Shahrukh Khan Said Thanks in Twitter to His Fans for their Wishes and Love on His Birthday - Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 10:46 AM | Last Updated on Fri, Nov 2 2018 12:56 PM

Shahrukh Khan Thanks To All Fans On His Birthday - Sakshi

షారుఖ్‌ఖాన్‌-గౌరీ

సాక్షి, ముంబై : 53వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ బాద్‌షా తన పుట్టిన రోజు వేడుకలు గురువారం అర్ధరాత్రి ఘనంగా జరుపుకున్నారు. బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు తన ఇంటికొచ్చిన వేలాదిమంది అభిమానులకు షారుఖ్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. బాల్కనీలో నిలబడి అభిమానులకు చేతులు జోడించి అభివాదం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సతీమణి గౌరీ, పిల్లలు ఆర్యన్‌, సుహానా, అబ్రామ్‌తో షారుఖ్‌ ఆనందాన్ని పంచుకున్నారు. గౌరీకి కేక్‌ తినిపించిన ఫోటో, అభిమానులకు అభివాదం చేస్తున్న ఫోటోలు ట్వీట్‌ చేశారు. 

‘నా అర్ధాంగికి కేక్‌ తినిపించా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన నా అభిమాన కుటుంబాన్ని కలుసుకున్నా. ఇప్పుడు నా గారాల పట్టీలతో ఆడుకుంటున్నా. ఎనలేని మీ ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. విశేషమేమంటే. గౌరీకి కేక్‌ తినిపిస్తున్న షారుఖ్‌ ఫోటోను దర్శకుడు కరణ్‌జోహర్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘హ్యాపీ బర్త్‌ డే షారుఖ్‌. నువ్వూ, గౌరీ నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. మీతో పరిచయం నా జీవితంలో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నా. మీలో ఒకడిగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్‌’ అంటూ రాసుకొచ్చారు.

మరుగుజ్జు పాత్రలో షారుఖ్‌ నటిస్టున్న ‘జీరో’ చిత్రం ఘనవిజయం సాధించాలని కరణ్‌ ఆకాక్షించారు. కాగా, ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో షారుఖ్‌ నటిస్తున్న‘జీరో’ సినిమా డిసెంబర్‌ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షారుఖ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు (నవంబర్‌ 2 ) ‘జీరో’ ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నారు. (జీరో’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది : ఆమిర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement