
పర్రచివర గ్రామంలో దిగిన హెలికాప్టర్
సాక్షి, నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లాలోని మారుమూల పర్రచివర గ్రామంలో మంగళవారం వివాహ రిసెప్షన్‌కు గుజరాత్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్త ప్రైవేట్ హెలికాప్టర్‌లో వచ్చారు. గుజరాత్‌కు చెందిన కేపీ గ్రూప్ సీఎండీ ఫరూక్ జి.పటేల్‌కు పర్రచివర గ్రామస్తుడైన బొండాడ రాఘవేంద్రరావు పార్ట్‌నర్‌గా ఉన్నారు. తన మేనల్లుడు సందీప్–శరణ్యల వివాహ రిసెప్షన్‌కు ఫరూక్‌ను బొండాడ ఆహ్వానించారు. ఫరూక్ తన కుటుంబ సభ్యులతో గుజరాత్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పర్రచివర గ్రామానికి చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment