లక్నో: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, తన భార్య అనుష్క శర్మకు విడాకులు ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ డిమాండ్ చేశారు. అంతేకాక ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకు విషయం ఏంటంటే.. అనుష్క నిర్మాతగా ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఓ సన్నివేశంలో ఎమ్మెల్యే నందకిశోర్ ఫొటోను ఉపయోగించారు. ఈ సిరీస్‌లో విలన్ పాత్ర పోషించిన బాలకృష్ణ బాజ్‌పేయి నటించిన ఓ సన్నివేశంలో మార్ఫడ్ ఫొటోని వాడినా నందకిశోర్ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో తన అనుమతి లేకుండా ఫొటో వాడటమే కాక.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా తనను చూపించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. (కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు)
వెంటనే ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలని నందకిశోర్.. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. అనుష్క మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని.. జాతీయ భద్రతా చట్టం కింద ఆమె మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీకి దేశభక్తి ఉంది. ఆయన భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్నారు. కోహ్లీ అనుష్కకు విడాకులు ఇవ్వాలి’ అన్నారు నందకిశోర్.('ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా')
#Ghaziabad: BJP leader Nandkishor Gurjar (@nkgurjar4bjp) has filed a case against actor turned producer @AnushkaSharma. FIR is regarding Web Series #PataalLok. He accused actress of sedition and advised @imVkohli to divorce her. (Story in Development) pic.twitter.com/NNEXAFclfX
— Newsroom Post (@NewsroomPostCom) May 23, 2020
ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో గూర్ఖా వాళ్లను అవమానించారంటూ ‘ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్’ సభ్యులు కేంద్రానికి సంబంధించిన హెచార్సీలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. రెండో ఎపిసోడ్‌లో ఓ సీన్ గూర్ఖా సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నట్టు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక ఈ సీన్‌లో వచ్చే మాటలను వినబడకుండా మ్యూట్ చేయాలంటూ గూర్ఖా సమాజాపు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment