Shahrukh Khan's Zero Movie New Posters Released on the Occasion of His Birthday - Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 9:53 AM | Last Updated on Thu, Nov 1 2018 11:31 AM

Shah Rukh Khan Zero New Posters - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జీరో. షారూఖ్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ ఎల్‌ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లతో పాటు టీజర్‌లను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్ తాజాగా షారూఖ్‌ పుట్టిన రోజు (నవంబర్‌ 2) సం‍దర్భంగా హీరోయిన్లను పరిచయం చేస్తూ రెండు పోస్టర్లను రిలీజ్‌ చేశారు.

అనుష్క శర్మతో కలిసి వీల్‌ చైర్‌లో సరదాగా ఉన్న షారూఖ్‌ పోస్టర్‌తో పాటు రొమాంటిక్‌గా కత్రినా కళ్లలోకి చూస్తున్న రెండు పోస్టర్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. షారూఖ్‌ సతీమణి గౌరీఖాన్‌ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, కరుణా బద్వాల్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  అజయ్‌ అతుల్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement