marriage reception
-
కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు కుటుంబంలో విషాదం
సాక్షి, జగిత్యాల జిల్లా: పచ్చని పందిళ్లు..మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు తల్లిదండ్రులు చావు బతుకులు మద్య కొట్టుమిట్టాడుతుంటే అన్న , అతని స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వధువు వివాహం జరిగిన గంటల వ్యవధిలో ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయిజగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండలో రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
వైఎస్సార్ జిల్లా: వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లా పర్యటనలో.. బుధవారం పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులు అశ్వినిరెడ్డి, రామతేజేశ్వర్ రెడ్డిలను ఆశీర్వదించారు సీఎం జగన్. నూతన వధూవరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకకు హాజరైన వారికి అభివాదం చేసిన సీఎం జగన్.. అక్కడికి వచ్చిన వాళ్లను అక్కున చేర్చుకుని ఆప్యాయంగా పలకరించారు కూడా. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య వర్మ, సాయి సంజనలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్ -
ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్
యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. మంత్రి సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ రిసెప్షన్ సోమవారం యర్రగొండపాలెంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరై నూతన దంపతులు శ్రిష్టి, సిద్ధార్థ్‌లను ఆశీర్వదిస్తారు. సోమవారం ఉదయం 10.40 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. 11.25 గంటలకు యర్రగొండపాలెం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 వరకు హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో మాట్లాడతారు. 11.40 నుంచి 11.55 గంటల వరకు రిసెప్షన్లో పాల్గొంటారు. తిరిగి 12 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్లో తాడేపల్లికి చేరుకుంటారు. -
రిసెప్షన్ ఫంక్షన్: నూతన దంపతులపై కేసు
తొగుట(దుబ్బాక): తొగుట మండలం చందాపూర్‌లో లాక్డౌన్, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రిసెప్షన్ నిర్వహించిన పది మందిపై గురువారం కేసు నమోదు చేసినట్టు తొగుట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పెళ్లి రిసెప్షన్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై, పోలీసులు సిబ్బంది అక్కడికి వెళ్లారు. రిసెప్షన్ నిర్వహించుకుంటున్న పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుతోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేశామన్నారు. నూనె మహేశ్ (26) ఎ1, నూనె మౌనిక (25) ఎ2, టెంట్ హౌజ్ నిర్వాహకుడు నర్సెట్టి ఎల్లం (28) ఎ3, ఆత్మకూరి శ్రీనివాస్ (35) ఎ4, పాడలా విజయ (28) ఎ5, నూనె సుబధ్ర (60) ఎ6, జనగామ సుభాష్‌గౌడ్ ఎ7. బొడ్డు స్వామి (38) ఎ8, బొడ్డు భూమయ్య (42) ఎ9, నర్సెట్టి సురేష్ (35) ఎ10 పై క్రైం నంబర్ 82/2021 యూ/ ఎస్ 341, 186, 188, 269 మరియు డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిళ్లు తప్ప రిసెప్షన్, పుట్టిన రోజు ఇతర ఫంక్షన్లకు ఎలాంటి అనుమతి లేవన్నారు. లాక్డౌన్ మరియు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఫంక్షన్లు చేసుకునే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చదవండి: పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్.. కారణం ఏంటంటే -
పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా.. పోలీసుల ఎంట్రీ
నల్లగొండ పట్టణంలో శుక్రవారం రాత్రి కర్ఫ్యూ అమలును ఎస్పీ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. టూటౌన్ పరిధిలో 20మందికి మించి వివాహ రిసెప్షన్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. రిసెప్షన్ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చదవండి: చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు -
పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్.. కారణం ఏంటంటే
చండీగఢ్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు 50 మందికి మించి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ నవ వరుడిని వివాహం అయిన గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు అతడు చేసిన నేరం ఏంటంటే.. వివాహం అనంతరం సదరు వరుడి కుటుంబ సభ్యులు జలంధర్‌లోని ఓ ఆలయంలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సుమారు 100 మంది హాజరయ్యారు. దీని గురించి పోలీసులకు తెలియడంతో వారు వరుడితో పాటు అతడి తండ్రి మీద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వరుడు చెప్పిన విషయం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. రిసెప్షన్ వేడుకకు వచ్చిన వారిలో చాలా మంది తమకు తెలియదన్నారు. అసలు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో తమకు తెలియదని వాపోయాడు. ఇక వేడుకకు వచ్చిన వారిని వెళ్లిపోమ్మని చెప్పడం బాగుండదని.. అందుకే తాము మౌనంగా ఉన్నామన్నారు. ఇక రిసెప్షన్ వేడుకకు హాజరైన వారిలో కొందరు పోలీసులును చూసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా జలందర్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ‘‘సదరు వరుడు, అతడి కుటుంబ సభ్యులు వారాంతపు కర్ఫ్యూని ఉల్లంఘించారు. అంతేకాక ఫంక్షన్ నిర్వహించడానికి ముందు మా వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అందుకే వారి మీద ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశాం’’ అన్నారు. కరోనా కట్టడి కోసం పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తుంది. దాంతో పాటు జిమ్‌లు, సినిమా హాళ్లు, పార్కులు, కోచింగ్ సెంటర్లు, క్రీడా సముదాయాలు మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివాహాలు, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతిచ్చింది. దహన సంస్కారాలకు కేవలం 10మందికి మాత్రమే అనుమతి. మినహాయించిన దానికన్నా ఎక్కువ మందితో నిర్వహించే కార్యక్రమాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. చదవండి: వైరల్: ‘ఆక్సిజన్ కావాలంటే ఈ నాయకులకు కాల్ చేయండి’ -
నాన్న ఆశీర్వాదం కోసం... రూ. 6 లక్షల విగ్రహం
సాక్షి, చెన్నై: తండ్రిపై సాధారణంగా కుమార్తెలకు ప్రేమ కాస్త ఎక్కువే. ఆడపిల్ల తన జీవితంలోని ప్రతి కీలక దశలో నాన్న తోడుగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా వివాహ సమయంలో తండ్రిని ఎక్కువగా గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ దురదృష్టం కొద్ది తండ్రి.. కుమార్తె వివాహానికి ముందే మరణిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. తమిళనాడుకుచెందిన అక్కాచెల్లెళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సోదరి వివాహంలో తండ్రి తమతో లేడన్న బాధను మరిచేందుకు ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు ఆ అక్కాచెల్లెళ్లు. ఆ విగ్రహం సమక్షంలో తన చిన్న చెల్లెలి వివాహ రిసెప్షన్ వేడుకను జరిపించారు. ఆ వివరాలు.. తమిళనాడు తంజావూరు జిల్లా పట్టుకోట్టైకు చెందిన సెల్వం పెద్ద పారిశ్రామిక వేత్త. ఆయనకు భార్య కళావతి, భువనేశ్వరి, దివ్య, లక్ష్మి ప్రభ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అంటే కుమార్తెలకు ఎనలేని ప్రేమ. ఇందులో చిన్న కుమార్తె లక్ష్మీప్రభ ఆ తండ్రికి గారాల పట్టి. భువనేశ్వరి, దివ్యలకు ఎనిమిదేళ్ల క్రితమే అత్యంత వేడుకగా వివాహాన్ని జరిపించాడు. (చదవండి: ఒకప్పుడు కారడివి.. కానీ ఇప్పుడు..) ఆనందంగా సాగుతున్న వారిపై విధి చిన్న చూపు చూసింది. 2012లో సెల్వం మరణించాడు. తండ్రి మరణం కుమార్తెల్ని కలచి వేసింది. ఈ పరిస్థితుల్లో తండ్రికి గారాల పట్టిగా ఉన్న లక్ష్మీప్రభ వివాహ రిసెప్షన్ సోమవారం రాత్రి పట్టుకోట్టైలోని ఓ వివాహ వేదికలో జరిగింది. ఈ వివాహంలో తండ్రి లేడన్న లోటు లక్ష్మీప్రభకు తెలియకూడదని అక్కయ్య భువనేశ్వరి, బావ కార్తిక్ భావించారు. ఇందుకోసం బెంగళూరులోని ఓ సంస్థ ద్వారా తండ్రి నిలువెత్తు సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించారు. రూ. 6 లక్షలు వెచ్చించి సిలికాన్‌తో 5 అడుగులు 7 అంగుళాల ఎత్తుతో రూపొందించిన విగ్రహాన్ని కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. దీంతో తండ్రి తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించినంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. వధూవరులు ఇద్దరు ఆ విగ్రహం సమక్షంలో పూలమాలల్ని మార్చుకున్నారు -
రిసెప్షన్‌కు హెలికాప్టర్లో వచ్చాడు!
సాక్షి, నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లాలోని మారుమూల పర్రచివర గ్రామంలో మంగళవారం వివాహ రిసెప్షన్‌కు గుజరాత్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్త ప్రైవేట్ హెలికాప్టర్లో వచ్చారు. గుజరాత్‌కు చెందిన కేపీ గ్రూప్ సీఎండీ ఫరూక్ జి.పటేల్‌కు పర్రచివర గ్రామస్తుడైన బొండాడ రాఘవేంద్రరావు పార్ట్నర్గా ఉన్నారు. తన మేనల్లుడు సందీప్–శరణ్యల వివాహ రిసెప్షన్‌కు ఫరూక్‌ను బొండాడ ఆహ్వానించారు. ఫరూక్ తన కుటుంబ సభ్యులతో గుజరాత్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పర్రచివర గ్రామానికి చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
కరోనా భయం; వీడియో కాల్లో ఆశీర్వాదాలు
ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ఇటు షేర్ మార్కెట్లు, ఓ వైపు బంగారం ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు ఈ వైరస్ పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభావం చూపుతోంది.ఈ కరోనా వైరస్ భయంతో చైనాలోని కొన్ని పెళ్లిళ్లు విచిత్రంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చైనాలోని ఓ డాక్టర్.. వైరస్ సోకిన పేషెంట్లతో బిజీగా ఉండటంతో తన పెళ్లికి కేవలం 10 నిమిషాలు హాజరై మళ్లీ తన విధులకు వెళ్లారు. కాగా ప్రస్తుతం మరో నూతన జంటను ఈ మహమ్మారి ఇబ్బందులకు గురిచేసింది. (భయపెడుతున్న నకిలీ ‘వైరల్’) సింగపూర్‌కు చెందిన ఓ కుటుంబం చైనాలో స్థిరపడ్డారు. తాజాగా ఈ కుటుంబానికి చెందిన జోసెఫ్ యూ, కాంగ్ టింగ్ అనే ఓ జంట గత అక్టోబర్‌లో చైనాలో వివాహం చేసుకున్నారు. అయితే వివాహానికి హాజరు కానీ బంధు మిత్రులకు ప్రస్తుతం సింగపూర్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడంతో ఈ కుంటుంబం చైనాలో నివసించి వచ్చారన్న భయంతో బంధువులెవరూ రిసెప్షన్ పార్టీకి రావడానికి జంకుతున్నారు.(కబళిస్తోన్న కరోనా వైరస్..) ఇది తెలిసిన నూతన వధువరులు ఓ కొత్త ఆలోచన చేశారు. సింగపూర్‌లోని హోటల్లో పార్టీ ఏర్పాటు చేసి గ్రాండ్‌గా రెడీ అయ్యి వేదిక వద్ద జరిగే వేడుకల దగ్గర స్నేహితులు, బంధువుల కోసం హోటల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. కాగా అతిథులు వేడుకకు రావడానికి ఆందోళన చెందడంతో రిసెప్షన్ వాయిదా వేయాలని అనుకున్నామని, కానీ కుదరకపోవడంతో ఈ విధంగా చేయాల్సి వచ్చింది పెళ్లి కొడుకు జోసెఫ్ యూ తెలిపారు. ఇక ఈ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో ఇద్దరికి కరోనా? -
ఎంపీ మాధవి వివాహ రిసెప్షన్లో సీఎం జగన్
-
ఎంపీ మాధవి వివాహ రిసెప్షన్లో సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మాధవి, శివప్రసాద్ దంపతులను సీఎం ఆశీర్వదించారు. సాయిప్రియా రిసార్ట్స్‌లో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. రిసెప్షన్ వేడుకలో బంధుమిత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాగా, ఎంపీ మాధవి, శివప్రసాద్ వివాహం కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోని మాధవి స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున (3.15 గంటలకు) జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి : ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం) పాతికేళ్ల వయసులోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్ చంద్రదేవ్‌ని ఓడించారు. ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే దేముడు. కాగా, కుసిరెడ్డి శివప్రసాద్.. మాధవి చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. (చదవండి : ఒప్పించారు ఒక్కటయ్యారు) ముఖ్యమంత్రికి అభినందనలు.. ఢిల్లీ పర్యటన ముగించుకుని విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌ను చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ కలిశారు. సంపూర్ణ మద్య నిషేధం దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ఆమె అభినందించారు. కాగా, షిరీన్ విశాఖ టీడీపీ నగరాధ్యక్షుడు ఎస్.ఏ. రెహమాన్ భార్య కావడం గమనార్హం. -
తారల మధ్య ముంబైలో...
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల రెండో రిసెప్షన్ వేడుక మంగళవారం ముంబైలో అట్టహాసంగా జరిగింది. లోయర్ పారెల్‌లోని సెయింట్ రెజిస్ లగ్జరీ హోటల్లో ఘనంగా జరిగిన ఈ వివాహ విందుకు పలువురు బాలీవుడ్ తారలు, క్రికెట్ స్టార్లు హాజరయ్యారు. శ్రీలంకతో సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లంతా ఈ వేడుకకు విచ్చేశారు. సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ప్రత్యేక గౌన్‌లో తళుక్కున మెరిసింది. మాజీ కెప్టెన్ ధోని తన భార్య సాక్షి సింగ్, గారాల పట్టి జీవాతో కలిసి వేడుకలో పాల్గొన్నాడు. సహచరులు రోహిత్ శర్మ దంపతులు, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, పుజారా, ఉనాద్కట్, మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్, బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తదితరులు విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 21న ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఏర్పాటు చేసిన తొలి రిసెప్షన్‌కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నవ దంపతులు విరాట్, అనుష్కలను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. -
పెళ్లికూతుర్ని కాల్చి చంపిన మాజీ ప్రియుడు
భోపాల్ : తనకు దక్కని ప్రేయసి ...మరొకరి సొంతం కావటాన్ని సహించలేకపోయిన ప్రియుడు ఉన్మాదానికి పాల్పడ్డాడు. మరికాసేపట్లో పెళ్లి అనగా .. పెళ్లికూతురును పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడు. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. స్థానిక లాల్‌ఘటీ ప్రాంతంలో డాక్టర్ రోహిత్, డాక్టర్ జయశ్రీ నామ్‌దియోల రిసెప్షన్ జరుగుతోంది. కాబోయే వధూవరులను బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా ... హఠాత్తుగా ఓ వ్యక్తి వేదికపైకి వచ్చాడు. నేరుగా వధువు వద్దకు వచ్చిన అతడు, ఆమెపై అత్యంత సమీపం నుంచి మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. తేరుకుని వెంటనే పెళ్లికూతురును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో జయశ్రీ వెనక ఉన్న మరొకరు కూడా గాయపడ్డాడు. కాగా తనను ప్రేమ పేరుతో మోసం చేసినందుకే జయశ్రీని చంపినట్టు ప్రియుడు అనురాగ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.