‘‘మనం మనుషులుగా పుట్టాం కాబట్టి చాలా అదృష్టవంతులం. ఏదైనా అనిపిస్తే అది చెప్పగలం. ఏదైనా అనుకుంటే అది చేసేయగలం. మనకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి. మనల్ని ప్రేమించేవాళ్లు ఉన్నారు. కేరింగ్‌గా చూసేవాళ్లున్నారు. కానీ ఒక్కసారి జంతువుల గురించి ఆలోచించండి’’ అంటున్నారు అనుష్కా శర్మ. తన బర్త్‌డే (మే 1) సందర్భంగా ముంబైలో జంతువుల కోసం ఓ షెల్టర్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు అనుష్క. ఈ ‘యానిమల్ షెల్టర్’ (జంతు సంరక్షణ శాల) గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఒక్కసారి జంతువుల గురించి ఆలోచించండి. వాటిని మనందరం ఎలా ట్రీట్ చేస్తున్నామో. వాటి రైట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ వాటిని మనం (మనుషులు) సరిగ్గా చూసుకోవడం లేదని వాటికి అనిపించినా.. బయటకు చెప్పుకోలేని మూగజీవులు. వాటికోసం మనం నిలబడాలి. అది మన బాధ్యత. తెలివైన మనుషులుగా మనం చేయాల్సిన పని ఏదైనా ఉందంటే సాటి జీవరాశుల కోసం నిలబడగలగటమే.
మన మదర్ ఎర్త్‌కి అదే మనం తిరిగివ్వగలిగేది. దలై లామా చెప్పిన ఓ మాట నాతోనే ఉండిపోయింది. ‘లైఫ్ అందరికీ ఒక్కటే. మాట రాని మూగజీవికైనా, మనకైనా. బాధకు భయపడతాం. ఆనందాన్ని కోరుకుంటాం. చావుకు భయపడతాం. ఎక్కువ కాలం జీవించాలనుకుంటాం. మనకు మాత్రమే కాదు మిగతా జీవరాశులకు కూడా ఇలాగే అనిపిస్తుంది’. నా బర్త్‌డే రోజు మన తోటి జీవులకు మనందరితో పాటే సమానమైన ప్రేమను, ఆప్యాయతను, రైట్స్‌ను నా వంతుగా ఇవ్వాలి అనుకుంటున్నాను. ముంబై సిటీ చివర్లో జంతువులకు ఓ షెల్టర్ నిర్మించదలిచాను. జంతువులకు ప్రేమను ఇవ్వగలిగే ఓ ఇల్లులాగా తయారు చేయనున్నాను. చాలా రోజులుగా చేద్దాం అనుకుంటున్న ఈ కల ఇప్పటికి కార్యరూపం దాల్చింది. మీ అందరి సపోర్ట్, అడ్వైస్‌తో.. మన తోటివారిని (జంతువులను) ప్రేమగా చూసుకొనే ఓ అద్భుతమైన ప్లేస్‌గా మారుస్తాను’’ అనిపేర్కొన్నారు అనుష్క.
ఒక్కసారి ఆలోచించండి
Published Wed, May 2 2018 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment