
న్యూఢిల్లీ: కొత్తగా తల్లిదండ్రులైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అనుష్క పడ్డంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వారి కూతురి ఫొటోను చూపించకుండా ఈ సెలబ్రిటీ కపుల్ గొప్యత పాటిస్తున్నారు. అంతేగాక వారి ప్రైవసీని డిస్టర్బ్ చేయోద్దంటూ వారు మీడియాను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి కూతురిని ఎప్పుడేప్పుడు క్లిక్ మనిపిద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీడియాకు విరుష్కలు ఎదురుపడ్డారు. (చదవండి: సంతోష సమయం.. చిన్న విన్నపం: విరుష్క)
ఇక కూతురు పుట్టాక మొదటిసారిగా ఈ జంట బయట కాలు పెట్టడంతో మీడియా తమ కెమారాలకు పని చెప్పింది. అయితే వీరితో వారి కూతురు లేకపోవడం కాస్తా నిరూత్సాహ పరిచినప్పటికి కొత్తగా తల్లిదండ్రులైన తర్వాత తొలిసారిగా విరాట్, అనుష్కలను చూసి వారి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక త్వరగా మీ కూతురిని చూపించమంటూ విరుష్కల అభిమానులు సోషల్ మీడియా వేదిక విజ్ఞప్తి చేస్తున్నారు. (చదవండి: ధోని నుంచి కోహ్లి వరకు.. సేమ్ టు సేమ్)
Comments
Please login to add a commentAdd a comment