
టైం ఉంది కదా అని సినిమాలు చేయాల్సిన అవసరం లేదిప్పుడు నాకు అంటున్నారు బాలీవుడ్ నటి అనుశ్క శర్మ. జీరో తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు అనుశ్క శర్మ. ఈ విషయం గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకున్నాను. ఖాళీగా ఉన్నాను కదా అని సినిమాలు చేయాల్సిన అవసరం లేదిప్పుడు నాకు. అంతేకాక గత మూడేళ్ల నుంచి విరామం లేకుండా పని చేస్తున్నాను. ఈ మూడేళ్లు నా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపాను’ అని తెలిపారు.
అంతేకాక ‘ఒక్క ఏడాదిలోనే పరి, సూయి ధాగా, జీరో సినిమాల్లో వేర్వేరు రకాల పాత్రలు పొషించాను. అయితే వీటి కోసం ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. ఈ పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవడం అంత తేలీకైన పనేం కాదు. అందుకే ప్రస్తుతం సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు కూడా నేనేం ఖాళీగా లేను. ఓ ఆసక్తికరమైన చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. దాని కోసం కూడా టైం కేటాయించాలి కదా. నేను తెరమీద కనిపించడం లేదంటే ఖాళీగా ఉన్నట్లు కాదు. వేరే చాలా పనులతో బిజీగా ఉన్నాను అని అర్థం’ అంటూ చెప్పుకొచ్చారు అనుష్క.
Comments
Please login to add a commentAdd a comment