పెళ్లికూతుర్ని కాల్చి చంపిన మాజీ ప్రియుడు | Lover shot bride on her marriage reception, dead | Sakshi
Sakshi News home page

పెళ్లికూతుర్ని కాల్చి చంపిన మాజీ ప్రియుడు

Published Fri, May 9 2014 11:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

పెళ్లికూతుర్ని కాల్చి చంపిన మాజీ ప్రియుడు

పెళ్లికూతుర్ని కాల్చి చంపిన మాజీ ప్రియుడు

భోపాల్ : తనకు దక్కని ప్రేయసి ...మరొకరి సొంతం కావటాన్ని సహించలేకపోయిన ప్రియుడు ఉన్మాదానికి పాల్పడ్డాడు. మరికాసేపట్లో పెళ్లి అనగా .. పెళ్లికూతురును  పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడు. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. స్థానిక లాల్‌ఘటీ ప్రాంతంలో  డాక్టర్‌ రోహిత్‌, డాక్టర్‌ జయశ్రీ నామ్‌దియోల రిసెప్షన్ జరుగుతోంది. కాబోయే వధూవరులను బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా ... హఠాత్తుగా ఓ వ్యక్తి  వేదికపైకి వచ్చాడు.

నేరుగా వధువు వద్దకు వచ్చిన అతడు, ఆమెపై అత్యంత సమీపం నుంచి మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. తేరుకుని వెంటనే పెళ్లికూతురును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో జయశ్రీ వెనక ఉన్న మరొకరు కూడా గాయపడ్డాడు. కాగా తనను ప్రేమ పేరుతో మోసం చేసినందుకే జయశ్రీని చంపినట్టు ప్రియుడు అనురాగ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement