
నటిగానే కాదు నిర్మాతగాను విజయవంతంగా దూసుకుపోతుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ. నిర్మాతగాను వైవిధ్యమైన కథలనే ఎన్నుకుంటుంది. ఈ బ్యూటీ నిర్మించిన మూడు చిత్రాలలో 'ఎన్‌హెచ్10' రోడ్ థ్రిల్లర్ కాగా, 'పిలౌరి' ఆత్మల నేపధ్యంలో సాగే కథాంశం. ఈ మధ్యే విడుదలయిన 'పారి' హర్రర్ చిత్రం. ఈ చిత్ర నిర్మాత, కథానాయకి కూడా అనుష్కే. దెయ్యం పట్టిన స్త్రీగా ఈ చిత్రంలో అనుష్క నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రిమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హర్రర్ కథలకు ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది. కాబట్టి సహజంగానే 'పారి' చిత్రం తమిళ నిర్మాతలను ఆకర్షిస్తోంది. 'పారి' చిత్రం హక్కుల కోసం పెద్దమొత్తంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, అన్నికుదిరి ఒప్పందం ఫైనల్ కాగానే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment