
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్‌బుల్ తుపాన్ తీవ్ర రూప దాల్చనుంది. తూర్పు బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై తుపాన్ కేంద్రీకృతమైంది. పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 750, సాగరదీవులకు 860 కి.మీల దూరంలో ఉంది. ఇది రేపటికి మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారునుంది. ఆ తర్వాత 36 గంటల్లో పెను తుపాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు
పెను తుపాన్‌గా మారిన తర్వాత.. పశ్చిమ వ్యాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళ్లనుంది. తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని అధికారులు చెప్పారు. తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన పోర్ట్‌లలో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment