కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు కుటుంబంలో విషాదం | RTC bus collided with wedding reception car in jagtial | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు కుటుంబంలో విషాదం

Published Sun, Nov 10 2024 7:36 AM | Last Updated on Sun, Nov 10 2024 9:27 AM

RTC bus collided with wedding reception car in jagtial

సాక్షి, జగిత్యాల జిల్లా: పచ్చని పందిళ్లు..మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు తల్లిదండ్రులు చావు బతుకులు మద్య కొట్టుమిట్టాడుతుంటే అన్న , అతని స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వధువు వివాహం జరిగిన గంటల వ్యవధిలో ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండలో రిసెప్షన్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల డిపోకి చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.   

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement