
సాక్షి,విశాఖపట్నం: ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సుంది.
అల్పపీడనానికి సంబంధించిన వివరాలతో వాతావరణ శాఖ పూర్తిస్థాయి బులెటిన్‌ను త్వరలో విడుదల చేయనుంది. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడి తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
ఈ వర్షాలకు ఏపీలోని విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంపునకు గురైన విజయవాడ తదితర ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే మరో తుపాను ముప్పుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటం ఏపీ వాసులను కలవరపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment