Bulbul
-
OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు..
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మూవీ లవర్స్‌కు ఫేవరేట్‌గా మారిపోయాయి. కరోనాతో లాక్డౌన్ ఏర్పడిన సమయంలో ఎంటర్టైన్మెంట్కు ప్రత్యమ్నాయంగా నిలిచిన ఈ ఓటీటీల హవా ఇంకా జోరుగా సాగుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించడంలో తగ్గేదే లే అంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్‌ఫ్లిక్స్. ఎప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది. అయితే సినీ ప్రియులు మాత్రం ప్రతి జోనర్‌ను విడిచిపెట్టకుండా చూస్తారు. కానీ కొందరు ప్రేక్షకులు పర్టిక్యూలర్ జోనర్స్ మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫాంటసీ, స్కై ఫై, టైమ్ ట్రైవేల్, సూపర్ హీరోస్ వంటి జోనర్స్‌ను ఇష్టపడితే కొందరికి వెన్నులో వణుకు పుట్టించే హారర్ చిత్రాలు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వారికోసమే శుక్రవారం (మే 13) అతిగా భయపెట్టే 6 హారర్ సినిమాలను చూడమని సజ్జెస్ట్ చేస్తూ టైటిల్స్ తెలిపింది నెట్‌ఫ్లిక్స్. 'ఈ 13 తేదిన భయపడేందుకు ఈ సినిమాలు చూడండి' అని ట్వీట్ చేసింది. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. #WhatToWatchOnNetflix 🎥: 1. Bulbbul 2. The Conjuring 3. The Conjuring 2 4. The Haunting Of Hill House 5. Hereditary 6. Insidious: The Last Key — Netflix India (@NetflixIndia) May 13, 2022 నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరో ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా హారర్ మూవీస్‌ను సజ్జెస్ట్ చేసింది. తన ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న హారర్ సినిమాల టైటిల్స్‌ను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. వీటిలో ది పాస్ట్, అమరికన్ హారర్ స్టోరీస్, ది హిల్స్ హ్యావ్ ఐస్ 2, లెట్స్ ప్లే, లిఫ్ట్‌తోపాటు పలు హారర్ మూవీస్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ సినిమాకు ముందు, తర్వాత..
బాలీవుడ్లో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. లైలా తృప్తి డిమ్రీ. సన్నిహితులంతా ట్రాప్స్ అని పిలుచుకుంటే ఓటీటీ అభిమానులు బుల్బుల్ అంటారు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తృప్తి.. మొదట్లో కెమెరా ముందుకు రావడానికి చాలా సిగ్గుపడేదట. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్ డిమ్రీ .. ఎయిర్ ఇండియా ఉద్యోగి. తల్లి (పేరు తెలియదు).. ఇంటి బాధ్యతలు తీసుకుంది. తృప్తికి ఇద్దరు తోబుట్టువులు. 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది తృప్తి. 2018లో రొమాంటిక్ మూవీ ‘లైలా–మజ్ను’లోని లైలా పాత్రతో ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది. 2020లో హారర్ అండ్ థ్రిల్లర్ ‘బుల్బుల్’ల్తో ఓటీటీ స్టార్‌గా మారింది. అందులో తన అభినయానికి విమర్శకుల ప్రసంసలను పొందింది. నెట్ ఫ్లిక్స్ వీక్షకుల అభిమానటి అయింది. ‘బుల్బుల్’ సినిమాలో ప్రధాన పాత్ర నాకు దొరకడం చాలా హ్యాపీ. నా కెరీర్ బుల్బుల్ ముందు, తర్వాత అని చూసుకుంటే.. కచ్చితంగా మెరుగైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రేక్షకులు నన్ను లీడ్ రోల్లో చూడటానికి సిద్ధపడుతున్నారు’ అంటుంది. సినిమా ఫీల్డ్‌లోకి తృప్తి అనుకోకుండా వచ్చింది. తన సోదరుడి స్నేహితుడు ఫొటోగ్రాఫర్ కావడంతో.. ఈమె ఫొటోలు తీసి.. ఢిల్లీలోని ఇమేజెస్ బజార్‌కు పంపించాడట. వాళ్లు ఫొటో షూట్ చేయడానికి ఆమెని ఎంపిక చెయ్యడంతో ఆ ప్రయాణం మొదలైంది. కొన్నాళ్లు యూట్యూబ్ చానెల్లో కూడా పని చేసింది. ‘కెమెరా అలవాటు పడటానికి యూట్యూబ్ చానెల్ ఒక అనుభవం’ అని చెప్తుంది తృప్తి. దినేష్ డిమ్రీ నటుడు కావాలని కాలేకపోయారట. తండ్రి ఆశయాన్ని తను నెరవేర్చాలనుకుంది.. కనీసం బుల్లితెరపై నటించైనా. నటననే లక్ష్యంగా తీసుకున్న తృప్తి మొదట్లో మోడలింగ్ చేసింది. అందులో సంపాదించుకున్న పేరుతో సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడానికి ముంబై చేరింది. ‘నేను నటిని కావాలనుకుంటున్నానని మొదటిసారి ఇంట్లో చెప్పినప్పుడు.. షాక్ అయ్యారు. నటి అయితే బయటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు బంధువులతోనే సరిగా మాట్లాడవు కదా? అన్నారు. ఇప్పుడు నేను చాలా నేర్చుకుంటున్నాను. చాలా మారాను కూడా. ఛాన్స్‌ల కోసం అవసరం ఉన్నా లేకున్నా సినిమా వాళ్లందరికీ సలాం కొట్టాలనే సిద్ధాంతాన్ని నేనెప్పుడూ నమ్మను. టాలెంట్‌నే నమ్ముతాను’ అంటుంది తృప్తి డిమ్రీ. -
‘క్లాస్‌లో డౌట్స్ అడగాలన్నా భయమే’
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుల్బుల్’. ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో దీనిలో హీరోయిన్గా నటించిన త్రిప్తి దిమ్రి తెర మీద తన పాత్రకు, నిజ జీవితంలో తనకు చాలా తేడా ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా తన గురించి చెప్పుకొచ్చారు త్రిప్తి. ‘‘బుల్బుల్’ చిత్రంలో నేను పోషించిన పాత్రకు.. నిజ జీవితంలో నా ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నేను ఇంట్రావర్ట్‌ని. నా భావాలు నాలోనే దాచుకునేదాన్ని. కానీ ఈ చిత్రంలో నా పాత్ర ప్రతి దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తుంది. నిజ జీవితంలో నేను చాలా సిగ్గరిని. స్కూల్ ఫంక్షన్స్‌లో పాల్గొనేదాన్ని కాదు. కనీసం క్లాస్ రూంలో డౌట్లు కూడా అడిగేదాన్ని కాదు. లేచి నిలబడి డౌట్ అడుగుతుంటే.. మిగతా అందరూ నా వైపే చూడటం నాకు ఇష్టం ఉండదు. అయితే కాలేజీకి వచ్చేసరికి నా ఆలోచనల్లో మార్పు వచ్చింది’ అన్నారు. (ఆ దెయ్యం రక్తం తాగుతుంది తెలుసా!) త్రిప్తి మాట్లాడుతూ.. ‘స్టేజీ మీదకు ఎక్కి ప్రపంచాన్ని ఎదుర్కొవాలని భావించాను. దాంతో కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్లో పాల్గొనేదాన్ని. మోడలింగ్ ఏజెన్సీలో కూడా చేరాను. అలా నాకు అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది. అయితే మొదటి సారి నేను ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను. కెమరా ముందు నిల్చొవడం అదే మొదటి సారి. దాంతో చాలా భయపడ్డాను. అయితే ఆశ్చర్యం ఏంటంటే నేను చాలా బాగా చేశాను.. సెలక్ట్ అయ్యాను. అలా నా మొదటి సినిమా ‘పోస్టర్ బాయ్స్’ అవకాశం లభించింది’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘చాలా మంది నన్ను చూస్తే ఇబ్బంది పడే నేను ఇప్పుడు సెట్‌నే ఇంటిగా భావించే విధంగా మారాను. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. నా భయాలతో పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రోజు ఇలా ఉన్నాను’ అన్నారు త్రిప్తి. (కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు) అంతేకాక ‘నన్ను నేను నమ్మడం ప్రారంభించాను. నా లోని అభద్రతాభావాలను పట్టించుకోవడం మానేశాను. అయితే ఇప్పటికి కొత్త పరిస్థితుల్లో.. భయపడుతూనే ఉంటాను. కానీ ఆ భయాలన్నింటిని నేను జయించగలనని నాకు తెలుసు. ఒక్కటి గుర్తు పెట్టుకొండి. భయం అనేది ఓ ఫీలింగ్ మాత్రమే. ఏ భావన కూడా శాశ్వతం కాదు. దానితో పోరాడండి.. ఓడిపోయినా పర్వాలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. పోరాడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు త్రిప్తి. View this post on Instagram 🌸Growing up, I was extremely different from the character I play in Bulbbul. I was not an extrovert at all! She’s curious and excitable and I was the opposite of it. I was very shy and I never felt comfortable participating in school functions and activities. I even hated getting doubts cleared in class because I didn’t like having all those eyes on me. Something changed when I got to college. I realised it’s time I take to the stage and face the world. I became more involved in college activities and even joined a modelling agency, which turned out to be the door that opened these opportunities for me. I remember putting off giving my first audition because the thought of facing the camera terrified me. Surprisingly, I did well and I got selected, which led to my debut movie 'Poster Boys'. From being uncomfortable with so many eyes on me to now feeling at home on a set, I’ve come a long way. I am here because I chose to fight my fear and get out of my comfort zone. I chose to trust myself and stopped listening to my insecurities. I’m still nervous in new situations, I still fumble but I now know you can always overcome those fears and give it your all. Remember, fear is just a feeling and no feeling is permanent. Fight it even if you fail. You can always get back up and try again. I’m glad I chose to fight. #Bulbbul @netflix_in @officialcsfilms @anushkasharma @kans26 @anvita_dee @avinashtiwary15 @rahulbose7 @paoli_dam @parambratachattopadhyay @manojmittra @saurabhma @an5hai @siddharthdiwan @itsamittrivedi @rameshwar_s_bhagat @lifaafa_ @veerakapuree @anishjohn83 @rod__sunil @hingoraniharry @keitanyadav @redchillies.vfx @redchillies.color @kyana.emmot @castingbay @ruchi.mahajan1 @buddhadevvarun A post shared by Tripti Dimri (@tripti_dimri) on Jun 29, 2020 at 3:20am PDT -
తీరం దాటిన బుల్బుల్
సాక్షి, విశాఖపట్నం : వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతితీవ్ర తుపాను బుల్బుల్ క్రమంగా బలహీన పడనుంది. ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి శనివారం సాయంత్రం వాయువ్య బంగాళాఖాతం వద్ద పారాదీప్‌కు తూర్పు ఈశాన్య దిశగా 175 కి.మీ., పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ దిశగా 50 కి.మీ., కోల్‌కతాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా బలహీనపడుతూ తీవ్ర తుపానుగా మారింది. అనంతరం ఈశాన్య దిశగా ప్రయాణించి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుల్బుల్ తీరం దాటినప్పటికీ.. సముద్రంలో అలజడి ఉండటంతో ఆదివారం కూడా మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్ల వద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బుల్ బుల్ ప్రభావం ఎక్కువగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతాలపై ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం.. బుల్బుల్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలకు అప్రమత్తంగా ఉన్నట్లు తూర్పు నౌకాదళం ప్రకటించింది. ఈఎన్సీ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో సహాయక సామగ్రితో మూడు నౌకల్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు పయనమయ్యేందుకు ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్ స్టేషన్లో గజ ఈతగాళ్లు, జెమినీ బోట్లు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎయర్‌క్రాఫ్ట్‌ల ద్వారా నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించి.. తీవ్రతను గమనించి ఆయా ప్రాంతాలకు రిలీఫ్ మెటీరియల్ అందించనున్నామని తూర్పు నౌకాదళాధికారులు తెలిపారు. -
పెను తుపాన్‌గా మారుతున్న ‘బుల్బుల్’
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్బుల్ తుపాన్ తీవ్ర రూప దాల్చనుంది. తూర్పు బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై తుపాన్ కేంద్రీకృతమైంది. పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 750, సాగరదీవులకు 860 కి.మీల దూరంలో ఉంది. ఇది రేపటికి మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారునుంది. ఆ తర్వాత 36 గంటల్లో పెను తుపాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పెను తుపాన్‌గా మారిన తర్వాత.. పశ్చిమ వ్యాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళ్లనుంది. తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని అధికారులు చెప్పారు. తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన పోర్ట్‌లలో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. -
ఏముందిరా బుల్బుల్..
ఈ క్రీం వాడండి.. మీ వయసు ఓ పదేళ్లు తగ్గిపోతుంది.. లేదా ఈ ఫేషియల్ చేయించుకోండి మీరు అరవైలో ఇరవైలా కనిపిస్తారు వంటి యాడ్స్ మనమెన్నో చూశాం.. వయసు తగ్గుతుందంటే చాలు.. ఎంత డబ్బు పెట్టడానికైనా సిద్ధపడిపోతాం.. ఇది చివరకు ఎంత వరకూ వెళ్లిందంటే.. పక్షుల రెట్టలను కూడా పులిమేసుకునేంత వరకూ.. ఇక్కడ జరుగుతోంది కూడా అదే. ఈ పక్షి పేరు నైటింగేల్.. మన దగ్గర బుల్బుల్ పిట్ట అని అంటారు.. అయితే.. జపాన్‌లో నైటింగేల్లోని ఓ అరుదైన రకం పక్షి ఉంది. దాని రెట్టను రాసుకుంటే.. వయసు తగ్గినట్లు కనిపిస్తుందని.. మొటిమల వల్ల ముఖంపై వచ్చే మచ్చలను అది తొలగిస్తుందన్నది జపానోళ్ల విశ్వాసం. అక్కడ 17వ శతాబ్దంలోనే ఈ నైటింగేల్ ఫేషియల్ ఫేమస్. తర్వాత అది ఆ నోటా ఈ నోటా పాకి.. విదేశాలకూ చేరింది. ఈ ఫేషియల్ అంటే పడి చచ్చే జాబితాలో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్, విక్టోరియా బెక్హాం వంటి వారూ చేరారు. ఓ సారి పులుముకుంటే రూ.20 వేలు సమర్పించుకోవాల్సిందే. ఎందుకింత ధర అంటే.. జపాన్‌లో స్థానిక నైటింగేల్ పిట్టలు తగ్గిపోతుండటంతో దాని రెట్టకూ డిమాండ్ పెరిగింది. పైగా.. నైటింగేల్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి ఏది పడితే అది పెట్టరు. పళ్లు లాంటి మంచి ఫుడ్ మాత్రమే పెడతారు. పురుగులు తినడం నిషిద్ధం. ఇంత మంచి ఫుడ్ తినడం వల్ల వచ్చే మంచి రెట్టతో ఎంతో మంచి జరిగిపోతుందట. దాన్ని పౌడర్ కింద మార్చి.. మరికొన్ని పదార్థాలు కలిపి.. ఫేషియల్ చేస్తారు. ఈ ఫేషియల్కు మంచి డిమాండ్ ఉంది.