
‘అనుష్కా శర్మ చేతిలో పనేం లేదు. ఖాళీగా ఉంది’ అంటూ బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. గతేడాది చేసిన ‘జీరో’ తర్వాత ఈ బ్యూటీ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. దాంతో పెళ్లయ్యాక అనుష్కా శర్మకు అవకాశాలు తగ్గాయని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. అసలు ‘జీరో’ తర్వాత మీరు నెక్ట్స్ సినిమాకి ఎందుకు సైన్ చేయలేదు? అనే ప్రశ్న అనుష్కా శర్మ ముందు ఉంచితే... ‘‘గత ఏడాది మూడు (పరి, సూయిధాగా, జీరో) సినిమాలు చేశాను. ఈ సినిమాల్లోని పాత్రలు వేటికవే విభిన్నమైనవి. ఈ పాత్రల రిహార్సల్స్ కోసం చాలా కష్టపడ్డాను. అలాగే ఫ్యాషన్ రంగంలో కాస్త బిజీగా గడిపాను. అందుకే రిలాక్స్ అవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నేను ఖాళీగా ఏం లేను.
ప్రొడ్యూసర్‌గా ఓ ప్రాజెక్ట్ గురించి కష్టపడుతున్నాను. అయినా ఇప్పుడు ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేసే పరిస్థితుల్లో లేను నేను. ఇండస్ట్రీలో యాక్టర్‌గా నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాను. ఒక్కసారి నా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన సినిమాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. ఇకముందు కూడా అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నారు. అందుకే మనసుకి నచ్చిన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటాను. లేకపోతే నిర్మాతగా బిజీగా ఉంటాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment