‘జీరో’, ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రాల్లో హీరో పక్కన నటించిన మహ్మద్ జీషన్.. ఎప్పటికైనా ఓ లీడ్ రోల్‌లో నటించాలనుకుంటున్నట్లు తెలిపారు. 2011లో ‘నో వన్ విల్ కిల్డ్ జెస్సిక’ సినిమా ద్వారా మహ్మద్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అటుపై ‘తను వెడ్స్ మను’, ‘రాయిస్’, మణికర్ణిక వంటి సినిమాల్లో మంచి నటనను కనబర్చారు. అయితే బాలీవుడ్‌లోషారూక్ ఖాన్, అమీర్ ఖాన్‌లు నటించిన బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాలైన జీరో, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాల్లో నటించినా అవి తనకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని, దీనిపై తనను అందరూ ప్రశ్నిస్తుంటారని తెలిపారు.
అయితే ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై చర్చిస్తూ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. తనను ఇప్పటీకి కొంతమంది జీరొ, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలు ఎందుకు చేశావని అడుగుతుంటారని.. అయితే గెలుపోటములు జీవితంలో ఒక భాగమని అన్నారు. వైఫల్యాలు వచ్చినంత మాత్రాన ప్రయత్నం చేయడం మానోద్దని, తప్పుల నుంచి నేర్చుకుని గెలుపు వైపు పయనించాలని మహ్మద్ అన్నారు. ఎలాంటి పాత్రలు చేయకూడదని అనుకుంటున్నానో అలాంటి పాత్రలే తనకు వస్తున్నాయని, నటనకి ప్రాధాన్యం ఉండే పాత్రలు మాత్రమే చేయలనుకుంటున్నానని అన్నాడు. ప్రస్తుతం అనుభవ్ సిన్హా డైరెక్షన్‌లో రాబోతోన్న ఆర్టికల్ 15 చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment