మామగారి కానుక | poem's poem is Smoke and Whiskey | Sakshi
Sakshi News home page

మామగారి కానుక

Published Fri, Feb 9 2018 11:47 PM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

poem's poem is Smoke and Whiskey - Sakshi

అనుష్క, విరాట్‌: పెళ్లినాటి ఫొటో

అబ్బాయిల్లో అనుష్కా శర్మకు పెద్ద ఫ్యాన్‌ ఫాలోయిం  ఉంది. వాళ్లందరిలో  ఫ్యాన్‌ బాయ్‌ నెంబర్‌ 1 విరాట్‌ కోహ్లీ. అమ్మాయిల్లో విరాట్‌కు కూడా అంతే ఫాలోయింగ్‌ ఉంది. వాళ్లందరిలో ఫ్యాన్‌ గర్ల్‌ నెంబర్‌ 1 అనుష్క. విరాట్‌ సెంచరీ చేసిన ప్రతిసారీ ఫస్ట్‌ విజిల్‌ అనుష్కదే. అనుష్క కొత్త సినిమా వస్తున్న ప్రతిసారీ ఆ మూవీ గురించి ఎక్కువగా మాట్లాడేది కోహ్లీనే. ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ ఇప్పుడు భారతదేశానికి యువ ఆదర్శ దంపతులు. ఈ దంపతులకు ఇప్పుడు విరాట్‌ అత్తమామలు (అనుష్క పేరెంట్స్‌) అజయ్‌ కుమార్‌ శర్మ, అషిమలు కూడా ఫ్యాన్స్‌ అయినట్లున్నారు. వర్ధమాన కవయిత్రి తేజస్వినీ దివ్యా నాయక్‌ రాసిన తొలి పుస్తకం ‘స్మోక్‌ అండ్‌ విస్కీ’ ఆవిష్కరణ సభకు భార్యతో కలిసి వెళ్లిన విరాట్‌ మామగారు... 

ఆ సభా ప్రాంగణంలోనే క్యూలో నిలబడి మరీ.. తేజస్విని సంతకం ఉన్న రెండు పుస్తకాలను కొని, వాటిని విరాట్‌ అనుష్కల కోసం దాచి ఉంచారు! అనుబంధాలపై రాసిన 42 కవితల సంకలనం ‘స్మోక్‌ అండ్‌ విస్కీ’. ప్రస్తుతం విరాట్‌ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అనుష్క.. షారుక్‌ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘జీరో’ చిత్రం షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఈ జంటను ఒకటిగా చూడడం కోసం రెండు కుటుంబాల వాళ్లు ఎదురు చూస్తున్నట్టే.. కరణ్‌ జోహార్‌ కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’లో వీళ్లను కలిపి చూపాలని టీవీ చానల్స్‌ కూడా తహతహలాడుతున్నాయి. అంతవరకు మనం విరాట్‌ క్రికెట్‌ విన్యాసాలతో, మార్చి 2న విడుదల కాబోతున్న ‘పరీ’ సినిమాతో సంతృప్తి పడవలసిందే!


కవయిత్రి తేజస్వినీ దివ్య నాయక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement