Anushka Sharm
-
Virushka: వామికా విషయంలో ఓవరాక్షన్!
ఢిల్లీ: సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారంపై మీడియా చొరవతో జనాలకు ఆసక్తి పెరగడం.. అదే టైంలో తమ ప్రైవసీని గౌరవించండంటూ సెలబ్రిటీలు రిక్వెస్టులు చేస్తుండడం తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కోహ్లీ-అనుష్క విషయంలో ఇలాంటి వివాదమే ఒకటి చెలరేగింది. కూతురి ముఖం మీడియా కంటపడకుండా అనుష్క జాగ్రత్త పడగా.. కొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు ఫొటోజర్నలిస్టుల తీరుపైనా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ టూర్ కోసం ముంబైలో 14 రోజుల క్వారంటైన్లో ఉన్న టీమిండియా ప్లేయర్, స్టాఫ్, క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం రాత్రి ఇంగ్లండ్ బయలుదేరారు. ఈమేరకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఫొటో జర్నలిస్టుల కంట తన బిడ్డ ముఖం పడకుండా వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది అనుష్క. దీంతో.. విరుష్క జోడీపై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం బిడ్డకు ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛనైనా ఇవ్వూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. #TeamIndia pic.twitter.com/mhmyJFc0H8 — BCCI (@BCCI) June 2, 2021 ముందే చెప్పినా కూడా.. అయితే తమ కూతురి విషయంలో విరుష్కలు ముందే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ’ సెషన్లో విరాట్.. సోషల్ మీడియా అంటే ఏమిటో అర్థం చేసుకునే వరకు, ఆమె సొంతంగా ఆలోచించే వరకు మా బిడ్డను సోషల్ మీడియాకు బహిర్గతం చేయకూడదని, దూరంగా ఉంచాలను మేము నిర్ణయించుకున్నాం”అని తేల్చి చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ప్రముఖంగా అన్ని మీడియా హౌజ్‌లకు చేరింది. అయినా కూడా ఫొటో జర్నలిస్టులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించారనే విమర్శ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చదవండి: మాట తప్పిన కోహ్లీ! ఏం చేశాడంటే.. -
తల్లిదండ్రులుగా విరుష్కలు.. ఫొటో వైరల్!
న్యూఢిల్లీ: కొత్తగా తల్లిదండ్రులైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అనుష్క పడ్డంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వారి కూతురి ఫొటోను చూపించకుండా ఈ సెలబ్రిటీ కపుల్ గొప్యత పాటిస్తున్నారు. అంతేగాక వారి ప్రైవసీని డిస్టర్బ్ చేయోద్దంటూ వారు మీడియాను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి కూతురిని ఎప్పుడేప్పుడు క్లిక్ మనిపిద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీడియాకు విరుష్కలు ఎదురుపడ్డారు. (చదవండి: సంతోష సమయం.. చిన్న విన్నపం: విరుష్క) ఇక కూతురు పుట్టాక మొదటిసారిగా ఈ జంట బయట కాలు పెట్టడంతో మీడియా తమ కెమారాలకు పని చెప్పింది. అయితే వీరితో వారి కూతురు లేకపోవడం కాస్తా నిరూత్సాహ పరిచినప్పటికి కొత్తగా తల్లిదండ్రులైన తర్వాత తొలిసారిగా విరాట్, అనుష్కలను చూసి వారి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక త్వరగా మీ కూతురిని చూపించమంటూ విరుష్కల అభిమానులు సోషల్ మీడియా వేదిక విజ్ఞప్తి చేస్తున్నారు. (చదవండి: ధోని నుంచి కోహ్లి వరకు.. సేమ్ టు సేమ్) -
‘క్లాస్‌లో డౌట్స్ అడగాలన్నా భయమే’
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుల్బుల్’. ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో దీనిలో హీరోయిన్గా నటించిన త్రిప్తి దిమ్రి తెర మీద తన పాత్రకు, నిజ జీవితంలో తనకు చాలా తేడా ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా తన గురించి చెప్పుకొచ్చారు త్రిప్తి. ‘‘బుల్బుల్’ చిత్రంలో నేను పోషించిన పాత్రకు.. నిజ జీవితంలో నా ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నేను ఇంట్రావర్ట్‌ని. నా భావాలు నాలోనే దాచుకునేదాన్ని. కానీ ఈ చిత్రంలో నా పాత్ర ప్రతి దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తుంది. నిజ జీవితంలో నేను చాలా సిగ్గరిని. స్కూల్ ఫంక్షన్స్‌లో పాల్గొనేదాన్ని కాదు. కనీసం క్లాస్ రూంలో డౌట్లు కూడా అడిగేదాన్ని కాదు. లేచి నిలబడి డౌట్ అడుగుతుంటే.. మిగతా అందరూ నా వైపే చూడటం నాకు ఇష్టం ఉండదు. అయితే కాలేజీకి వచ్చేసరికి నా ఆలోచనల్లో మార్పు వచ్చింది’ అన్నారు. (ఆ దెయ్యం రక్తం తాగుతుంది తెలుసా!) త్రిప్తి మాట్లాడుతూ.. ‘స్టేజీ మీదకు ఎక్కి ప్రపంచాన్ని ఎదుర్కొవాలని భావించాను. దాంతో కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్లో పాల్గొనేదాన్ని. మోడలింగ్ ఏజెన్సీలో కూడా చేరాను. అలా నాకు అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది. అయితే మొదటి సారి నేను ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను. కెమరా ముందు నిల్చొవడం అదే మొదటి సారి. దాంతో చాలా భయపడ్డాను. అయితే ఆశ్చర్యం ఏంటంటే నేను చాలా బాగా చేశాను.. సెలక్ట్ అయ్యాను. అలా నా మొదటి సినిమా ‘పోస్టర్ బాయ్స్’ అవకాశం లభించింది’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘చాలా మంది నన్ను చూస్తే ఇబ్బంది పడే నేను ఇప్పుడు సెట్‌నే ఇంటిగా భావించే విధంగా మారాను. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. నా భయాలతో పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రోజు ఇలా ఉన్నాను’ అన్నారు త్రిప్తి. (కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు) అంతేకాక ‘నన్ను నేను నమ్మడం ప్రారంభించాను. నా లోని అభద్రతాభావాలను పట్టించుకోవడం మానేశాను. అయితే ఇప్పటికి కొత్త పరిస్థితుల్లో.. భయపడుతూనే ఉంటాను. కానీ ఆ భయాలన్నింటిని నేను జయించగలనని నాకు తెలుసు. ఒక్కటి గుర్తు పెట్టుకొండి. భయం అనేది ఓ ఫీలింగ్ మాత్రమే. ఏ భావన కూడా శాశ్వతం కాదు. దానితో పోరాడండి.. ఓడిపోయినా పర్వాలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. పోరాడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు త్రిప్తి. View this post on Instagram 🌸Growing up, I was extremely different from the character I play in Bulbbul. I was not an extrovert at all! She’s curious and excitable and I was the opposite of it. I was very shy and I never felt comfortable participating in school functions and activities. I even hated getting doubts cleared in class because I didn’t like having all those eyes on me. Something changed when I got to college. I realised it’s time I take to the stage and face the world. I became more involved in college activities and even joined a modelling agency, which turned out to be the door that opened these opportunities for me. I remember putting off giving my first audition because the thought of facing the camera terrified me. Surprisingly, I did well and I got selected, which led to my debut movie 'Poster Boys'. From being uncomfortable with so many eyes on me to now feeling at home on a set, I’ve come a long way. I am here because I chose to fight my fear and get out of my comfort zone. I chose to trust myself and stopped listening to my insecurities. I’m still nervous in new situations, I still fumble but I now know you can always overcome those fears and give it your all. Remember, fear is just a feeling and no feeling is permanent. Fight it even if you fail. You can always get back up and try again. I’m glad I chose to fight. #Bulbbul @netflix_in @officialcsfilms @anushkasharma @kans26 @anvita_dee @avinashtiwary15 @rahulbose7 @paoli_dam @parambratachattopadhyay @manojmittra @saurabhma @an5hai @siddharthdiwan @itsamittrivedi @rameshwar_s_bhagat @lifaafa_ @veerakapuree @anishjohn83 @rod__sunil @hingoraniharry @keitanyadav @redchillies.vfx @redchillies.color @kyana.emmot @castingbay @ruchi.mahajan1 @buddhadevvarun A post shared by Tripti Dimri (@tripti_dimri) on Jun 29, 2020 at 3:20am PDT -
‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’
లక్నో: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, తన భార్య అనుష్క శర్మకు విడాకులు ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ డిమాండ్ చేశారు. అంతేకాక ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకు విషయం ఏంటంటే.. అనుష్క నిర్మాతగా ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఓ సన్నివేశంలో ఎమ్మెల్యే నందకిశోర్ ఫొటోను ఉపయోగించారు. ఈ సిరీస్‌లో విలన్ పాత్ర పోషించిన బాలకృష్ణ బాజ్‌పేయి నటించిన ఓ సన్నివేశంలో మార్ఫడ్ ఫొటోని వాడినా నందకిశోర్ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో తన అనుమతి లేకుండా ఫొటో వాడటమే కాక.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా తనను చూపించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. (కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు) వెంటనే ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలని నందకిశోర్.. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. అనుష్క మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని.. జాతీయ భద్రతా చట్టం కింద ఆమె మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీకి దేశభక్తి ఉంది. ఆయన భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్నారు. కోహ్లీ అనుష్కకు విడాకులు ఇవ్వాలి’ అన్నారు నందకిశోర్.('ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా') #Ghaziabad: BJP leader Nandkishor Gurjar (@nkgurjar4bjp) has filed a case against actor turned producer @AnushkaSharma. FIR is regarding Web Series #PataalLok. He accused actress of sedition and advised @imVkohli to divorce her. (Story in Development) pic.twitter.com/NNEXAFclfX — Newsroom Post (@NewsroomPostCom) May 23, 2020 ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో గూర్ఖా వాళ్లను అవమానించారంటూ ‘ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్’ సభ్యులు కేంద్రానికి సంబంధించిన హెచార్సీలో ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. రెండో ఎపిసోడ్లో ఓ సీన్ గూర్ఖా సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నట్టు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక ఈ సీన్లో వచ్చే మాటలను వినబడకుండా మ్యూట్ చేయాలంటూ గూర్ఖా సమాజాపు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
వైరల్ వీడియో : ఇదీ జీవితమంటే
ప్రాణాంతక కరోనా వైరస్ నియంత్రణకు ప్రపంచ దేశాలు లాక్డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. దీంతో చాలామంది వేరువేర్వు ప్రాంతాల్లో, దేశాల్లో చిక్కుకుపోయారు. నెలల తరబడి కుటుంబ సభ్యులను దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు సుమారు రెండు నెలల తరువాత ఒకరినొకరు కలుసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా అనుకోకుండా ఎడబాటుకు దూరమైన ఈ దంపతులు ఆదివారం సొంత గూటికి చేరుకున్నారు. దీంతో ఆ వృద్ధ జంట ఆనందానికి అంతేలేకుండా పోయింది. రెండు నెలల తరువాత కలుసుకోవడంలో ముద్దుపెట్టుకుని ఒకరినొకరు తనవితీరా హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇదీ జీవితమంటే అంటూ ఆ జంటపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం ఆ జంట ప్రేమకు ఫిదా అయ్యారు. ఇంటర్నెట్లో నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇదే అంటూ కామెంట్ చేశారు. -
‘ఇప్పుడు ఆ అవసరం లేదు’
టైం ఉంది కదా అని సినిమాలు చేయాల్సిన అవసరం లేదిప్పుడు నాకు అంటున్నారు బాలీవుడ్ నటి అనుశ్క శర్మ. జీరో తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు అనుశ్క శర్మ. ఈ విషయం గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకున్నాను. ఖాళీగా ఉన్నాను కదా అని సినిమాలు చేయాల్సిన అవసరం లేదిప్పుడు నాకు. అంతేకాక గత మూడేళ్ల నుంచి విరామం లేకుండా పని చేస్తున్నాను. ఈ మూడేళ్లు నా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపాను’ అని తెలిపారు. అంతేకాక ‘ఒక్క ఏడాదిలోనే పరి, సూయి ధాగా, జీరో సినిమాల్లో వేర్వేరు రకాల పాత్రలు పొషించాను. అయితే వీటి కోసం ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. ఈ పాత్రలకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవడం అంత తేలీకైన పనేం కాదు. అందుకే ప్రస్తుతం సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు కూడా నేనేం ఖాళీగా లేను. ఓ ఆసక్తికరమైన చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. దాని కోసం కూడా టైం కేటాయించాలి కదా. నేను తెరమీద కనిపించడం లేదంటే ఖాళీగా ఉన్నట్లు కాదు. వేరే చాలా పనులతో బిజీగా ఉన్నాను అని అర్థం’ అంటూ చెప్పుకొచ్చారు అనుష్క. -
ఈ సినిమా కూడా ఫెయిలయితే...
వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. ఆయన నటించిన ఫ్యాన్, రాయిస్, దిల్వాలే వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో షారుక్ హీరోగా వచ్చిన ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ చిత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 64. 33 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వరుస పరాజయాలు పలకరిస్తున్నప్పటికీ షారుక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం జీరో. , అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడిన షారుక్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘భారీ హిట్ కొట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. మళ్లీ అలాంటి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాను కానీ కుదరడం లేద’ని అన్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న జీరో చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఫలితం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. దాన్ని నేను మార్చలేను కూడా. మరి మార్చడానికి కుదరని అంశాల గురించి నేను ఎందుకు ఆలోచించాలి’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ‘జీరో చిత్రం షారుక్ కెరీర్‌కి చాలా ముఖ్యమైంది.. కచ్చితంగా విజయం సాధించాలని జనాలు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫెయిల్ అయ్యిందనుకొండీ.. అప్పుడు మహా అయితే ఓ 6 - 10 నెలల పాటు నేను సినిమాలు చేయను. కానీ నా నైపుణ్యం, కళ మంచివని నమ్మినన్ని రోజులు మరిన్ని సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని షారుక్ బదులిచ్చారు. -
అనుష్కను చాలా మిస్ అవుతున్నా: హీరో
అవును రణ్వీర్ సింగ్ అనుష్కను చాలా మిస్ అవుతున్నారంట. అదేంటి ఈ హీరో మిస్ అవ్వాల్సింది దీపికా పదుకోన్‌ని కదా . అనుష్కను మిస్ అవ్వడం ఏంటి, అది కూడా అనుష్కకు వివాహం జరిగిన తర్వాత అని అనుకుంటున్నారా.. అయితే ఒక్క నిమిషం. ఈ హీరో అనుష్కను మిస్ అవుతున్నాను అన్నది ఇప్పుడు కాదు. ఓ ఆరేళ్ల క్రితం 2013లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్వీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అనుష్క శర్మ చాలా మంచిదంటూ తెగ పొగిడారు. అనుష్క - రణ్వీర్ తొలిసారి 2010లో వచ్చిన ‘బ్యాండ్ బాజా బరాత్’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. అందుకు కారణం ‘బ్యాండ్ బాజా బరాత్’ అనంతరం అనుష్కకు చాలా ఆఫర్స్ వచ్చాయంట, కానీ రణ్వీర్ మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారంట. ఈ ప్రొఫెషనల్ జెలసి వల్ల వీరు ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే కొందరు మాత్రం వీటిని ఖండించడమే కాక దీపిక పదుకోన్ వల్లే వీరిద్దరు విడిపోయారని ప్రచారం చేశారు. అందుకు కారణం ఉంది. ‘బ్యాండ్ బాజా బరాత్’ తర్వాత రణ్వీర్ దర్శకుడు సంజయ్ బన్సాలీ చిత్రం ‘గోలియోంకి రాస్లీల : రామ్ లీల’ చిత్రంలో దీపికాతో కలిసి నటించారు. ఆ సమయంలో రణ్వీర్ దీపికతో సన్నిహితంగా మెలిగాడని.. ఈ విషయం అనుష్కకు నచ్చలేదని అందుకే విడిపోయారనే వార్తలు కూడా షికారు చేశాయి. ఏది ఏమైనా నాటి నుంచి రణ్వీర్ - అనుష్కల మధ్య మాటలు బంద్ అయ్యాయి. ఈ విషయం గురించి రణ్‌వీరే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే అని, తాము మాట్లాడుకోవడం లేదని తెలిపారు. ఆ సమయంలోనే తాను అనుష్కని చాలా మిస్ అవుతున్నట్లు కూడా చెప్పారు. ఈ విషయం గురించి రణ్వీర్ ‘నేను అనుష్కను చాలా మిస్ అవుతున్నాను. చాలా మంది ఆమెను తప్పుగా అర్ధం చేసుకున్నారు. అసలు ఆమె గురించి వారికి ఏమి తెలియదు. తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి మనిషి అనే విషాయాలు తెలుసుకోకుండానే ఆమె గురించి తప్పుగా మాట్లాడతున్నారు. నేను ఇప్పుడు తన గురించి చెప్పే మాటలు మీరు నమ్మకపోవచ్చు. కానీ నా జీవితంలో నేను కలిసిన అతికొద్ది మంది మంచి వారిలో అనుష్క ఒకరు. ఆమె చాలా నిజాయితీగా, స్వచ్ఛంగా ఉంటారు. నేను చెప్పేది వాస్తవం.. ఆమె మనసు చాలా మంచిది. నా గురించి తప్పుడు వార్తలు వచ్చినా బాధపడను కానీ ఆమె గురించి చెడు ప్రచారం జరిగితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అని తెలిపారు. అయితే ఇవన్ని 2013 నాటి మాటలు. ఆ తర్వాత కూడా వీరిద్దరు 2015లో జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ ధడక్నే దో’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే వీరిద్దరి వారి వారి జీవితాల్లో బిజీగా ఉన్నారు. గతేడాది డిసెంబర్ 11న అనుష్క టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని వివాహం చేసుకుని, సంతోషంగా ఉన్నారు. మరో పక్క రణ్వీర్ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం రణ్వీర్ దీపికా పదుకోన్‌తో ప్రేమలో ఉన్నారు, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసింది. -
ఒక్కసారి ఆలోచించండి
‘‘మనం మనుషులుగా పుట్టాం కాబట్టి చాలా అదృష్టవంతులం. ఏదైనా అనిపిస్తే అది చెప్పగలం. ఏదైనా అనుకుంటే అది చేసేయగలం. మనకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి. మనల్ని ప్రేమించేవాళ్లు ఉన్నారు. కేరింగ్‌గా చూసేవాళ్లున్నారు. కానీ ఒక్కసారి జంతువుల గురించి ఆలోచించండి’’ అంటున్నారు అనుష్కా శర్మ. తన బర్త్‌డే (మే 1) సందర్భంగా ముంబైలో జంతువుల కోసం ఓ షెల్టర్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు అనుష్క. ఈ ‘యానిమల్ షెల్టర్’ (జంతు సంరక్షణ శాల) గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఒక్కసారి జంతువుల గురించి ఆలోచించండి. వాటిని మనందరం ఎలా ట్రీట్ చేస్తున్నామో. వాటి రైట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ వాటిని మనం (మనుషులు) సరిగ్గా చూసుకోవడం లేదని వాటికి అనిపించినా.. బయటకు చెప్పుకోలేని మూగజీవులు. వాటికోసం మనం నిలబడాలి. అది మన బాధ్యత. తెలివైన మనుషులుగా మనం చేయాల్సిన పని ఏదైనా ఉందంటే సాటి జీవరాశుల కోసం నిలబడగలగటమే. మన మదర్ ఎర్త్‌కి అదే మనం తిరిగివ్వగలిగేది. దలై లామా చెప్పిన ఓ మాట నాతోనే ఉండిపోయింది. ‘లైఫ్ అందరికీ ఒక్కటే. మాట రాని మూగజీవికైనా, మనకైనా. బాధకు భయపడతాం. ఆనందాన్ని కోరుకుంటాం. చావుకు భయపడతాం. ఎక్కువ కాలం జీవించాలనుకుంటాం. మనకు మాత్రమే కాదు మిగతా జీవరాశులకు కూడా ఇలాగే అనిపిస్తుంది’. నా బర్త్‌డే రోజు మన తోటి జీవులకు మనందరితో పాటే సమానమైన ప్రేమను, ఆప్యాయతను, రైట్స్‌ను నా వంతుగా ఇవ్వాలి అనుకుంటున్నాను. ముంబై సిటీ చివర్లో జంతువులకు ఓ షెల్టర్ నిర్మించదలిచాను. జంతువులకు ప్రేమను ఇవ్వగలిగే ఓ ఇల్లులాగా తయారు చేయనున్నాను. చాలా రోజులుగా చేద్దాం అనుకుంటున్న ఈ కల ఇప్పటికి కార్యరూపం దాల్చింది. మీ అందరి సపోర్ట్, అడ్వైస్తో.. మన తోటివారిని (జంతువులను) ప్రేమగా చూసుకొనే ఓ అద్భుతమైన ప్లేస్‌గా మారుస్తాను’’ అనిపేర్కొన్నారు అనుష్క. -
తమిళంలో పారీ...?
నటిగానే కాదు నిర్మాతగాను విజయవంతంగా దూసుకుపోతుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ. నిర్మాతగాను వైవిధ్యమైన కథలనే ఎన్నుకుంటుంది. ఈ బ్యూటీ నిర్మించిన మూడు చిత్రాలలో 'ఎన్‌హెచ్10' రోడ్ థ్రిల్లర్ కాగా, 'పిలౌరి' ఆత్మల నేపధ్యంలో సాగే కథాంశం. ఈ మధ్యే విడుదలయిన 'పారి' హర్రర్ చిత్రం. ఈ చిత్ర నిర్మాత, కథానాయకి కూడా అనుష్కే. దెయ్యం పట్టిన స్త్రీగా ఈ చిత్రంలో అనుష్క నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రిమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హర్రర్ కథలకు ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది. కాబట్టి సహజంగానే 'పారి' చిత్రం తమిళ నిర్మాతలను ఆకర్షిస్తోంది. 'పారి' చిత్రం హక్కుల కోసం పెద్దమొత్తంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, అన్నికుదిరి ఒప్పందం ఫైనల్ కాగానే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. -
మామగారి కానుక
అబ్బాయిల్లో అనుష్కా శర్మకు పెద్ద ఫ్యాన్ ఫాలోయిం ఉంది. వాళ్లందరిలో ఫ్యాన్ బాయ్ నెంబర్ 1 విరాట్ కోహ్లీ. అమ్మాయిల్లో విరాట్‌కు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. వాళ్లందరిలో ఫ్యాన్ గర్ల్ నెంబర్ 1 అనుష్క. విరాట్ సెంచరీ చేసిన ప్రతిసారీ ఫస్ట్ విజిల్ అనుష్కదే. అనుష్క కొత్త సినిమా వస్తున్న ప్రతిసారీ ఆ మూవీ గురించి ఎక్కువగా మాట్లాడేది కోహ్లీనే. ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇప్పుడు భారతదేశానికి యువ ఆదర్శ దంపతులు. ఈ దంపతులకు ఇప్పుడు విరాట్ అత్తమామలు (అనుష్క పేరెంట్స్) అజయ్ కుమార్ శర్మ, అషిమలు కూడా ఫ్యాన్స్ అయినట్లున్నారు. వర్ధమాన కవయిత్రి తేజస్వినీ దివ్యా నాయక్ రాసిన తొలి పుస్తకం ‘స్మోక్ అండ్ విస్కీ’ ఆవిష్కరణ సభకు భార్యతో కలిసి వెళ్లిన విరాట్ మామగారు... ఆ సభా ప్రాంగణంలోనే క్యూలో నిలబడి మరీ.. తేజస్విని సంతకం ఉన్న రెండు పుస్తకాలను కొని, వాటిని విరాట్ అనుష్కల కోసం దాచి ఉంచారు! అనుబంధాలపై రాసిన 42 కవితల సంకలనం ‘స్మోక్ అండ్ విస్కీ’. ప్రస్తుతం విరాట్ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అనుష్క.. షారుక్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘జీరో’ చిత్రం షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఈ జంటను ఒకటిగా చూడడం కోసం రెండు కుటుంబాల వాళ్లు ఎదురు చూస్తున్నట్టే.. కరణ్ జోహార్ కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ‘కాఫీ విత్ కరణ్ షో’లో వీళ్లను కలిపి చూపాలని టీవీ చానల్స్ కూడా తహతహలాడుతున్నాయి. అంతవరకు మనం విరాట్ క్రికెట్ విన్యాసాలతో, మార్చి 2న విడుదల కాబోతున్న ‘పరీ’ సినిమాతో సంతృప్తి పడవలసిందే! కవయిత్రి తేజస్వినీ దివ్య నాయక్ -
క్యాష్ చోప్రా
ప్రియాంకా చోప్రా ఈ ఏడాది సంపాదన 68 కోట్ల రూపాయలు! సిగ్గుండాలి.. ఆడపిల్ల పర్సులో ఎంతుందో తీసి చూడ్డానికి. అబ్బెబ్బే అపార్థం చేసుకున్నారు. 2017 ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క ఆడ కూతురు ప్రియాంక. ‘ఏ లెక్కన?’ అని చూస్తే, ఇదిగో ఈ లెక్కన అని చూపించింది ఫోర్బ్స్. అవార్డుల ఫంక్షన్లో ఐదు నిమిషాలు కనిపించడానికి ప్రియాంకా చోప్రా 5 కోట్లు డిమాండ్ చేసింది! మళ్లీ.. సిగ్గుండాలి. ఆడపిల్ల అంత గట్టి అమౌంట్ అడిగిందంటే.. బాయ్స్‌గా మనం ఎంత గర్వపడాలి? అది మానేసి, ‘అమ్మో! అంతా!’ అనడం ఏమిటి? విషయం ఏంటంటే.. ఫోర్బ్స్ లెక్క నిజం. ఫైవ్ మినిట్స్‌కి ఫైవ్ క్రోర్స్ అన్నది అబద్ధం. ‘ఫైవ్ కి ఫైవ్ అట కదా’ అని ముంబైలో మొన్న విరాట్, అనుష్కల రిసెప్షన్లో ఎవరో అడిగితే ప్రియాంక పెద్దగా నవ్వేసింది. ‘వినడానికి నాక్కూడా బాగుంది’ అంది. ‘అయితే నిజం కాదా.. పోనీ అంత కాకపోయినా, ఈ మధ్య మీరు మగవాళ్లకు దీటుగా çసంపాదిస్తున్నారట కదా, ఎంత వెనకేసి ఉంటారేంటి?’ అని ఇంకో క్వొశ్చన్. అందుక్కూడా నవ్వే సమాధానం. ‘సంపాదన కోసం ఎప్పుడూ నేను చూడలేదు. సంతోషాన్నే చూసుకున్నాను. నేను ఏం చేసినా అది నా సంతోషం కోసమే. సంతోషంతో పాటు డబ్బూ వస్తుంటే.. అదీ సంతోషమే కదా’.. అని çఫక్కున మళ్లీ ఒక నవ్వు. మొత్తానికి ఒక గట్టి అమ్మాయి మన మగధీర సెలబ్రిటీలకు ఇన్నాళ్లకు పోటీ ఇస్తోంది. -
తారల మధ్య ముంబైలో...
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల రెండో రిసెప్షన్ వేడుక మంగళవారం ముంబైలో అట్టహాసంగా జరిగింది. లోయర్ పారెల్‌లోని సెయింట్ రెజిస్ లగ్జరీ హోటల్లో ఘనంగా జరిగిన ఈ వివాహ విందుకు పలువురు బాలీవుడ్ తారలు, క్రికెట్ స్టార్లు హాజరయ్యారు. శ్రీలంకతో సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లంతా ఈ వేడుకకు విచ్చేశారు. సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ప్రత్యేక గౌన్‌లో తళుక్కున మెరిసింది. మాజీ కెప్టెన్ ధోని తన భార్య సాక్షి సింగ్, గారాల పట్టి జీవాతో కలిసి వేడుకలో పాల్గొన్నాడు. సహచరులు రోహిత్ శర్మ దంపతులు, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, పుజారా, ఉనాద్కట్, మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్, బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తదితరులు విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 21న ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఏర్పాటు చేసిన తొలి రిసెప్షన్‌కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నవ దంపతులు విరాట్, అనుష్కలను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. -
12న కోహ్లి, అనుష్కల పెళ్లి!
న్యూఢిల్లీ: కోహ్లి–అనుష్క... ఇటీవల సోషల్ సైట్లు చూసినా, న్యూస్ పేపర్లు తిప్పేసినా, టీవీ చానెళ్లు మార్చినా... వీరిద్దరి పెళ్లిమాటే! కానీ వీళ్లు మాత్రం... పెళ్లంటే కాదన్నారు. ఇటలీ వేదికంటే పుకార్లన్నారు. తీరా ఏర్పాట్లు పూర్తయ్యాయంటే లేదన్నారు. కానీ ఇప్పుడు పెళ్లి... ఇక పీటల మీదికి ఎక్కడమే తరువాయి. ఈ నెల 12న మంగళవారం ఇటలీలోని టస్కనీ నగరంలోని ఓ రిసార్ట్‌లో ‘విరుష్క’ల వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. అక్కడి రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు. కాగా డిసెంబర్ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథమహారథులంతా హాజరుకానునట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే క్రికెటర్లకు, బాలీవుడ్ స్టార్లకు ఆహ్వానాలు అందాయి. రిసెప్షన్ ముగిసిన మరుసటి రోజే (డిసెంబర్ 27) భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరుతుంది. -
ఇటలీకి అనుష్క!
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహానికి సంబంధించి రోజుకో వార్త వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తన తల్లిదండ్రులు, సోదరుడు కర్ణేశ్తో కలిసి అనుష్క మధ్యాహ్నం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించినట్లు తెలిసింది. అయితే వారంతా ఎక్కడికి వెళ్లారనేదాని గురించి మాత్రం సమాచారం లేదు. ఎయిర్‌పోర్ట్‌లో కొందరు విలేకరులు అనుష్క తదితరులను మాట్లాడించే ప్రయత్నం చేసినా వారు దీనిపై నోరు మెదపలేదు. ఈ నెల 12న ఇటలీలోని మిలాన్‌లో కోహ్లి, అనుష్క కొంత మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఆమె కుటుంబ సభ్యులు ఇటలీకి బయల్దేరారని కూడా కొంత మంది చెబుతున్నారు. అదే సమయంలో కొన్నాళ్ల క్రితం డెహ్రాడూన్‌లో వీళ్లిద్దరిని ఆశీర్వదించిన పురోహితుడు కూడా విమానం ఎక్కేందుకు రావడంతో పెళ్లి వార్త నిజం కావొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఎందుకంత దూకుడు?
అనుష్కా శర్మ జీవితం చాలా బాగుందనే చెప్పాలి. కథానాయికగా సక్సెస్‌లు, నిర్మాతగా ‘ఎన్‌హెచ్10’తో ఓ సక్సెస్. మొత్తానికి ఆమె కెరీర్ జోరు మీద ఉంది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... క్రికెట్ క్రీడాకారుడు విరాట్ కోహ్లీతో లవ్ జర్నీ కూడా బాగుంది. ఆల్ హ్యాపీస్ కాబట్టి, అనుష్కా శర్మ ఆనందానికి అవధులు లేవు. వృత్తిపరంగా భవిష్యత్ ప్రణాళికలు కూడా వేసేసుకున్నారు. ముచ్చటగా మూడు చిత్రాలను నిర్మించాలని ఆమె అనుకుంటున్నారు. వీటిలో రెండు చిత్రాలకు కొత్తవాళ్ళు దర్శకులు. ఒకరు అక్షత్ వర్మ. ఈయన ‘ఢిల్లీ బెల్లీ’ చిత్రానికి రచయితగా చేశారు. మరొకరు ‘హౌస్‌ఫుల్’, ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ లాంటి చిత్రాలతో దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన అన్షాయ్ లాల్. అలాగే, ‘ఎన్‌హెచ్ 10’ దర్శకుడు నవదీప్ సింగ్‌తో కూడా ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారు అనుష్కా శర్మ. ప్రస్తుతం ఈ చిత్రాలకు సంబంధించిన కథలను తన సోదరుడు కర్ణేశ్తో కలిసి వడపోసే కార్యక్రమంలో ఉన్నారు. ‘‘ఈ మూడు చిత్రాల్లో రెండు వినోద ప్రధానంగా సాగుతాయి. మరొకటేమో థ్రిల్లర్ మూవీ. స్క్రిప్ట్‌వర్క్ తుదిదశలో ఉంది. కొత్త సంవత్సరంలో చిత్రీకరణ మొదలుపెడతాం. అయితే, ఏ చిత్రం ముందు ప్రారంభిస్తామనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు’’ అని అనుష్కా శర్మ తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.