
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల రెండో రిసెప్షన్ వేడుక మంగళవారం ముంబైలో అట్టహాసంగా జరిగింది. లోయర్ పారెల్‌లోని సెయింట్ రెజిస్ లగ్జరీ హోటల్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహ విందుకు పలువురు బాలీవుడ్ తారలు, క్రికెట్ స్టార్లు హాజరయ్యారు. శ్రీలంకతో సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లంతా ఈ వేడుకకు విచ్చేశారు. సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ప్రత్యేక గౌన్‌లో తళుక్కున మెరిసింది. మాజీ కెప్టెన్ ధోని తన భార్య సాక్షి సింగ్, గారాల పట్టి జీవాతో కలిసి వేడుకలో పాల్గొన్నాడు.
సహచరులు రోహిత్ శర్మ దంపతులు, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, పుజారా, ఉనాద్కట్, మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్, బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తదితరులు విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 21న ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన తొలి రిసెప్షన్‌కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నవ దంపతులు విరాట్, అనుష్కలను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే.






Comments
Please login to add a commentAdd a comment