
న్యూఢిల్లీ: కోహ్లి–అనుష్క... ఇటీవల సోషల్ సైట్‌లు చూసినా, న్యూస్ పేపర్లు తిప్పేసినా, టీవీ చానెళ్లు మార్చినా... వీరిద్దరి పెళ్లిమాటే! కానీ వీళ్లు మాత్రం... పెళ్లంటే కాదన్నారు. ఇటలీ వేదికంటే పుకార్లన్నారు. తీరా ఏర్పాట్లు పూర్తయ్యాయంటే లేదన్నారు. కానీ ఇప్పుడు పెళ్లి... ఇక పీటల మీదికి ఎక్కడమే తరువాయి. ఈ నెల 12న మంగళవారం ఇటలీలోని టస్కనీ నగరంలోని ఓ రిసార్ట్‌లో ‘విరుష్క’ల వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. అక్కడి రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు.
ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు. కాగా డిసెంబర్ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథమహారథులంతా హాజరుకానునట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే క్రికెటర్లకు, బాలీవుడ్ స్టార్లకు ఆహ్వానాలు అందాయి. రిసెప్షన్ ముగిసిన మరుసటి రోజే (డిసెంబర్ 27) భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment