ప్రాణాంతక కరోనా వైరస్ చైనాను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ఇటు షేర్ మార్కెట్లు, ఓ వైపు బంగారం ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు ఈ వైరస్ పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభావం చూపుతోంది.ఈ కరోనా వైరస్ భయంతో చైనాలోని కొన్ని పెళ్లిళ్లు విచిత్రంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చైనాలోని ఓ డాక్టర్.. వైరస్ సోకిన పేషెంట్లతో బిజీగా ఉండటంతో తన పెళ్లికి కేవలం 10 నిమిషాలు హాజరై మళ్లీ తన విధులకు వెళ్లారు. కాగా ప్రస్తుతం మరో నూతన జంటను ఈ మహమ్మారి ఇబ్బందులకు గురిచేసింది. (భయపెడుతున్న నకిలీ ‘వైరల్’)
సింగపూర్‌కు చెందిన ఓ కుటుంబం చైనాలో స్థిరపడ్డారు. తాజాగా ఈ కుటుంబానికి చెందిన జోసెఫ్ యూ, కాంగ్ టింగ్ అనే ఓ జంట గత అక్టోబర్‌లో చైనాలో వివాహం చేసుకున్నారు. అయితే వివాహానికి హాజరు కానీ బంధు మిత్రులకు ప్రస్తుతం సింగపూర్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడంతో ఈ కుంటుంబం చైనాలో నివసించి వచ్చారన్న భయంతో బంధువులెవరూ రిసెప్షన్ పార్టీకి రావడానికి జంకుతున్నారు.(కబళిస్తోన్న కరోనా వైరస్..)
ఇది తెలిసిన నూతన వధువరులు ఓ కొత్త ఆలోచన చేశారు. సింగపూర్‌లోని హోటల్‌లో పార్టీ ఏర్పాటు చేసి గ్రాండ్‌గా రెడీ అయ్యి వేదిక వద్ద జరిగే వేడుకల దగ్గర స్నేహితులు, బంధువుల కోసం హోటల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. కాగా అతిథులు వేడుకకు రావడానికి ఆందోళన చెందడంతో రిసెప్షన్ వాయిదా వేయాలని అనుకున్నామని, కానీ కుదరకపోవడంతో ఈ విధంగా చేయాల్సి వచ్చింది పెళ్లి కొడుకు జోసెఫ్ యూ తెలిపారు. ఇక ఈ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment