
ప్రియాంకా చోప్రా ఈ ఏడాది సంపాదన 68 కోట్ల రూపాయలు! సిగ్గుండాలి.. ఆడపిల్ల పర్సులో ఎంతుందో తీసి చూడ్డానికి. అబ్బెబ్బే అపార్థం చేసుకున్నారు. 2017 ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 సెలబ్రిటీల్లో ఉన్న ఒకే ఒక్క ఆడ కూతురు ప్రియాంక. ‘ఏ లెక్కన?’ అని చూస్తే, ఇదిగో ఈ లెక్కన అని చూపించింది ఫోర్బ్స్. అవార్డుల ఫంక్షన్‌లో ఐదు నిమిషాలు కనిపించడానికి ప్రియాంకా చోప్రా 5 కోట్లు డిమాండ్ చేసింది! మళ్లీ.. సిగ్గుండాలి. ఆడపిల్ల అంత గట్టి అమౌంట్ అడిగిందంటే.. బాయ్స్‌గా మనం ఎంత గర్వపడాలి? అది మానేసి, ‘అమ్మో! అంతా!’ అనడం ఏమిటి? విషయం ఏంటంటే.. ఫోర్బ్స్ లెక్క నిజం.
ఫైవ్ మినిట్స్‌కి ఫైవ్ క్రోర్స్ అన్నది అబద్ధం. ‘ఫైవ్ కి ఫైవ్ అట కదా’ అని ముంబైలో మొన్న విరాట్, అనుష్కల రిసెప్షన్‌లో ఎవరో అడిగితే ప్రియాంక పెద్దగా నవ్వేసింది. ‘వినడానికి నాక్కూడా బాగుంది’ అంది. ‘అయితే నిజం కాదా.. పోనీ అంత కాకపోయినా, ఈ మధ్య మీరు మగవాళ్లకు దీటుగా çసంపాదిస్తున్నారట కదా, ఎంత వెనకేసి ఉంటారేంటి?’ అని ఇంకో క్వొశ్చన్. అందుక్కూడా నవ్వే సమాధానం. ‘సంపాదన కోసం ఎప్పుడూ నేను చూడలేదు. సంతోషాన్నే చూసుకున్నాను. నేను ఏం చేసినా అది నా సంతోషం కోసమే. సంతోషంతో పాటు డబ్బూ వస్తుంటే.. అదీ సంతోషమే కదా’.. అని çఫక్కున మళ్లీ ఒక నవ్వు. మొత్తానికి ఒక గట్టి అమ్మాయి మన మగధీర సెలబ్రిటీలకు ఇన్నాళ్లకు పోటీ ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment