
సినీ ప్రియులు మాత్రం ప్రతి జోనర్‌ను విడిచిపెట్టకుండా చూస్తారు. కానీ కొందరు ప్రేక్షకులు పర్టిక్యూలర్ జోనర్స్ మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫాంటసీ, స్కై ఫై, టైమ్ ట్రైవేల్, సూపర్ హీరోస్ వంటి జోనర్స్‌ను ఇష్టపడితే కొందరికి వెన్నులో వణుకు పుట్టించే హారర్ చిత్రాలు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మూవీ లవర్స్‌కు ఫేవరేట్‌గా మారిపోయాయి. కరోనాతో లాక్‌డౌన్ ఏర్పడిన సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రత్యమ్నాయంగా నిలిచిన ఈ ఓటీటీల హవా ఇంకా జోరుగా సాగుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించడంలో తగ్గేదే లే అంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది నెట్‌ఫ్లిక్స్. ఎప్పుడూ సరికొత్త హంగులతో ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది.
అయితే సినీ ప్రియులు మాత్రం ప్రతి జోనర్‌ను విడిచిపెట్టకుండా చూస్తారు. కానీ కొందరు ప్రేక్షకులు పర్టిక్యూలర్ జోనర్స్ మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫాంటసీ, స్కై ఫై, టైమ్ ట్రైవేల్, సూపర్ హీరోస్ వంటి జోనర్స్‌ను ఇష్టపడితే కొందరికి వెన్నులో వణుకు పుట్టించే హారర్ చిత్రాలు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వారికోసమే శుక్రవారం (మే 13) అతిగా భయపెట్టే 6 హారర్ సినిమాలను చూడమని సజ్జెస్ట్ చేస్తూ టైటిల్స్ తెలిపింది నెట్‌ఫ్లిక్స్. 'ఈ 13 తేదిన భయపడేందుకు ఈ సినిమాలు చూడండి' అని ట్వీట్ చేసింది.
చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు..
అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు..
#WhatToWatchOnNetflix
— Netflix India (@NetflixIndia) May 13, 2022
🎥:
1. Bulbbul
2. The Conjuring
3. The Conjuring 2
4. The Haunting Of Hill House
5. Hereditary
6. Insidious: The Last Key
నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరో ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా హారర్ మూవీస్‌ను సజ్జెస్ట్ చేసింది. తన ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న హారర్ సినిమాల టైటిల్స్‌ను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. వీటిలో ది పాస్ట్, అమరికన్ హారర్ స్టోరీస్, ది హిల్స్ హ్యావ్ ఐస్ 2, లెట్స్ ప్లే, లిఫ్ట్‌తోపాటు పలు హారర్ మూవీస్ ఉన్నాయి.