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండటం అద్భుతం తిరువల్లలోని చిన్న గ్రామం నుండి వచ్చి, కృషి పట్టుదలతో ఇంతటి ఘనతను సాధించిన మై డియర్ డయానా(నయనతార) నీకు వేనవేల పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ ఆయన రాసుకొచ్చారు.
ఈ సందర్బంగా మార్తోమా కాలేజీలో 2002-05 నాటి ఆంగ్ల సాహిత్య బ్యాచ్‌లో నయన తార చేతి రాతతో ఉన్న నోట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. అంతేకాదు ఇంతకాలంపాలు ఈ నోట్‌ను భద్రంగా దాచిపెట్టిన తన భార్యకు మహేష్ కృతజ్ఙతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment