Samantha's Friend: Samantha Was Planning For Pregnancy - Sakshi
Sakshi News home page

Samantha: నాన్‌స్టాప్‌గా సమంతకు కాల్స్, ముంబై వెళ్లొచ్చు: సామ్‌ ఫ్రెండ్‌

Published Sat, Oct 9 2021 11:42 AM | Last Updated on Sat, Oct 9 2021 3:24 PM

Samantha Was Planning For Pregnancy Says Samanthas Friend - Sakshi

Samantha Was Planning For Pregnancy: సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన అనంతరం రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. సమంత తన స్టైలిస్ట్‌తో సన్నిహితంగా ఉంటుందని, పిల్లలను వద్దునుకుంది అని, ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ కూడా చేయించేసుకుంది అంటూ సమంతను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. తాము భార్యాభర్తలుగా విడిపోతున్నాం అంటూ సామ్‌-చై ప్రకటించినప్పటి నుంచి సమంతనే టార్గెట్‌ చేస్తూ ఆమెను దూషిస్తున్నారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్‌ వైరల్‌


ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఆమెపై అసత్య ప్రచారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. తాజాగా సమంత స్నేహితురాలు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు)ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌ సిరీస్‌ అనంతరం సమంత ఫోన్‌ నాన్‌స్టాప్‌గా మోగుతూనే ఉంది. ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో ఆమె ముంబైకి వెళ్లి తనకు నచ్చిన ప్రాజెక్ట్స్‌ చేసుకోవచ్చు. కానీ సమంత వద్దని చెప్పింది. చదవండి: మంత ఇన్‌స్టా పోస్ట్‌.. పర్సనల్‌ లైఫ్‌ గురించేనా?


ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నానని, సో సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇద్దామనుకుంటున్నట్లు నాతో చెప్పింది. తనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో తనకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. అయినప్పటికీ తను మాత్రం , పిల్లల్ని కనేందుకు ప్లాన్‌ చేసుకుంది. సినిమాల కంటే అదే తన మొదటి  ప్రాధాన్యత అని చెప్పింది. అలాంటి అమ్మాయిపై ఇప్పుడు వస్తున్న రూమర్స్‌ చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. అసలు సమంత వీటన్నింటిని ఎలా భరిస్తుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది అంటూ పేర్కొంది.

చదవండి: ChaySam Divorce: సామ్‌ తల్లి కావాలనుకుంది కానీ..: నీలిమ గుణ
ChaySam: అఫైర్స్‌, అబార్షన్‌ రూమార్స్‌పై స్పందించిన సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement