
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహానికి సంబంధించి రోజుకో వార్త వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తన తల్లిదండ్రులు, సోదరుడు కర్ణేశ్‌తో కలిసి అనుష్క మధ్యాహ్నం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించినట్లు తెలిసింది. అయితే వారంతా ఎక్కడికి వెళ్లారనేదాని గురించి మాత్రం సమాచారం లేదు. ఎయిర్‌పోర్ట్‌లో కొందరు విలేకరులు అనుష్క తదితరులను మాట్లాడించే ప్రయత్నం చేసినా వారు దీనిపై నోరు మెదపలేదు.
ఈ నెల 12న ఇటలీలోని మిలాన్‌లో కోహ్లి, అనుష్క కొంత మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఆమె కుటుంబ సభ్యులు ఇటలీకి బయల్దేరారని కూడా కొంత మంది చెబుతున్నారు. అదే సమయంలో కొన్నాళ్ల క్రితం డెహ్రాడూన్‌లో వీళ్లిద్దరిని ఆశీర్వదించిన పురోహితుడు కూడా విమానం ఎక్కేందుకు రావడంతో పెళ్లి వార్త నిజం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment