షారూఖ్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ | Shah Rukh Khan Says He Was Not Signed Any Film As Yet | Sakshi
Sakshi News home page

అందుకే ఇప్పుడు సినిమాలు చేయడం లేదు : షారూఖ్‌

Published Sat, Jun 22 2019 11:58 AM | Last Updated on Sat, Jun 22 2019 11:58 AM

Shah Rukh Khan Says He Was Not Signed Any Film As Yet - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కొద్ది రోజులుగా కాలం కలిసి రావటం లేదు. ఆయన ఖాతాలో ఇటివల ఒక్క సూపర్‌ హిట్‌ కూడా లేదు. ఎన్నో ఆశలతో స్వయంగా నటించి నిర్మించిన ‘ జీరో’  కూడా బోల్తా పడింది. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. ఆ తర్వాత షారూఖ్‌ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. రాకేష్‌ శర్మ బయోపిక్‌ ‘సారే జహాసే అచ్చా’లో నటిస్తాడని అనుకున్నా.. అది కూడా పక్కన పెట్టేశాడు. ఈ సారి తమ హీరో డాన్‌3 తో వస్తాడని ఫ్యాన్స్‌ ఆశించగా.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు బాద్‌షా.  తాను ఇప్పటి వరకూ ఒక్క సినిమాకు సైన్‌ చేయలేదని, కొద్దిరోజుల వరకూ సినిమాలు చేయడని చెప్పేశాడు.

‘ నేను ప్రస్తుతానికి ఒక్క సినిమాకు కూడా సైన్‌ చేయలేదు. కొద్ది రోజుల వరకూ సినిమాలు చేయను. తరచూ సినిమాలు చేయడం, విడుదకాగానే మరో సినిమాకు రెడీ అవడం.. ఇదే నా జీవితంలో ఇంత కాలం జరిగింది. కుటుంబంతో గడిపే టైమే దొరకలేదు. నా పిల్లలు ఇప్పడు కాలేజీ స్టేజ్‌కి వచ్చారు. నా కూతురు కాలేజీకి వెళ్తోంది. నా కొడుకు చదవు పూర్తి కావోస్తోంది. ఇప్పడు కూడా వారితో టైం స్పెండ్‌ చేయకపోతే ఎలా? నేను ఇంకా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటా. ప్రస్తుతం స్టోరీలు వింటున్నా. ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతున్నాను. కొద్ది తర్వాతే సినిమాలు చేస్తా’  అని ఓ జాతీయ మీడియాతో షారూఖ్‌ తెలిపారు. ఏదేమైనా బిగ్‌ స్ర్కీన్‌పై బాద్‌షా త్వరగా కనిపించి కోట్లాది అభిమానులను అలరించాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement