బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుల్‌బుల్’. ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో దీనిలో హీరోయిన్‌గా నటించిన త్రిప్తి దిమ్రి తెర మీద తన పాత్రకు, నిజ జీవితంలో తనకు చాలా తేడా ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన గురించి చెప్పుకొచ్చారు త్రిప్తి. ‘‘బుల్‌బుల్’ చిత్రంలో నేను పోషించిన పాత్రకు.. నిజ జీవితంలో నా ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నేను ఇంట్రావర్ట్‌ని. నా భావాలు నాలోనే దాచుకునేదాన్ని. కానీ ఈ చిత్రంలో నా పాత్ర ప్రతి దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తుంది. నిజ జీవితంలో నేను చాలా సిగ్గరిని. స్కూల్ ఫంక్షన్స్‌లో పాల్గొనేదాన్ని కాదు. కనీసం క్లాస్ రూంలో డౌట్లు కూడా అడిగేదాన్ని కాదు. లేచి నిలబడి డౌట్ అడుగుతుంటే.. మిగతా అందరూ నా వైపే చూడటం నాకు ఇష్టం ఉండదు. అయితే కాలేజీకి వచ్చేసరికి నా ఆలోచనల్లో మార్పు వచ్చింది’ అన్నారు. (ఆ దెయ్యం రక్తం తాగుతుంది తెలుసా!)
త్రిప్తి మాట్లాడుతూ.. ‘స్టేజీ మీదకు ఎక్కి ప్రపంచాన్ని ఎదుర్కొవాలని భావించాను. దాంతో కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో పాల్గొనేదాన్ని. మోడలింగ్ ఏజెన్సీలో కూడా చేరాను. అలా నాకు అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది. అయితే మొదటి సారి నేను ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను. కెమరా ముందు నిల్చొవడం అదే మొదటి సారి. దాంతో చాలా భయపడ్డాను. అయితే ఆశ్చర్యం ఏంటంటే నేను చాలా బాగా చేశాను.. సెలక్ట్ అయ్యాను. అలా నా మొదటి సినిమా ‘పోస్టర్ బాయ్స్’ అవకాశం లభించింది’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘చాలా మంది నన్ను చూస్తే ఇబ్బంది పడే నేను ఇప్పుడు సెట్‌నే ఇంటిగా భావించే విధంగా మారాను. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. నా భయాలతో పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రోజు ఇలా ఉన్నాను’ అన్నారు త్రిప్తి. (కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు)
అంతేకాక ‘నన్ను నేను నమ్మడం ప్రారంభించాను. నా లోని అభద్రతాభావాలను పట్టించుకోవడం మానేశాను. అయితే ఇప్పటికి కొత్త పరిస్థితుల్లో.. భయపడుతూనే ఉంటాను. కానీ ఆ భయాలన్నింటిని నేను జయించగలనని నాకు తెలుసు. ఒక్కటి గుర్తు పెట్టుకొండి. భయం అనేది ఓ ఫీలింగ్ మాత్రమే. ఏ భావన కూడా శాశ్వతం కాదు. దానితో పోరాడండి.. ఓడిపోయినా పర్వాలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. పోరాడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు త్రిప్తి.
Comments
Please login to add a commentAdd a comment