Zero Movie
-
బిగ్‌బీ రికార్డును బ్రేక్ చేసిన షారుఖ్
జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ బాలీవుడ్ కింగ్‌ఖాన్ బిగ్గెస్ట్ హిట్ సాధించి చాలా కాలమైనా అతడికి ఏ మాత్రం ఫ్యాన్ పోలోయింగ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా ట్విటర్లో 39 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి భారత సెలబ్రెటీగా షారుఖ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 38.8 మిలియన్ల ఫాలోవర్స్‌తో ఆగ్రస్థానంలో ఉండేవాడు. తాజాగా అమితాబ్‌ను షారుఖ్ అధిగమించాడు. ఈ సందర్భంగా తనపై ప్రేమాభిమానాలను కురిపిస్తున్న అభిమానులకు షారుఖ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షారుఖ్ ఫాలవర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఇన్‌స్టాలో 18.6 మిలియన్ల మంది అభిమానులు షారుఖ్‌ను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సౌదీ అరేబియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్ ఫోరయ్ 2019’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా, హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీచాన్, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఎంతగా వైరల్ అయిందంటే కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క రోజులోనే ఆ ఫోటోకు దాదాపు 24 లక్షల లైక్‌లు వచ్చాయి. ఇక ‘రా వన్’, ‘జీరో’ సినిమాలు షారుఖ్‌ను పూర్తిగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తన సొంత నిర్మాణ సంస్థలో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘జీరో’ బాక్సీఫీస్ వద్ద చతికిలపడింది. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నటుడిగానే కాకుండా నిర్మాతగా షారుఖ్ బిగ్ ఫేయిల్యూర్‌ను చవిచూశాడు. జీరో పరాజయంత తర్వాత మరో సినిమాకు షారుఖ్ ఇప్పటివరకు ఓకే చెప్పలేదు. అయితే వచ్చే ఈద్‌కు ఓ సినిమాను విడుదల చేయాలని షారుఖ్ బావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘జీరో’ సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతోన్నా కింగ్‌ఖాన్ మళ్లీ థియేటర్లలో కనిపించనేలేదు. దీంతో ఈ రేస్ యాక్టర్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రస్తావన రాగానే ‘రాజ్‌కుమార్ హిరాని నుంచి అబ్బాస్ జాఫర్లతో పాటు మరో ప్రముఖ దర్శకుల సినిమాలకు షారుక్ సైన్ చేశారు’ అనే వార్తలు సోషల్ మీడియాల్లో షికార్లు చేస్తున్నాయి. అయితే వాటన్నింటికి కింగ్ ఖాన్ ఫుల్స్టాప్ పెడుతూ.. ‘ప్రస్తుతానికి నేను ఏ సినిమాలకు సైన్ చేయలేదని’ ట్వీట్ చేశాడు. ఇటీవల ట్విటర్లో షారుక్ నిర్వహించిన ‘ఆస్క్ షారుక్‌ఖాన్’ సెషన్లో బాద్షాను ‘మీరు ధూమ్ 4 సినిమాకు సంతకం చేశారా?’ అని ఓ అభిమాని అడిగాడు. దానికి కింగ్‌ఖాన్ ‘ఇది నేను కూడా విన్నాను... నాకు ఆ సినిమాలో నటించాలనే ఉంది, దీనిపై ఇంకేమైన వివరాలు వస్తే నాకు తెలపండి’ అంటూ సరదాగా బదులిచ్చారు. కాగా షారుక్ ఖాన్‌ను తన అభిమానులు డిడిఎల్జేలో రాహుల్‌గా ప్రేమించారు. అలాగే డర్, అంజమ్, బాజిగర్లతో పాటు డాన్ వంటి చిత్రాలలో ప్రతినాయక పాత్రలో కూడా షారుక్ మెప్పించాడు. దీంతో యశ్‌రాజ్ ‘ధూమ్’ సిరీస్‌లో విలన్లుగా నటించిన హీరోలు ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల సరసన కింగ్ ఖాన్ చేరతాడా లేదో మరి వేచిచూడాలి. Maine bhi suna hai. Tumhein kuch aur khabar mile toh dena... https://t.co/m7y5sEVk39 — Shah Rukh Khan (@iamsrk) October 8, 2019 -
ఆ ఫ్లాప్ సినిమాల్లో ఎందుకు నటించావ్?
‘జీరో’, ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రాల్లో హీరో పక్కన నటించిన మహ్మద్ జీషన్.. ఎప్పటికైనా ఓ లీడ్ రోల్లో నటించాలనుకుంటున్నట్లు తెలిపారు. 2011లో ‘నో వన్ విల్ కిల్డ్ జెస్సిక’ సినిమా ద్వారా మహ్మద్ బాలీవుడ్లో అడుగుపెట్టారు. అటుపై ‘తను వెడ్స్ మను’, ‘రాయిస్’, మణికర్ణిక వంటి సినిమాల్లో మంచి నటనను కనబర్చారు. అయితే బాలీవుడ్‌లోషారూక్ ఖాన్, అమీర్ ఖాన్లు నటించిన బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాలైన జీరో, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాల్లో నటించినా అవి తనకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని, దీనిపై తనను అందరూ ప్రశ్నిస్తుంటారని తెలిపారు. అయితే ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై చర్చిస్తూ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. తనను ఇప్పటీకి కొంతమంది జీరొ, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలు ఎందుకు చేశావని అడుగుతుంటారని.. అయితే గెలుపోటములు జీవితంలో ఒక భాగమని అన్నారు. వైఫల్యాలు వచ్చినంత మాత్రాన ప్రయత్నం చేయడం మానోద్దని, తప్పుల నుంచి నేర్చుకుని గెలుపు వైపు పయనించాలని మహ్మద్ అన్నారు. ఎలాంటి పాత్రలు చేయకూడదని అనుకుంటున్నానో అలాంటి పాత్రలే తనకు వస్తున్నాయని, నటనకి ప్రాధాన్యం ఉండే పాత్రలు మాత్రమే చేయలనుకుంటున్నానని అన్నాడు. ప్రస్తుతం అనుభవ్ సిన్హా డైరెక్షన్లో రాబోతోన్న ఆర్టికల్ 15 చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. -
షారూఖ్ అభిమానులకు షాకింగ్ న్యూస్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొద్ది రోజులుగా కాలం కలిసి రావటం లేదు. ఆయన ఖాతాలో ఇటివల ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. ఎన్నో ఆశలతో స్వయంగా నటించి నిర్మించిన ‘ జీరో’ కూడా బోల్తా పడింది. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. ఆ తర్వాత షారూఖ్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. రాకేష్ శర్మ బయోపిక్ ‘సారే జహాసే అచ్చా’లో నటిస్తాడని అనుకున్నా.. అది కూడా పక్కన పెట్టేశాడు. ఈ సారి తమ హీరో డాన్3 తో వస్తాడని ఫ్యాన్స్ ఆశించగా.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు బాద్షా. తాను ఇప్పటి వరకూ ఒక్క సినిమాకు సైన్ చేయలేదని, కొద్దిరోజుల వరకూ సినిమాలు చేయడని చెప్పేశాడు. ‘ నేను ప్రస్తుతానికి ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. కొద్ది రోజుల వరకూ సినిమాలు చేయను. తరచూ సినిమాలు చేయడం, విడుదకాగానే మరో సినిమాకు రెడీ అవడం.. ఇదే నా జీవితంలో ఇంత కాలం జరిగింది. కుటుంబంతో గడిపే టైమే దొరకలేదు. నా పిల్లలు ఇప్పడు కాలేజీ స్టేజ్‌కి వచ్చారు. నా కూతురు కాలేజీకి వెళ్తోంది. నా కొడుకు చదవు పూర్తి కావోస్తోంది. ఇప్పడు కూడా వారితో టైం స్పెండ్ చేయకపోతే ఎలా? నేను ఇంకా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటా. ప్రస్తుతం స్టోరీలు వింటున్నా. ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతున్నాను. కొద్ది తర్వాతే సినిమాలు చేస్తా’ అని ఓ జాతీయ మీడియాతో షారూఖ్ తెలిపారు. ఏదేమైనా బిగ్ స్ర్కీన్‌పై బాద్షా త్వరగా కనిపించి కోట్లాది అభిమానులను అలరించాలని కోరుకుందాం. -
నేనేం ఖాళీగా లేను
‘అనుష్కా శర్మ చేతిలో పనేం లేదు. ఖాళీగా ఉంది’ అంటూ బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. గతేడాది చేసిన ‘జీరో’ తర్వాత ఈ బ్యూటీ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. దాంతో పెళ్లయ్యాక అనుష్కా శర్మకు అవకాశాలు తగ్గాయని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. అసలు ‘జీరో’ తర్వాత మీరు నెక్ట్స్ సినిమాకి ఎందుకు సైన్ చేయలేదు? అనే ప్రశ్న అనుష్కా శర్మ ముందు ఉంచితే... ‘‘గత ఏడాది మూడు (పరి, సూయిధాగా, జీరో) సినిమాలు చేశాను. ఈ సినిమాల్లోని పాత్రలు వేటికవే విభిన్నమైనవి. ఈ పాత్రల రిహార్సల్స్ కోసం చాలా కష్టపడ్డాను. అలాగే ఫ్యాషన్ రంగంలో కాస్త బిజీగా గడిపాను. అందుకే రిలాక్స్ అవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నేను ఖాళీగా ఏం లేను. ప్రొడ్యూసర్‌గా ఓ ప్రాజెక్ట్ గురించి కష్టపడుతున్నాను. అయినా ఇప్పుడు ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేసే పరిస్థితుల్లో లేను నేను. ఇండస్ట్రీలో యాక్టర్‌గా నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాను. ఒక్కసారి నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన సినిమాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ఇకముందు కూడా అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నారు. అందుకే మనసుకి నచ్చిన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటాను. లేకపోతే నిర్మాతగా బిజీగా ఉంటాను’’ అని అన్నారు. -
‘ఇప్పుడు ఆ అవసరం లేదు’
టైం ఉంది కదా అని సినిమాలు చేయాల్సిన అవసరం లేదిప్పుడు నాకు అంటున్నారు బాలీవుడ్ నటి అనుశ్క శర్మ. జీరో తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు అనుశ్క శర్మ. ఈ విషయం గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకున్నాను. ఖాళీగా ఉన్నాను కదా అని సినిమాలు చేయాల్సిన అవసరం లేదిప్పుడు నాకు. అంతేకాక గత మూడేళ్ల నుంచి విరామం లేకుండా పని చేస్తున్నాను. ఈ మూడేళ్లు నా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపాను’ అని తెలిపారు. అంతేకాక ‘ఒక్క ఏడాదిలోనే పరి, సూయి ధాగా, జీరో సినిమాల్లో వేర్వేరు రకాల పాత్రలు పొషించాను. అయితే వీటి కోసం ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. ఈ పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవడం అంత తేలీకైన పనేం కాదు. అందుకే ప్రస్తుతం సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు కూడా నేనేం ఖాళీగా లేను. ఓ ఆసక్తికరమైన చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. దాని కోసం కూడా టైం కేటాయించాలి కదా. నేను తెరమీద కనిపించడం లేదంటే ఖాళీగా ఉన్నట్లు కాదు. వేరే చాలా పనులతో బిజీగా ఉన్నాను అని అర్థం’ అంటూ చెప్పుకొచ్చారు అనుష్క. -
‘భారీ బడ్జెట్ చిత్రం.. మా ప్రేక్షకులకు నచ్చలేదు’
తన కెరీర్లో ఇప్పటి వరకూ జీరో సినిమాకు పెట్టినంత భారీ బడ్జెట్ ఏ సినిమాకు పెట్టలేదన్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదన్నారు. సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూ.200 కోట్లు ఖర్చు పెట్టి జీరో సినిమాను తెరకెక్కించారు షారుక్. కానీ ఈ చిత్రం కనీసం 100 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. షారుక్ కెరీర్లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం ఈ నెల 20న బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్భంగా షారుక్ ఓ చైనా పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో జీరో సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను మా ప్రేక్షకులకు నచ్చే ఓ మంచి సినిమా తీయలేకపోయాను. వారికి నచ్చే విధంగా ఈ స్టోరీని చెప్పలేకపోయాను. కానీ ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. ఇక్కడి ప్రజలకు ఈ సినిమా బాగా నచ్చుతుందని నా నమ్మకం’ అన్నారు. అంతేకాక ‘ఈ చిత్రం కోసం నేను మూడేళ్లపాటు శ్రమించాను. ఆ కష్టమంతా వృథా అయ్యింది. ఫలితం నాకు అనుకూలంగా రాలేదు. అయితే ఈ విషయం గురించి నేను పెద్దగా బాధపడటం లేదు’ అన్నారు షారుక్. అంతేకాక ‘ఓ సినిమా ఫెయిల్ అయ్యిందని తెలిస్తే.. వెంటనే దాన్ని చూడలేను. ఓ 3 నెలల తర్వాత చూస్తే సినిమాలో నేను ఎక్కడ తప్పులు చేశానో అర్థం అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ‘జీరో’ సినిమా కోసం షారుక్ నిజంగానే సాహసం చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన మరుగుజ్జు పాత్రలో కనిపించారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గతేడాది క్రిస్టమస్ సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. -
సూపర్‌స్టార్‌ను తీసేసి యంగ్ హీరోతో..!
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ తరువాత అదే స్థాయిలో స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్న నటుడు షారూఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస విజయాలతో బాద్షాగా వెలుగొందిన కింగ్ ఖాన్ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. తాజాగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారూఖ్‌కు మరో భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీరో భారత్‌లో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. దీంతో షారూఖ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా మార్పలు మొదలయ్యాయి. ముఖ్యంగా రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ నుంచి షారూఖ్‌ను తొలగించటం ఫ్యాన్స్ అవమానంగా భావిస్తున్నారు. వయసు కారణంగానే షారూఖ్‌ను కాదని యంగ్ హీరోల వైపు చూస్తున్నట్టుగా నిర్మాతలు చెపుతున్నా మార్కెట్ లేని కారణంగానే బాద్షాను పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది. షారూఖ్ స్థానంలో యంగ్ హీరో విక్కీ కౌషల్ పేరును పరిశీలిస్తున్నారు. మరి ఈ పరిస్థితులనుంచి కింగ్ ఖాన్ ఎలా బయటపడతాడో చూడాలి. -
కుర్ర హీరోల జోరు ఖాన్‌దాన్‌కి చుక్కెదురు
బాలీవుడ్ ఖాన్దాన్లో ముగ్గురు ఖాన్స్ (సల్మాన్, షారుక్, ఆమిర్) బాక్సాఫీస్‌ను కింగ్స్‌లా రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఏడాదిలో ఎవరో ఒక ఖాన్ సినిమా మిస్‌ఫైర్ అయినా మిగతా ఇద్దరిలో ఎవరో ఒకరి గురి తప్పేది కాదు. కానీ ఈ ఏడాది ముగ్గురు ఖాన్స్ సినిమాలు ఢమాల్ అన్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా రాబట్టలేకపోవడం విశేషం. సల్మాన్ ‘రేస్ 3’, ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’, షారుక్ ‘జీరో’ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు అన్నింట్లో బాలీవుడ్ పెద్దది. మిగతా ఇండస్ట్రీలకు పెద్దన్నయ్యలాగా. రీజినల్ సినిమాలు... తమ్ముళ్లు, చెలెళ్లు. సంవత్సరం పూర్తయ్యాక ఇంట్లో పిల్లలందరి ప్రోగ్రెస్ కార్డులు నాన్నారు సమీక్షించినట్టు.. అన్ని ఇండస్ట్రీలు బాలీవుడ్‌తో పోల్చి చూసుకుంటుంటాయి. వాళ్ల సబ్జెక్ట్‌లు (స్క్రిప్ట్‌లు), వాళ్ల క్లాస్ రూమ్‌లు (థియేటర్స్, ఆడియన్స్) వేరైనా అంతిమంగా ఎవరెంత శాతం సక్సెస్ సాధించారన్నది ముఖ్యం. కానీ ఈ ఏడాది పెద్దన్నయ్య అనుకున్న రేంజ్లో పెర్ఫామ్ చేయలేదనే అనుకోవాలి. కొంత కాలంగా అన్ని ఇండస్ట్రీలకు కథలకు కొరత ఉందనే చెప్పాలి. బాలీవుడ్‌కు కథల కొరత సంభవించినప్పుడల్లా సౌత్ నుంచి కథలను అరువు తెచ్చుకుంటుంది. ఒకవేళ సౌత్ నుంచి ఏమీ లేకపోతే? అలా ఈ ఏడాది వాళ్లకు దొరికిన బంగారు గని ‘బయోపిక్స్’. సుమారు అరడజను బయోపిక్స్‌ను రిలీజ్ చేసింది బాలీవుడ్ ఈ ఏడాది. హార్డ్ హిట్టర్స్ అయిన సీనియర్ బ్యాట్స్మెన్లు (హీరోలు) అందరూ డబుల్, ట్రిపుల్ సెంచరీలు కొడతారనుకుంటే స్లిప్‌కి క్యాచ్ ఇచ్చి వెంటనే పెవీలియన్ చేరుకున్నారు. కానీ.. అండర్ 19 నుంచి ప్రమోషన్ మీద వచ్చిన యంగ్ బ్యాట్స్‌మెన్ అందరూ రఫ్ ఆడించేయడమే ఈ ఏడాది బాలీవుడ్ స్పెషాలిటీ. సక్సెస్ కావాలంటే ఫార్ములానే అవసరం లేదు అని యంగ్‌స్టర్స్ తామందుకున్న రిజల్ట్‌తో నిరూపించారు. ఎవరు కొడితే ఏంటి? గ్యాలరీ (థియేటర్)లో ఉన్న ఆడియన్స్ పాప్‌కార్న్‌కు నంజుగా మంచి అనుభూతిని అందించామా? లేదా? అన్నదే కదా ముఖ్యం. ఈ ఏడాది బాలీవుడ్ ఎలా గడిచిందంటే... మన సౌత్ ఇండియన్ మార్కెట్లలో సినిమాల పండగ సంక్రాంతికి మొదలైతే బాలీవుడ్ వాళ్లకు రిపబ్లిక్ వీకెండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అవ్వకముందే హిట్ సినిమాలేం వదులుతాములే అన్నట్టు రిపబ్లిక్ వీకెండ్ వరకూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ ఏడాదిని విక్రమ్ భట్ హారర్ చిత్రం ‘1921’తో మొదలుపెట్టారు. ప్రేక్షకులు దడుచుకోలేదు. ఏం ఫర్వాలేదు.. హారర్ పోతే పోయింది.. యాక్షన్, లవ్ సినిమాలున్నాయి కదా.. ఈ ఏడాదిని ధైర్యంగా దాటేయొచ్చు అనే దీమా బాక్సాఫీస్‌కి ఏర్పడింది. తర్వాత సైఫ్ అలీఖాన్ ‘కళాకండీ’, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘ముక్కాబాజ్’ సినిమాలు రిలీజయ్యాయి. ‘ముక్కాబాజ్’లో హీరో వినీత్ తన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే ప్రదర్శనైతే కనబరిచారు. ఆ తర్వాత ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ మంచి హిట్ సాధించింది. 2018లో వచ్చిన ఫస్ట్ హిట్. చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకులన్నీ దాటి థియేటర్స్ వరకూ చేరుకోగలిగిందీ సినిమా. మంచి హిట్. 300 కోట్ల కలెక్షన్స్. పద్మావతిని దక్కించుకోవాలన్న ఖిల్జీ (రణ్వీర్) ప్రయత్నం విఫలమైంది. ‘పద్మావతి’ దక్కకపోయినా బాధపడకంటూ ఈ ఏడాది ఉన్న బెస్ట్ యాక్టర్ పురస్కారాలు రణ్‌వీర్‌ని సముదాయించాయి. అన్నట్లు.. సినిమాలో దక్కని దీపికా రియల్ లైఫ్‌లో రణ్‌వీర్‌కు దక్కారు. దీపికా పదుకోన్ సందేశానికి పట్టం ‘పద్మావత్’ రిలీజ్ రోజే రిలీజ్ కావల్సిన అక్షయ్ కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’ క్లాష్ వద్దు సింగిల్ రిలీజే ముద్దు అంటూ ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. తక్కువ ఖర్చుతో శానిటరీ న్యాప్కిన్ తయారు చేసిన అరుణాచలం మురుగనాథన్ ఆశయానికి ‘ప్యాడ్‌మ్యాన్’ ద్వారా స్క్రీన్ రూపమిచ్చారు దర్శకుడు బాల్కీ. సందేశాత్మక సినిమా అయినా కాసుల వర్షం కురిపించింది. డిజిటల్ మార్కెట్ రానుందని హింట్ ఇస్తూ ఆ తర్వాతి వారంలో విక్కీ కౌశల్ ‘లవ్ ఫర్ స్క్వేర్ ఫూట్’ థియేటర్స్‌లో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై, మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌కు పెట్టింది పేరు నీరజ్ పాండే. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్, మనోజ్ బాజ్‌పాయ్‌లతో ముంబైలో జరిగిన ఓ స్కామ్ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘అయ్యారే’. థ్రిల్లర్‌తో వచ్చే చిక్కేంటంటే ప్రేక్షకుడిని టెన్షన్ పెట్టకపోతే అసహనం అడగకుండానే వస్తుంది. ఈ సినిమాకి అలానే వచ్చింది. దాంతో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద హిట్ ‘సోనూ కీ టీటు కి స్వీటీ’. కమర్షియల్‌గా వంద కోట్లు చేసేసింది. ‘సాగర సంగమం’లో భంగిమ అంటూ కమల్ హాసన్‌ని ఇబ్బంది పెట్టిన బుడతడు పెరిగి పెద్దయి బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతూ తీసిన ‘వెల్కమ్ టు న్యూయార్క్’ ఫ్లాప్‌గా నిలిచింది. నిర్మాతగా మారిన అనుష్కా శర్మ తన మూడో ప్రయత్నంగా నిర్మించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ‘పరీ’. అనుష్క పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డా సినిమాకు ఎక్కువ మార్కులేయడంలో పిసినారితనం చూపించారు ప్రేక్షకులు, విమర్శకులూ. హాట్ చిత్రాల సిరీస్ ‘హేట్ స్టోరీ 4’ దారుణంగా మిస్‌ఫైర్ అయింది. ఇలియానాతో కలసి అజయ్ దేవగణ్ థియేటర్స్ మీద జరిపిన ‘రైడ్’ మంచి అనుభూతినిచ్చింది. కమర్షియల్‌గా బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత రాణీ ముఖర్జీ ‘హిచ్కీ’తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఎన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా మీరంటే అంతే పిచ్చి అని ‘హిచ్కీ’కి మంచి సక్సెస్ అందించారు. కేవలం ఇండియాలోనే కాకుండా చైనా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది ‘హిచ్కీ’. తెలుగులో హిట్ వస్తే చాలు క్షణం ఆలోచించకుండా రీమేక్ చేయాలనుకుంటారు టైగర్ ష్రాఫ్. మన అడవి శేష్ ‘క్షణం’కి గన్లు, యాక్షన్ సీన్లు భారీగా జోడించి ‘భాగీ 2’గా విడుదల చేశారు. డబ్బులొచ్చినా కూడా అనుకున్నని అభినందనలు రాలేదు. మళ్లీ ‘భాగీ 3’గా 2020లో వస్తున్నాను అని ఆల్రెడీ టైగర్ ష్రాఫ్ అనౌన్స్ చేశారు కూడా. ఈ పార్ట్ 3 కోసం ఏ తెలుగు సినిమాను ఎంపిక చేసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో మజా లేదు ఇర్ఫాన్‌ఖాన్ ‘బ్లాక్మెయిల్’ కామెడీకు బాగానే నవ్వుకున్నారు. మనోజ్ భాజ్‌పాయ్, టబుల ‘మిస్సింగ్’లో ఏదో మిస్సయిందన్నారు. సూజిత్ సర్కార్ తెరకెక్కించిన సున్నితమైన లవ్‌స్టోరీ ‘అక్టోబర్’. ఈ పరిమళం భలే ఉందే అంటూ మంచి హిట్ చేశారు ప్రేక్షకులు. వరుణ్ ధావన్ నటుడిగా ఒక మెట్టు ఎదిగారంటూ రాసుకొచ్చింది బాలీవుడ్ మీడియా. ‘బియాండ్ క్లౌడ్స్’ కొన్ని వర్గాల ఆడియన్స్‌కు మాత్రమే అనిపించుకుంది. సుధీర్ మిశ్రా ‘దాస్ దేవ్’ను ఫర్వాలేదన్నారు. సో.. మార్చి నెల పెద్ద మజా లేకుండానే ముగిసింది. టాప్‌లో సంజు తండ్రీకొడుకులుగా ‘102 నాటౌట్’లో అమితాబ్, రిషీ కపూర్ చేసిన హంగామా ఆకట్టుకుంది. జీవితం పట్ల నిరాశలో ఉన్న కొడుకుకి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పారు అమితాబ్. ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కు పరిగెట్టి మరీ నేర్చుకున్నారు ఈ పాఠాలు. ఈ ఏడాది బెస్ట్ చిత్రాల్లో ఒకటైన ‘రాజీ’ మే 11న రిలీజైంది. మేఘన్ గుల్జార్ తెరకెక్కించిన ఈ పాకిస్థాన్– ఇండియన్ స్పై డ్రామా విపరీతంగా ఆకట్టుకుంది. ఆలియా భట్ నటనకు బాక్సాఫీస్ వంద కోట్లు ఇవిగో అంటూ ఆమె ఒళ్లో పోసింది. ఇందాక మాట్లాడుకున్న విక్కీ కౌశల్ ఈ సినిమాలోనూ మెరిశాడు. జాన్ అబ్రహామ్ పేట్రియాటిక్ డ్రామా ‘పరమాణు’ సూపర్ హిట్‌గా నిలిచింది. న్యూ ఏజ్ సినిమా అంటూ కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్ చేసిన ప్రయత్నం ‘వీరే ది వెడ్డింగ్’ ఎక్కువ నెగటీవ్ ఫీడ్‌బ్యాక్‌నే అందించింది. ఫస్ట్ డే అనుహ్య కలెక్షన్స్ సాధించినప్పటికీ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. అక్క సోనమ్‌తో పాటు అదే రోజు తమ్ముడి హర్షవర్థన్ కపూర్ ‘బవేష్ జోషీ’ రిలీజైంది. పాజిటీవ్ రివ్యూస్‌ని పైసలుగా మార్చుకోవడంలో ఇబ్బంది పడింది ఈ సినిమా. హిందీలో రేస్ సిరీస్‌కు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ మూడో పార్ట్‌ను సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు అనేసరికి ఫ్యాన్స్ ఆశలు, బాక్సాఫీస్ ఆకలినీ పెంచేసుకుంది. రెంటినీ తీర్చడంలో దారుణంగా విఫలమైంది ‘రేస్ 3’. ఆ తర్వాత మోస్ట్ వెయిటెడ్ బయోపిక్ ‘సంజు’ రిలీజైంది. సంజయ్ దత్లా రణ్‌బీర్ కపూర్ నటించి కాదు జీవించి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. రాజ్‌కుమార్ హిరాణీ సినిమా స్టైల్లోనే నవ్వులు పూయిస్తూ చివర్లో ముక్కులూ తుడిపించారు. సంజయ్‌కు క్లీన్ ఇమేజ్ తీసుకొచ్చే భాగమే ఈ బయోపిక్ అని కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. ఈ ఏడాది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లిస్ట్‌లో టాప్ స్థానం మాత్రం సంజుదే. తాప్సీకి రెండు విజయాలు స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మ’లో తాప్సీ పర్ఫార్మెన్స్ సూపరమ్మా అని కితాబులిచ్చారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పరిచయమైన చిత్రం ‘ధడక్’. మరాఠీ బ్లాక్‌బస్టర్ హిట్ ‘సైరాట్’ రీమేక్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం నిరాశే మిగిల్చింది. జాన్వీ నటన గురించి మంచి విషయాలే చెప్పారు ప్రేక్షకులు. సంజయ్ దత్ ‘సాహెబ్ బీవీ అవుర్ గ్యాంగ్‌స్టర్’ ఫ్లాప్. అనిల్ కపూర్, ఐశ్వర్యా రాయ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన ‘ఫ్యాన్నీ ఖాన్’ మంచి ఫలితమే ఇచ్చింది. తాప్సీ, రిషీ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘ముల్క్’. విమర్శకులు అద్భుతంగా ప్రశంసించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి హిట్‌నే నమోదు చేసుకుంది. ఓ స్త్రీ మళ్లీ రా మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కర్వాన్’. ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పార్కర్లతో కలిసి దుల్కర్ చేసిన ఈ రోడ్ మూవీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. బాలీవుడ్‌కు మరో ఇంపార్టెంట్ వీక్ ఇండిపెండెన్స్ వీక్. అక్షయ్ కుమార్ ‘గోల్డ్’, జాన్ అబ్రహామ్ ‘సత్యమేవ జయతే’ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఫుట్‌బాల్ టీమ్ సాధించిన తొలి గోల్డ్ మెడల్ కథ ఇది అంటూ తెరకెక్కిన ‘గోల్డ్’ చిత్రం బాగానే ఆడింది. ‘దిల్ బర్’ సాంగ్‌తో స్పెషల్ క్రేజ్ సాధించిన ‘సత్యమేవ జయతే’ కూడా డీసెంట్‌గా రన్ అయింది. సోనాక్షి ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’, డియోల్స్ (సన్నీ, బాబీ, ధర్మేందర్) చేసిన కామెడీ ‘యమ్లా పగ్లా దీవానా’ ఫ్లాప్స్‌గా నిలిచిచాయి. ‘ఓ స్త్రీ రేపు రా’ అనే చిన్న వాక్యానికి సంబంధించిన హారర్ స్టోరీని మనం చాలా సార్లే విన్నాం. ఇప్పుడు ఇదే లైన్‌తో దర్శక ద్వయం రాజ్–డీకే రచించిన ‘స్త్రీ’ చిత్రం పెద్ద హిట్. సినిమా హాళ్లలో కిందా మీదా పడి మరీ నవ్వుతూ తెచ్చుకున్న పాప్‌కార్న్‌ను వొలికించేశారు ఆడియన్స్. ఈ ఏడాది వసూళ్లలో టాప్‌లో నిలిచిన చిత్రాల్లో ఇది ఒకటి. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ప్లాన్స్‌లో ఉన్నారు దర్శక–నిర్మాతలు. రీమేక్ కుదరలేదు ఇంతియాజ్ అలీ సమర్పణలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’ ఫర్వాలేదనిపించుకుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాల చుట్టూ డార్క్ సినిమాలు తెరకెక్కించే అనురాగ్ కశ్యప్ తొలిసారి రూపొందించిన లవ్‌స్టోరీ ‘మన్మర్జియా’. విక్కీ కౌశల్, తాప్సీ, అభిషేక్ పోటీపడి మరీ నటించారు. సూపర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ‘లవ్ సోనియ’, మిత్రోన్, బట్టీ గుల్ మీటర్ చాలు’ వచ్చినవి వచ్చినట్టుగా వెళ్లిపోయాయి. ‘పెళ్లి చూపులు’ రీమేక్‌గా రూపొందిన ‘మిత్రోన్’ రీమేక్‌ను చెడగొట్టారనే కామెంట్‌ను కూడా మూటగట్టుకుంది. రచయిత మంటో లైఫ్ ఆధారంగా నందితా దాస్ తెరకెక్కించిన చిత్రం ‘మంటో’. మంటోగా నవాజుద్ధిన్ సిద్ధిఖీ నటనకు డిస్టింక్షన్ మార్కులు పడ్డాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ అనే కాన్సెప్ట్‌తో వరుణ్, అనుష్కా శర్మ చేసిన చిత్రం ‘సూయి ధాగా’. శరత్ కాత్రియా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. పాకిస్థాన్, ఇండియా లాంటి అక్కాచెల్లెళ్లు అంటూ ఒకరంటే ఒకరికి పడని సిస్టర్స్ కథతో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ‘పటాకా’ యావరేజ్‌గా నిలిచింది. గుడ్డిగా డబ్బులిచ్చేశారు సల్మాన్ ఖాన్ తన బావమరిది ఆయుష్ శర్మను పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘లవ్యాత్రి’. నవరాత్రులు అయ్యేలోపు సినిమాను కూడా తీసేశారు. అదే రోజు రిలీజైన ఆయుష్మాన్ ఖురాన్ ‘అంధాధూన్’ వందకు వంద మార్కులు వేయించుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాకి గుడ్డిగా డబ్బులిచ్చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి థ్రిల్లర్‌ని చూడలేదన్నారు. హాలీవుడ్ లాంటి అసంబద్ధ థ్రిల్లర్లు, అర్థమయ్యేట్టు స్పూన్ ఫీడింగ్ కూడా చేయక్కర్లేదు అని హీరోను గుడ్డివాణ్ణి చేసి మరీ ఇంకా ఫార్ములా ఛట్రంలోనే కొట్టుమిట్టాడుతున్న కొందరి కళ్లైనా తెరిపించారు చిత్రదర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ‘కాజోల్ హెలీకాఫ్టర్ ఈల’ సరిగ్గా ఆడలేదు. హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్’ మంచి రివ్యూస్‌ని అందుకున్నా క్యాష్ చేసుకోలేకపోయింది. అర్జున్ కపూర్ ‘నమస్తే ఇంగ్లాండ్’ దారుణంగా విఫలమైంది. ఆల్రెడీ ‘అంధాధూన్’ వంటి సూపర్ హిట్‌తో ఫామ్‌లో ఉన్న ఆయుష్మాన్ ఖురానా ‘బదాయి హో (శుభాకాంక్షలు)’కు మరోసారి బదాయి హో అన్నారు ఆడియన్స్. నీనా గుప్తా, గజ్రాజ్ పాత్రలు పోషించిన తీరుకు మంచి రెస్పాన్స్ లభించింది. మళ్లీ ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ వరకూ చెప్పుకునే సినిమాలే రాలేదని చెప్పాలి. దొంగలు కొల్లగొట్టలేకపోయారు అమితాబచ్చన్, ఆమిర్‌ఖాన్ తొలిసారి కలసి రావడం, అదీ.. దొంగల్లా అనేసరికి ప్రేక్షకులంతా ఆమితానంద పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుందాం అనుకున్నారు. కానీ ఎందుకో ఈ థగ్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టుకోవడంలో తడబడ్డారు. సినిమా విపరీతంగా నిరాశపరిచింది. సన్నీ డియోల్ ‘మొహల్లా అస్సీ’ కూడా సరిగ్గా ఆడలేదు. రిషీ కపూర్ ‘రాజ్మా చావ్లా’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. చావ్లా రుచి బాగుంది అన్నారు ఆడియన్స్. మళ్లీ నిరాశ సైఫ్ అలీఖాన్ తనయ సారాని పరిచయం చేస్తూ అభిషేక్ కపూర్ తీసిన ‘కేధార్నాథ్’ నిరాశపరిచింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ ‘జీరో’ విడుదలైంది. ఎప్పుడో ‘అపూర్వ సహోదరులు’లో కమల్‌హాసన్ మరుగుజ్జు పాత్ర చేశారు. వీఎఫ్ఎక్స్ ద్వారా షారుక్ ఖాన్‌ను మరుగుజ్జును చేశారు దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్. ఈ మధ్య సరైన హిట్స్ ఇవ్వలేదు షారుక్. ఈసారి కచ్చితంగా హిట్ సాధిస్తాడని ఆశలు పెంచుకున్న అభిమానులకు చుక్కెదురైంది. ఈ ఏడాదికి ‘సింబా’తో గుడ్‌బై చెప్పారు రణ్వీర్ సింగ్. ‘టెంపర్’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్‌తో థియేటర్స్‌లో నడుస్తోంది. సినిమా ఫలితాల్ని ముందే పసిగట్టలేం. కానీ మంచి ఫలితాలు అందుకోవాలనే అందరూ శ్రమిస్తారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని కోరుకుందాం. 2017కన్నా 2018 బాగుంది. 2019 మరింత పసందుగా ఉండాలని ఆకాంక్షిద్దాం. యంగ్ స్టార్స్‌దే హవా ఈ ఏడాది బాలీవుడ్ యంగస్టర్స్దే. విక్కీ కౌశల్ (లవ్ ఫర్ స్క్వేర్ ఫూట్, రాజీ, సంజు), ఆయుష్మాన్ ఖురానా (అంధాధూన్, బదాయి హో), రాజ్‌కుమార్ రావ్ (స్త్రీ)లదే హవా. వీళ్ల సినిమాలు విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టాయి. ఖాన్‌లను కాదని మరీ ఈ యంగ్ హీరో సినిమాల టికెట్స్‌ను తెంపారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ల సినిమాలు ఎలా ఉన్నాయో. ఆయుష్మాన్ ఖురానా,రాజ్‌కుమార్ రావ్, విక్కీ కౌశల్ బిజినెస్ బావుంది! గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది బాలీవుడ్ బిజినెస్ 15 నుంచి 20 శాతం వరకూ పెరిగిందన్నారు ట్రేడ్ విశ్లేషకులు. 2017లో బాలీవుడ్ సినిమాల బిజినెస్ సుమారు 4,096 కోట్లు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 4,800 కోట్లకు చేరుకుంది. ముగ్గురి ఖాన్ల సినిమాలు రిలీజ్ అయినా కూడా కంటెంట్‌తో ఉన్న చిన్న సినిమాలే ఈ ఏడాది జాక్‌పాట్ అన్నారు. ‘సోనూకే టీటుకే స్వీటీ, స్త్రీ, అంధాధూన్, బదాయి హో’ వంటి చిన్న చిత్రాలు సర్ప్రైజ్ హిట్స్‌గా నిలిచాయి. కలెక్షన్స్‌లో ‘సంజు’ టాప్‌లో ఉన్నాడు. రణ్‌బీర్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమవకుండా ఈ ఏడాది స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కనిపించాయి. దీపికా పదుకోన్ (పద్మావత్), ఆలియా భట్ (రాజీ), రాణీ ముఖర్జీ (హిచ్కీ), తాప్సీ (ముల్క్, మన్మర్జియా), అనుష్కా శర్మ (సూయి ధాగా). అలాగే.. టబు (అంధాధూన్), నీనా గుప్తా (బదాయి హో) లాంటి పాత్రలన్నీ గుర్తుండటానికి కారణం గ్లామర్ మోతాదే కాకపోవడం విశేషం! ఆలియా భట్ ట్రెండేంటి? బయోపిక్స్‌తో పాటు ఈ ఏడాది కనిపించిన మరో ట్రెండ్ రీమిక్స్. పాత సూపర్ హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి సినిమాలకు క్రేజ్ తెచ్చుకోవాలనుకున్నారు. పాత పాట మ్యాజిక్ ఏ పాటా రిపీట్ చేయలేదన్నది మాత్రం వాస్తవం. అలాగే దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా పెళ్లిలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. – గౌతమ్ మల్లాది -
‘జీరో’ వసూళ్లు.. నిరాశపరిచిన బాద్షా
కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్ జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షారూఖ్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. జీరోకు కూడా డివైడ్ టాక్ రావటంతో ఆ ప్రభావం కలెక్షన్ల మీద గట్టిగానే కనిపిస్తోంది. భారీ హైప్ కారణంగా తొలిరోజు 20 కోట్లకు పైగా వసూళ్లు చేసిన జీరో వీక్డేట్స్లో అదే రేంజ్ కంటిన్యూ చేయలేకపోయింది. తొలి వారాంతానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 107 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించి నిరాశపరిచింది. సోమవారం కలెక్షన్లు మరింత భారీగా పడిపోయినా మంగళవారం క్రిస్టమస్ సెలవు కావటంతో వసూళ్లు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటించారు. #Zero has clearly underperformed... Remained on similar levels over the weekend... No turnaround / big jump in biz... #Christmas holiday [tomorrow] should boost biz... Real test on Wed and Thu... Fri 20.14 cr, Sat 18.22 cr, Sun 20.71 cr. Total: ₹ 59.07 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 24 December 2018 -
అది తప్ప మిగతా అంతా ఓకే : పాయల్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లో వేడి పుట్టించింది పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. ఒక్క సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ హీరోయిన్ ‘జీరో’ సినిమాపై చేసిన కామెంట్స్, ఫన్నీ వీడియోస్ వైరల్‌గా మారాయి. షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘జీరో’ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీలో అనుష్క చేసిన పాత్రకు, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కథాకథనాలు సరిగా లేకపోవడంతో ఆడియెన్స్‌ను చేరుకోలేకపోతోంది. అయితే ఈ సినిమాను వీక్షించిన అనంతరం పాయల్ రాజ్‌పుత్ చేసిన కామెంట్స్, వీడియోస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వాటిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్క హిట్టు పడ్డంత మాత్రాన ఇలా చేయడం తగదంటూ ఒకరు కామెంట్ చేయగా.. మీరు అంటే ఇంతవరకు ఇష్టం ఉండేది కానీ, ఇది చూశాక పోయిందని మరొకరు పాయల్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే తనపై వస్తోన్న నెగెటివిటిని తగ్గించుకునేందుకు వివరణ కూడా ఇచ్చారు. తాను షారుఖ్ నటన గురించి మాట్లాడలేదని.. సినిమాలో కథాకథనాల గురించి మాత్రమే చెప్పానని, పైగా తాను షారుఖ్‌కు పెద్ద అభిమానినంటూ చెప్పుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ సినిమా బాగుందని, సెకండాఫ్‌లో కొంచెం సాగదీతలా అనిపించిందని.. అది తప్ప మిగతా అంతా ఓకే అంటూ వివరణ ఇచ్చుకున్నారు. కానీ అంతలోపే తనపై రావాల్సిన నెగెటివిటీ వచ్చేసింది. -
జీరోపై పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్
-
అఫీషియల్ : కృష్టుడిగా ఆమిర్..!
ఇప్పటికే చాలా సార్లు వెండితెరకెక్కిన మహాభారత గాథ ఇప్పుడు మరింత భారీగా రూపొందనుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు పూనుకున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా సిరీస్‌గా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమిర్.. శ్రీ కృష్ణుడిగా నటించే అవకాశం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ స్పందించాడు. జీరో సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షారూఖ్ తనకు శ్రీ కృష్ణుడి పాత్రలో నటించాలని ఉందని.. అయితే ఆ పాత్రను త్వరలో ఆమిర్ పోషించబోతున్నాడని వెల్లడించారు. దీంతో మహాభారతంలో ఆమిర్ చేయబోయేది శ్రీకృష్ణుడి పాత్రే అని కన్ఫామ్ అయ్యింది. -
‘జీరో’ వివాదం ముగిసినట్టేనా..!
కొంత కాలంగా వరుసఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్ ఈ శుక్రవారం జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ట్రైలర్లో షారూఖ్.. సిక్కులు కిర్పన్ ను ధరించి ఉండటం వివాదాస్పదమైంది. అమృతాపాల్ సింగ్ అనే న్యాయవాధి కోర్టును ఆశ్రయించటంతో చిత్రయూనిట్ స్పందించింది. అది కిర్పన్ కాదని కేవలం ఆ పాత్ర తన పెళ్లి సమయంలో వేసుకున్న ఓ అలంకారం మాత్రమే అని కోర్టుకు తెలిపారు. ఈ సన్నివేశాల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే సదరు సన్నివేశాల్లో కనిపించిన బాకును గ్రాఫిక్స్‌లో ఓ షో పీస్‌లా మారుస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో జీరో వివాదం ముగినట్టే అని భావిస్తున్నారు. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. -
సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది : కత్రినా
‘తనతో పనిచేయడం ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. తన టీమ్‌తో కలిసినపుడు సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుంది. రేస్ సినిమాలో జర జర సాంగ్ బాగా రావడం కోసం తను నన్ను ప్రోత్సహించిన విధానాన్ని మర్చిపోలేను. ఇప్పుడేమో ఆనంద్ రాయ్, బోస్కీ డాన్స్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో.. మనకోసం మనం డాన్స్ చేస్తే అందులో ఉండే ఆనందం ఏమిటో ఈ పాట ద్వారా తెలియచేశారు’ అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) on Dec 16, 2018 at 10:02pm PST బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో.. ఆనంద్ ఎల్ రాయ్ జీరో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో... క్యాట్స్ మూవీ స్టార్‌గానే అలరించనున్నారు. ఈ నేపథ్యంలో ‘హసన్ పర్చామ్’ అనే సాంగ్ కోసం చేసిన డ్యాన్స్ రిహార్సల్ తాలూకు వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇంత మంచి స్టెప్స్‌ను నేర్పించినందుకు థాంక్స్ అంటూ కొరియోగ్రాఫర్ బోస్కోమార్టిస్ను ప్రశంసిస్తూ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. అంతటితో ఆగకుండా కత్రినా డ్యాన్సింగ్ క్వీన్.. తెరవెనుక ఇంత కష్టపడాల్సి ఉంటుందా.. నిజంగా చాలా గ్రేట్ అంటూ ఆమెను కొనియాడుతున్నారు కూడా. -
ఈ సినిమా కూడా ఫెయిలయితే...
వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. ఆయన నటించిన ఫ్యాన్, రాయిస్, దిల్వాలే వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో షారుక్ హీరోగా వచ్చిన ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ చిత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 64. 33 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వరుస పరాజయాలు పలకరిస్తున్నప్పటికీ షారుక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం జీరో. , అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడిన షారుక్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘భారీ హిట్ కొట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. మళ్లీ అలాంటి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాను కానీ కుదరడం లేద’ని అన్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న జీరో చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఫలితం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. దాన్ని నేను మార్చలేను కూడా. మరి మార్చడానికి కుదరని అంశాల గురించి నేను ఎందుకు ఆలోచించాలి’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ‘జీరో చిత్రం షారుక్ కెరీర్‌కి చాలా ముఖ్యమైంది.. కచ్చితంగా విజయం సాధించాలని జనాలు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫెయిల్ అయ్యిందనుకొండీ.. అప్పుడు మహా అయితే ఓ 6 - 10 నెలల పాటు నేను సినిమాలు చేయను. కానీ నా నైపుణ్యం, కళ మంచివని నమ్మినన్ని రోజులు మరిన్ని సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని షారుక్ బదులిచ్చారు. -
అల్లు అర్జున్ చాలా టాలెంటెడ్ : షారుఖ్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ శుక్రవారం జీరోతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న షారుఖ్ ప్రమోషన్లో భాగంగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ‘బన్నీ చాలా టాలెంటెడ్ త్వరలోనే తనని కలిసి టైం స్పెండ్ చేస్తా’నన్నాడు షారుఖ్. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు. కొంత కాలంగా వరుసఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న బాద్ షా ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. తెలుగు హీరోల్లో ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో అల్లు అర్జున్. బన్నీ సినిమాలు మాలీవుడ్ లో రికార్డ్‌లు తిరగరాస్తుంటే.. హిందీలో డబ్ అయిన సినిమాలు యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. -
సౌత్ అండ్ నార్త్.. గుడ్ కాంబినేషన్
షారుక్ ఖాన్... పెద్ద పరిచయం అక్కర్లేదు. ఆయన చేసే సినిమాల్లానే షారుఖ్ నటన కూడా విభిన్నంగా ఉంటుంది. షారుక్ హీరోగా నటించిన మరో డిఫరెంట్ మూవీ ‘జీరో’. కత్రినా కైఫ్, అనుష్కా శర్మ కథానాయికలుగా నటించారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జీరో’ ప్రయాణాన్ని ‘సాక్షి’తో షారుక్ ఇలా పంచుకున్నారు. ► ‘జీరో’ సినిమా కథనం ఎలా ఉంటుంది? సాధారణ జీవితం గడిపే ప్రజల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఎమోషనల్ కంటెంట్ ఉంది. దేవుడు మనకు ఒకటే జీవితం ఇచ్చాడు. మనలో ఉన్న లోపాలను గుర్తు చేసుకుంటూ ఏం సాధించలేకపోతున్నాం అని పశ్చాత్తాప పడకూడదు. ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదని చెప్పే చిత్రం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అసంపూర్ణమైన అంశం ఉంటుంది. దేవుడు మనల్ని ఎలా సృష్టిస్తే అలానే జీవితాన్ని ఆస్వాదించాలి. మనం మనలా ఉంటేనే జీవితాన్ని ఆస్వాదించగలం. కానీ సక్సెస్ అయిన వాళ్ల ప్లేస్‌లో మనం ఉంటే బాగుండేదని కొందరు ఆలోచిస్తుంటారు. అది తప్పు. మన బాడీ మనది, మన ఎమోషన్ మనది. అలా జరిగి ఉంటే.. ఇలా జరిగి ఉంటే... ఇలాంటి ఆలోచనలను వదిలివేయాలి. నిజాన్ని ఒప్పుకోవాలి. నీకు పాటలు పాడటంలో నైపుణ్యం ఉంటే సాధనతో లతా మంగేష్కర్ కూడా అవ్వొచ్చు. మనం సచిన్ టెండూల్కర్ ఎందుకు కాలేదు? అని ఆలోచిస్తుంటారు కొందరు. ► మనలో ఉన్న లోపాల గురించి బాధపడకూడదు. సెలబ్రేట్ చేసుకోవాలి. అదే ‘జీరో’ సినిమా అంటున్నారు. నిజ జీవితంలో ఇది సాధ్యమా? హృదయం, శరీరం, మెదడు అందిరికీ ఉంటాయి. జుట్టు, కలర్, ముక్కు, నోరు ఉంటాయి. తేడాలు మనం పిలుచుకునేవి. లైఫ్‌లో పెరగడంలో కొన్ని ఫేజ్లను దాటుకుంటూ వస్తాం అంతే. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా కొన్ని కుదరవు. మనకు మనం ప్రత్యేకమని తెలుసుకోవాలి. ఒక కుటుంబంలోని తండ్రి అందరినీ ఒకేలా చూస్తాడు. ఎక్కువ తక్కువలు ఉండవు. కొందరు మా ఫాదర్ అది ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదు అంటారు. జీవితం ఇచ్చాడు. ఇంకేం ఇవ్వాలి. నీకు లోపాన్ని ఇచ్చిన దేవుడు ఏదో ప్రత్యేకత కూడా ఇచ్చే ఉంటాడు. వెతికి పట్టుకుని పోరాడు. ► మనల్ని మనం నమ్మడం అంటే? నేను బేసిక్‌గా లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. మధ్య తరగతి వారందరికీ నేను ఒక ఉదాహరణ. మా అమ్మానాన్నలు కూడా మమ్మల్ని పోషించడానికి, చదివించడానికి కష్టపడ్డారు. వారు అంతగా చదువుకోలేదు. నిన్ను నువ్వు నమ్మాలి. నేను బెస్ట్ ఫైటర్ని కాదు, బెస్ట్ బాడీ లేదు. కానీ నాకు పని ఉంది. కష్టపడాలి అనుకున్నాను. నా బెస్ట్ ఇచ్చాను. తపన ఉంటే ఎవరైనా నాలాగా కావచ్చు. కానీ చేస్తున్న పనిని నమ్మాలి. నా కెరీర్స్టార్టింగ్లో నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. చాలా తెలుసుకున్నాను. చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంది. అఫ్కోర్స్ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఉంటాను కూడా. ఇది నిజం. హీరో కాబట్టి నాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఖరీదైన దుస్తులు వేసుకుంటాను. నేను ఏం చెప్పినా చిటికెలో జరిగిపోతుంది. ఇవన్నీ సినిమాలోనే. నిజ జీవితంలో నేనూ చాలా సింపుల్‌గా ఉంటాను. అందరూ చేసే పనులే చేస్తుంటాను. ► 40 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ చేశారు కదా? హార్డ్ వర్క్‌ను నమ్ముతాను. నా డ్యాన్స్ హృతిక్ రోషన్‌లా ఎందుకు లేదు? అమితాబ్గారిలా నా వాయిస్ ఎందుకు బాగా రాలేదు? అని నేను బాధపడలేదు. నాకు చేతనైనంతలో దేవుడు నాకు ఇచ్చిన దాంతో కష్టపడుతుంటాను. వాళ్ల స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ వారిలా కావాలని అనుకోను. నేను దేశంలో బెస్ట్ డ్యాన్సర్‌ని కాను. నా 42 ఏళ్ల వయసులో నేను సిక్స్‌ప్యాక్ చేశాను. ఎలా చేశానంటే నేను చేయగలనని నమ్మాను. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ బాడీలను చూశాను. ఇన్స్పైర్ అయ్యాను. చేశాను. ఇతరుల ప్రతిభను అంగీకరించడం మంచి లక్షణం. నువ్వు సాధించాలని అనుకున్నదాని గురించి నీ మైండ్‌లో నువ్వు ఎంత బలంగా ఫిక్స్ అయ్యావు? అన్నదే ముఖ్యం. ► ‘జీరో’ టైటిల్ పెట్టడానికి కారణం? జీరో అంటే రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి జీరోతోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది. మరోటి జీరోతో ముగుస్తుంది. దేన్ని తీసుకోవాలో మన చేతుల్లో ఉంటుంది. సినిమా అంటనే లైఫ్‌లో చేయలేనివి చేయడం. కొన్ని సినిమాల్లో నేనూ చేశాను. ఒక్కడినే వందమందిని కొట్టాను. వెయ్యి మందితో డ్యాన్స్ చేశాను. గాల్లో ఎగిరాను. కానీ నేను సినిమా హీరోని. రియల్ లైఫ్ హీరోలు చాలా సింపుల్‌గా ఉంటారని నా నమ్మకం. నిజానికి జీవితం ముందు మనం చిన్నవాళ్లం. నీ దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకున్నప్పుడు నీవు ఏదైనా సాధించగలవు అనే నమ్మకం కలుగుతుంది. అప్పుడు జీరోతోనే స్టార్ట్ కావాలి. ► ఇటీవల మీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయా? సినిమాను హిట్ చేయడం, చేయకపోవడం నా చేతుల్లో లేదు. ఆడియన్స్ చూస్తారు. నచ్చితే హిట్ అవుతుంది. లేకపోతే లేదు. నేను నమ్మినదాన్ని ఫాలో అవుతాను. కష్టపడతాను. అలానే నేను షారుక్ ఖాన్ అయ్యాను. నా సినిమా సరిగ్గా ఆడలేదు అంటే నేను సరిగ్గా చేయలేదని కాదు. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు సినిమాలో ఏదో మిస్ అయ్యిందని. అంతే. అలాగే నా సినిమా హిట్ సాధిస్తే అది నా గొప్పతనం కాదు. ఆడియన్స్ సినిమాను హిట్ చేశారు. ఒకే రకమైన సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ‘చక్ దే ఇండియా, చెన్నై ఎక్స్‌ప్రెస్, ఫ్యాన్, దిల్వాలే దిల్ లేజాయేంగే, దేవదాసు, రాయీస్, బాజీఘర్, అశోక’.. ఇలా దేనికదే విభిన్నం. ► ‘జీరో’ సినిమా షూటింగ్లో గాయపడ్డారట కదా? యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పవు. నేను గాయపడ్డ సినిమాలన్నీ సూపర్ హిట్లే. కానీ జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవడానికి ఆలోచించకూడదు. ప్రయత్న లోపం ఉండకూడదు. ► 100 కోట్లు, 200 కోట్లు.. ఇలా సినిమాల క్లబ్‌ల గురించి మాట్లాడుతుంటారు? ఇవి మీకు ఎలా అనిపిస్తుంటాయి? కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూస్తుంటాను. ఈ సినిమా వందకోట్లు చేస్తుంది. 200 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అని రిలీజ్‌కు ముందే చెబుతుంటారు. బాధగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమాకు గౌరవం ఇవ్వాలి. నంబర్‌కి కాదు. తక్కువ నంబర్లు ఉంటేనే ఎక్కువ నేర్చుకోగలం. నా చిన్నప్పుడు 20 రూపాయలే నాకు పెద్ద అమౌంట్. 20 ఏళ్ల క్రితం నా దగ్గర ఏమీ లేనప్పుడు కోటి రూపాయలు ఉంటే కోటీశ్వరుడిని అవుతాను కదా అని అనుకునేవాడిని. దర్శకుడు మహేశ్ భట్ నీకు గొప్ప భవిష్యత్ ఉంది అని ప్రోత్సహించేవారు. 500 మిలియన్స్ బిల్‌గేట్స్‌కు తక్కువ అమౌంట్ కావొచ్చు. కానీ నేను బిల్ గేట్స్‌ని కాదు. కష్టపడి పెరిగాను. డబ్బు విలువ తెలుసు. ► అభిమానులు మిమ్మల్ని కింగ్ ఖాన్ అని పిలుస్తుంటే ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది? కొందరు అభిమానులు నన్ను కింగ్‌ఖాన్ అని పిలుస్తుంటారని విన్నాను. ఆ పిలుపుని నేను పెద్ద సీరియస్‌గా తీసుకోను. షూటింగ్స్‌కి వెళతాను. కుటుంబంతో సమయం గడుపుతాను. నిజానికి రజనీసార్ ఈజ్ తలైవా. అమితాబ్‌బచ్చన్ ఈజ్ షెహన్షా (రాజులకే రాజు). మనం కింగ్స్ కాదు (నవ్వుతూ).. – గౌతమ్ మల్లాది ప్రాంతీయ సినిమాల గురించి .... ప్రాంతీయ సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇండియా మొత్తం రిలీజ్ చేయాలనుకోరు కాబట్టి క్రియేటివ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ల సక్సెస్‌కు అదొక కారణం అయ్యుండొచ్చు. కమర్షియల్ సినిమా ప్యారామీటర్ కూడా మారుతోంది. ఇండస్ట్రీ అభివృద్ధిని కాంక్షించే ఏ మార్పు అయినా మంచిదే కదా. హైదరాబాద్‌తో మీ అనుబంధం... అవును. మా అమ్మగారు హైదరాబాదీ. టోలీచౌకిలో ఉండేవాళ్లం. మా నాన్నగారు నార్త్. సౌత్ అండ్ నార్త్ గుడ్ కాంబినేషన్ (నవ్వుతూ). మా అమ్మ తరఫు బంధువులు ఉన్నారు. షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని కలవాలనుకుంటాను. కానీ టైమ్ కుదరదు. లైఫ్‌లో అన్నీ మారుపోతుంటాయని కాలం అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటుంది. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ ‘జీరో’ సెట్లో షారుక్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ షారుక్ ఖాన్, అనుష్కా శర్మ -
అనుష్క శర్మ కొత్త కారు: ధర వింటే
సాక్షి, ముంబై: వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కొత్త లగ్జరీకారును సొంతం చేసుకున్నారట. అతి విలాసవంతమైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (లాంగ్‌వీల్ బేస్) కారును ఖరీదు చేసినట్టు తెలుస్తోంది. ఈ అల్టిమేట్ లగ్జరీ ఎస్యూవీ ధర సుమారు. 4కోట్ల రూపాయలు. సూయి ధాగా, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లోని నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు అనుష్క. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్‌తో జతగా నటిస్తున్న ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. అనుష్క ఈ మూవీలో సైంటిస్టుగా ఒక చాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నారు. కాగా ఇటీవల సింగపూర్‌లో మేడం టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను అనుష్క ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
వివాదంలో షారూఖ్ ‘జీరో’
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జీరో. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న షారూఖ్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. బాద్షా మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ కారణంగానే ఇప్పుడు ఈ సినిమా కష్టాల్లో పడింది. ట్రైలర్లో చూపించిన ఓ సీన్లో షారూఖ్ బనియన్, షార్ట్ ధరించి సిక్కులు పవిత్రంగా భావించే కిర్పన్‌ను పట్టుకోవటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ అనే న్యాయవాధి ఆ సీన్‌ను తొలగించాలంటూ షారూఖ్‌తో పాటు చిత్రయూనిట్‌పై ముంబై హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. అంతేకాదు జీరో సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపాలని, ఒక వేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పిటీషన్‌ను విచారణకు సీక్వరించిన కోర్టు నవంబర్ 30న విచారించనున్నట్టు వెల్లడించారు. -
‘తమ్ముడు నువ్వు ఎంతో ఎదిగిపోయావ్’
బడా హీరోల సినిమాలు.. చిన్న హీరోల సినిమాలు ఒకేసారి రావు. ఒకవేళ అలాంటి పరిస్థితే ఎదురయితే చిన్న హీరోలు రేస్ నుంచి తప్పుకుంటారు. ఎప్పుడో.. ఎక్కడో కథ మీద బాగా నమ్మకం ఉంటే తప్ప చిన్న హీరోలు, బడా హీరోలతో పోటికి దిగరు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘జీరో’.. రితేష్ దేశ్ముఖ హీరోగా వస్తోన్న మరాఠీ చిత్రం మౌలీ చిత్రం రెండు ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగునున్నాయి. ఈ క్రమంలో షారుక్ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు రితేష్ దేశ్‌ముఖ్. ఎందుకంటే షారుక్ ఖాన్ ‘జీరో’ చిత్రం ఇండియావైడ్‌గా విడుదలవుతోంది. ఈ క్రమంలో అదే రోజు ‘మౌలీ’ సినిమా కూడా వస్తే మరాఠీ ప్రజలు వారి మాతృభాష చిత్రానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. దాంతో ఆ ప్రభావం షారుక్ ‘జీరో’ చిత్రం మీద పడుతోంది. ఇవన్ని ఆలోచించిన రితేష్, షారుక్ కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన షారుక్, రితేష్ మంచి మనసుకు మురిపిపోయి ట్విట్టర్ వేదికగా తన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నా చిన్న తమ్ముడు చాలా పెద్దవాడు అయ్యాడు. నీ విశాల హృదయానికి.. ప్రేమకు, గౌరవానికి నా ధన్యవాదాలు. నీ అవసరం కన్నా నా ఆత్మాభిమానానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చావ్. ఈ విషయం నిజంగా నా హృదయాన్ని కదిలించింది. చాలా సంతోషంగా ఉంది’ అంటూ షారుక్ ట్వీట్ చేశారు. @Riteishd jab chota bhai bahut bada ho jaata hai. Thank you baby for the love respect and largesse of heart you showed me today. Grateful. Touched. I am so happy to have ‘asked’ something of a friend who kept my self respect higher than his own need. — Shah Rukh Khan (@iamsrk) November 5, 2018 ‘మౌలీ’ రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తోన్న రెండో మరాఠీ చిత్రం. రితేష్ ‘లయి భారి’ అనే మరాఠి చిత్రంతో 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రితేష్ హిందీలో ‘హౌస్‌ఫుల్ 4’లో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి, బాబి డియోల్‌తో కలిసి నటిస్తున్నాడు. -
వివాదంలో షారుఖ్ ‘జీరో’
ముంబై : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ‘జీరో’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. తమ మనోభావాలు కించపరిచే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ పోలీస్ స్టేషన్లో షారుఖ్‌తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ ట్రైలర్లో షారుక్ ఖాన్.. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ ధరించాడని, అది సిక్కుల మనోభావాలు కించపరిచడమేన్నారు. ‘జీరో మూవీ ట్రైలర్లో సిక్కుల మనోభావాలు కించపరిచే సన్నివేశాలున్నాయని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ను షారుక్ ధరించినట్లు మూవీ టీజర్లో కనిపించింది. సిక్కుల సంప్రదాయం ప్రకారం అమ్రిత్ధరి సిక్కులు మాత్రమే అది ధరిస్తారు. కానీ ఈ మూవీలో ధరించి మా సెంటిమెంట్స్‌ను కించపరిచారు. వెంటనే ఈ సన్నివేశాలను తొలగించి, చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలి’ అని మజిందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్తుండగా, కుర్చీకే పరిమితమైన దివ్యాంగురాలిగా అనుష్క శర్మ.. అతిధి పాత్రలో కత్రినా నటిస్తుండటంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
జీరో.. మేడ్ ఇన్ ఇండియా
‘‘ఎటువంటి పరిస్థితుల్లో అయినా పాజిటివిటీ వెతుక్కొని ముందుకు వెళ్లాలి అని చెప్పే కథ ‘జీరో’. మనలోని బలహీనతలను కూడా అంగీకరించగలిగి జీవితాన్ని పూర్తిగా జీవించాలని చెప్పే ప్రయత్నం ‘జీరో’’ అని షారుక్ అన్నారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జీరో’. గౌరీ ఖాన్ నిర్మించారు. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను షారుక్ బర్త్‌డే సందర్భంగా ఈనెల 2న ముంబైలో రిలీజ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లో జరిగింది. అందుకే ఈ వేడుక మీరట్‌ను తలపించేలా సెట్ రూపొందించారు. ఈ ఫంక్షన్లో షారుక్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘మరుగుజ్జు పాత్ర అనగానే కమల్ హాసన్ నటించిన ‘అప్పూ రాజా’తో పోల్చారు. కానీ అలాంటి కథాంశం కాదు ఈ చిత్రం. అనుష్క, కత్రినాతో ‘జబ్ తక్ హై జాన్’ తర్వాత మళ్లీ కలసి నటిస్తున్నాను. ఈ ప్రయాణంలో అనుష్క దగ్గర ‘నిజాయతీగా’ ఉండగలగడం, కత్రినా కైఫ్ దగ్గర నుంచి అనుకున్నదాని కోసం కష్టపడటం’ నేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ల కంటే నేనే బెటర్ పర్సన్ అయ్యాననుకుంటా(నవ్వుతూ). ‘జీరో’కి సాధారణంగా మనం విలువ ఇవ్వం. కానీ, అది ఏ అంకెకి తోడైనా దాని విలువ పెరుగుతుంది. అసలు దాన్ని లెక్కలోకి తీసుకోం. కానీ లెక్కలన్నీ దాని చుట్టూనే తిరుగుతుంటాయి. మన ఆర్యభట్టగారు ప్రపంచానికి అందించిన బహుమానం ‘జీరో’. మేడ్ ఇన్ ఇండియా చిత్రమిది. నాతో నటించిన దీపికా, అనుష్కా అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. సౌత్ ఇండియా సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నాను ’’ అన్నారు షారుక్ ఖాన్. ‘‘షారుక్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేస్తున్నట్టు షూటింగ్లో ఒక్కసారి కూడా అనిపించలేదు. ఆయనలోని సూపర్‌స్టార్‌ని నేనింకా కలవలేదు’’ అన్నారు దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. ‘‘మా పాత్రలను ఇంత కొత్తగా తీర్చిదిద్ది, సరికొత్తగా ఆవిష్కరించినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. నమ్మకమే ఈ సినిమాను నడిపింది’’ అని అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ అన్నారు. -
షారుఖ్ బర్త్‌డే పార్టీలో పోలీసులు
సాక్షి, ముంబై : బాలీవుడ్ బాద్ షా 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు (నవంబర్ 2) సందర్భంగా ఆయన నటించిన ‘జీరో’ ట్రైలర్ కూడా అదే రోజు విడుదల కావడంతో ఆయన బిజీబిజీగా గడిపారు. అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలకు, ఫ్రెండ్స్‌కు బాంద్రాలోని ‘అర్ధ్’ నైట్ క్లబ్లో పార్టీ ఇచ్చారు. అయితే ఈ ప్రైవేటు కార్యక్రమానికి పోలీసులూ హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. చెవులు చిల్లులు పడేల హోరెత్తుతున్న మ్యూజిక్‌ను ఆపేశారు. (బాల్కనీలో నుంచుని చేతులు జోడించిన షారుఖ్) సాదారణంగా రాత్రి ఒంటిగంట వరకే నైట్క్లబ్బులకు పర్మిషన్ ఉంటుంది. అప్పటికే రాత్రి 3 గంటలయినా షారుఖ్ అతని మిత్రులు పాల్గొన్న ‘అర్ధ్’క్లబ్ తెరిచే ఉందని పోలీసులు తెలిపారు. బాద్షా పార్టీ కోసం అక్కడున్న వారందరినీ అప్పటికే పంపేశారని అన్నారు. రాత్రి 3 దాటినా ‘అర్థ్’ ఇంకా తెరచే ఉందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నామని పోలీసులు వెల్లడించారు. దీంతో షారుఖ్ అతని ఫ్రెండ్స్ త్వత్వరగా పార్టీ ముగించుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఇదిలాఉండగా.. పోలీసుల రాకను ముందే పసిగట్టిన మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా అప్పటికే క్లబ్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. (చదవండి : అనుష్క, షారుఖ్, కత్రిన అదరగొట్టారు!) -
అనుష్క, షారుఖ్, కత్రిన అదరగొట్టారు!
కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు అనుష్క శర్మ. ఇప్పటికే సుల్తాన్, సూయీ ధాగా చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనుష్క శర్మ. అయితే ప్రస్తుతం షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో ‘జీరో’ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. మరగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్తుండగా, కుర్చీకే పరిమితమైన దివ్యాంగురాలిగా అనుష్క శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి వీరిద్దరి నటనే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో సెలబ్రెటీ పాత్రలో నటిస్తున్న కత్రినా కైఫ్ తన గ్లామర్‌తో అదరగొట్టేశారు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో మిళితమైన ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్పై రాబోతున్న ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు.