సాక్షి, చెన్నై: తండ్రిపై సాధారణంగా కుమార్తెలకు ప్రేమ కాస్త ఎక్కువే. ఆడపిల్ల తన జీవితంలోని ప్రతి కీలక దశలో నాన్న తోడుగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా వివాహ సమయంలో తండ్రిని ఎక్కువగా గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ దురదృష్టం కొద్ది తండ్రి.. కుమార్తె వివాహానికి ముందే మరణిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. తమిళనాడుకుచెందిన అక్కాచెల్లెళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సోదరి వివాహంలో తండ్రి తమతో లేడన్న బాధను మరిచేందుకు ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు ఆ అక్కాచెల్లెళ్లు. ఆ విగ్రహం సమక్షంలో తన చిన్న చెల్లెలి వివాహ రిసెప్షన్ వేడుకను జరిపించారు. ఆ వివరాలు.. తమిళనాడు తంజావూరు జిల్లా పట్టుకోట్టైకు చెందిన సెల్వం పెద్ద పారిశ్రామిక వేత్త. ఆయనకు భార్య కళావతి, భువనేశ్వరి, దివ్య, లక్ష్మి ప్రభ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అంటే కుమార్తెలకు ఎనలేని ప్రేమ. ఇందులో చిన్న కుమార్తె లక్ష్మీప్రభ ఆ తండ్రికి గారాల పట్టి. భువనేశ్వరి, దివ్యలకు ఎనిమిదేళ్ల క్రితమే అత్యంత వేడుకగా వివాహాన్ని జరిపించాడు.
(చదవండి: ఒకప్పుడు కారడివి.. కానీ ఇప్పుడు..)
ఆనందంగా సాగుతున్న వారిపై విధి చిన్న చూపు చూసింది. 2012లో సెల్వం మరణించాడు. తండ్రి మరణం కుమార్తెల్ని కలచి వేసింది. ఈ పరిస్థితుల్లో తండ్రికి గారాల పట్టిగా ఉన్న లక్ష్మీప్రభ వివాహ రిసెప్షన్ సోమవారం రాత్రి పట్టుకోట్టైలోని ఓ వివాహ వేదికలో జరిగింది. ఈ వివాహంలో తండ్రి లేడన్న లోటు లక్ష్మీప్రభకు తెలియకూడదని అక్కయ్య భువనేశ్వరి, బావ కార్తిక్ భావించారు. ఇందుకోసం బెంగళూరులోని ఓ సంస్థ ద్వారా తండ్రి నిలువెత్తు సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించారు. రూ. 6 లక్షలు వెచ్చించి సిలికాన్‌తో 5 అడుగులు 7 అంగుళాల ఎత్తుతో రూపొందించిన విగ్రహాన్ని కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. దీంతో తండ్రి తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించినంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. వధూవరులు ఇద్దరు ఆ విగ్రహం సమక్షంలో పూలమాలల్ని మార్చుకున్నారు
నాన్న ఆశీర్వాదం కోసం... రూ. 6 లక్షల విగ్రహం
Published Wed, Feb 3 2021 11:25 AM | Last Updated on Wed, Feb 3 2021 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment