సాక్షి, విజయవాడ: పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా వాయుగుండం కదులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు.. కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాట్లు చేశామని.. వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ విపత్తుల నిర్వహణ సంస్థ. మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment