రజనీ చేతుల మీదుగా మహేష్‌ మల్టీప్లెక్స్‌ | Mahesh Babu AMB Cinemas to Open With Rajinikanth2Point0 | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 13 2018 4:17 PM | Last Updated on Tue, Nov 13 2018 4:17 PM

Mahesh Babu AMB Cinemas to Open With Rajinikanth2Point0 - Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఏసియన్‌ ఫిలింస్‌ సంస్థతో కలిసి మహేష్ ఈ మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. ఏయంబీ సినిమాస్‌ పేరుతో నిర్మిస్తున్న ఈ థియేటర్స్‌ను ముందుగా థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాతోనే ప్రారంభించాలని ప్లాన్‌ చేశారు. అయితే అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది.

తాజా సమాచారం ప్రకారం ఈ థియేటర్స్‌ను 2.ఓ సినిమాతో ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన థియేటర్స్ కావటంతో 2.ఓ లాంటి 3డీ విజువల్‌, 4డీ ఆడియోతో రూపొదించిన సినిమాతో ప్రారంభించటమే కరెక్ట్ అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్వయంగా హాజరవుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలపై మహేష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement