ఎందుకంత దూకుడు? | Anushka Sharma Will Be Producing 3 Films In 2016 | Sakshi
Sakshi News home page

ఎందుకంత దూకుడు?

Published Sat, Dec 12 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

ఎందుకంత దూకుడు?

ఎందుకంత దూకుడు?

 అనుష్కా శర్మ జీవితం చాలా బాగుందనే చెప్పాలి. కథానాయికగా సక్సెస్‌లు, నిర్మాతగా ‘ఎన్‌హెచ్10’తో ఓ సక్సెస్. మొత్తానికి ఆమె కెరీర్ జోరు మీద ఉంది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... క్రికెట్ క్రీడాకారుడు విరాట్ కోహ్లీతో లవ్ జర్నీ కూడా బాగుంది. ఆల్ హ్యాపీస్ కాబట్టి, అనుష్కా శర్మ ఆనందానికి అవధులు లేవు. వృత్తిపరంగా భవిష్యత్ ప్రణాళికలు కూడా వేసేసుకున్నారు. ముచ్చటగా మూడు చిత్రాలను నిర్మించాలని ఆమె అనుకుంటున్నారు. వీటిలో రెండు చిత్రాలకు కొత్తవాళ్ళు దర్శకులు.
 
 ఒకరు అక్షత్ వర్మ. ఈయన ‘ఢిల్లీ బెల్లీ’ చిత్రానికి రచయితగా చేశారు. మరొకరు ‘హౌస్‌ఫుల్’, ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ లాంటి చిత్రాలతో దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన అన్‌షాయ్ లాల్. అలాగే, ‘ఎన్‌హెచ్ 10’ దర్శకుడు నవదీప్ సింగ్‌తో కూడా ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారు అనుష్కా శర్మ. ప్రస్తుతం ఈ చిత్రాలకు సంబంధించిన కథలను తన సోదరుడు కర్ణేశ్‌తో కలిసి వడపోసే కార్యక్రమంలో ఉన్నారు.
 
  ‘‘ఈ మూడు చిత్రాల్లో రెండు వినోద ప్రధానంగా సాగుతాయి. మరొకటేమో థ్రిల్లర్ మూవీ. స్క్రిప్ట్‌వర్క్ తుదిదశలో ఉంది. కొత్త సంవత్సరంలో చిత్రీకరణ మొదలుపెడతాం. అయితే, ఏ చిత్రం ముందు ప్రారంభిస్తామనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు’’ అని అనుష్కా శర్మ తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement