ఢిల్లీ: సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారంపై మీడియా చొరవతో జనాలకు ఆసక్తి పెరగడం.. అదే టైంలో తమ ప్రైవసీని గౌరవించండంటూ సెలబ్రిటీలు రిక్వెస్టులు చేస్తుండడం తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కోహ్లీ-అనుష్క విషయంలో ఇలాంటి వివాదమే ఒకటి చెలరేగింది. కూతురి ముఖం మీడియా కంటపడకుండా అనుష్క జాగ్రత్త పడగా.. కొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు ఫొటోజర్నలిస్టుల తీరుపైనా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంగ్లాండ్ టూర్ కోసం ముంబైలో 14 రోజుల క్వారంటైన్లో ఉన్న టీమిండియా ప్లేయర్, స్టాఫ్, క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం రాత్రి ఇంగ్లండ్ బయలుదేరారు. ఈమేరకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఫొటో జర్నలిస్టుల కంట తన బిడ్డ ముఖం పడకుండా వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది అనుష్క. దీంతో.. విరుష్క జోడీపై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం బిడ్డకు ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛనైనా ఇవ్వూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
#TeamIndia pic.twitter.com/mhmyJFc0H8
— BCCI (@BCCI) June 2, 2021
ముందే చెప్పినా కూడా..
అయితే తమ కూతురి విషయంలో విరుష్కలు ముందే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ’ సెషన్లో విరాట్.. సోషల్ మీడియా అంటే ఏమిటో అర్థం చేసుకునే వరకు, ఆమె సొంతంగా ఆలోచించే వరకు మా బిడ్డను సోషల్ మీడియాకు బహిర్గతం చేయకూడదని, దూరంగా ఉంచాలను మేము నిర్ణయించుకున్నాం”అని తేల్చి చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ప్రముఖంగా అన్ని మీడియా హౌజ్‌లకు చేరింది. అయినా కూడా ఫొటో జర్నలిస్టులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించారనే విమర్శ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చదవండి: మాట తప్పిన కోహ్లీ! ఏం చేశాడంటే..
Comments
Please login to add a commentAdd a comment